ఇది సంక్రాంతి ‘బాస్’బస్టర్.. బాస్ ఈజ్ బ్యాక్: మన శంకరవరప్రసాద్ గారుపై అల్లు అర్జున్ రివ్యూ

చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీకి రివ్యూ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాను అతడు సంక్రాంతి బాస్‌బస్టర్ అని అనడం విశేషం. ఎక్స్ వేదికగా బన్నీ ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది.

Published on: Jan 20, 2026, 17:24:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు ఈ సంక్రాంతి విజేతగా నిలిచిన విషయం తెలుసు కదా. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లతో రికార్డులు తిరగరాసిన ఈ సినిమాకు తాజాగా అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీ సంక్రాంతి బ్లాక్‌బస్టరే కాదు.. సంక్రాంతి బాస్‌బస్టర్ కూడా అంటూ తనదైన స్టైల్లో చెప్పాడు.

ఇది సంక్రాంతి ‘బాస్’బస్టర్.. బాస్ ఈజ్ బ్యాక్: మన శంకరవరప్రసాద్ గారుపై అల్లు అర్జున్ రివ్యూ
ఇది సంక్రాంతి ‘బాస్’బస్టర్.. బాస్ ఈజ్ బ్యాక్: మన శంకరవరప్రసాద్ గారుపై అల్లు అర్జున్ రివ్యూ

బాస్ ఈజ్ బ్యాక్..

సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా విజయంపై తాజాగా అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ కూడా వైరల్ అవుతోంది.

"మొత్తం టీమ్‌కు కంగ్రాట్స్. బాస్ ఈజ్ బ్యాక్.. లిట్ (L-I-T). మా మెగాస్టార్ చిరంజీవి గారు స్క్రీన్‌ను వెలిగించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఫుల్ వింటేజ్ వైబ్స్ కనిపిస్తున్నాయి" అని ఆ పోస్ట్‌లో అల్లు అర్జున్ అన్నాడు.

వెంకీ గౌడ.. తుంబా చెన్నైగి మాడిదీరా

సినిమాలో గెస్ట్ రోల్ చేసిన విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. "వెంకీ మామ రాక్డ్ ది షో. వెంకీ గౌడ.. తుంబా చెన్నైగి మాడిదీరా (చాలా బాగా చేశారు)" అంటూ కన్నడలో కితాబిచ్చాడు. నయనతార గ్రేస్, క్యాథరిన్ థ్రెసా హ్యూమర్, ముఖ్యంగా ‘సంక్రాంతి స్టార్ బుల్లిరాజు’ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ అదిరిపోయాయని రాసుకొచ్చాడు.

సంక్రాంతి హిట్ల మిషన్..

దర్శకుడు అనిల్ రావిపూడిని ‘సంక్రాంతి బ్లాక్ బస్టర్ మిషన్’గా అభివర్ణించాడు. "సంక్రాంతికి వస్తారు - హిట్ కొడతారు - రిపీటు" అంటూ అనిల్ ట్రాక్ రికార్డును గుర్తు చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, హుక్ స్టెప్, మెగాస్టార్ విక్టరీ వెంకటేష్ సాంగ్స్ విజిల్స్ వేయించేలా ఉన్నాయని మెచ్చుకున్నాడు.

ఇది ‘బాస్’ బస్టర్

చివరగా, "ఇది కేవలం సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. ఇదొక సంక్రాంతి బాస్‌బస్టర్ (BOSS-buster)" అంటూ ఇచ్చిన పంచ్ లైన్ మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. నిర్మాత సుష్మిత కొణిదెల, సాహు గారపాటిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు అల్లు అర్జున్.

సినిమాను బ్లాక్‌బస్టర్ చేయడంతో చిరంజీవి కూడా మంగళవారం (జనవరి 20) ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులు, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో చిరు కూడా అనిల్ రావిపూడిని హిట్ మెషీన్ గా అభివర్ణించడం విశేషం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More