...
...
Next Story

Today bank holiday : నేడు బక్రీద్.. మరి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉందా? లేదా?

Is today bank holiday : నేడు ముస్లింలు పవిత్ర బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్​ మార్కెట్​లకు సెలవు ఉంది. మరి ఈరోజు బ్యాంకులకు కూడా సెలవు ఉందా? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: May 28, 2026, 08:14:23 IST
Advertisement

బ్యాంకు వినియోగదారులకు ముఖ్య గమనిక! పవిత్ర 'బక్రీద్' పండుగను పురస్కరించుకుని ఈరోజు, గురువారం (28 మే 2026) దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బక్రీద్‌ను గెజిటెడ్ సెలవుదినంగా ప్రకటించడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలు, మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు నేడు మూతపడనున్నాయి.

ఈరోజు బ్యాంకులకు సెలవు ఉందా? లేదా?
ఈరోజు బ్యాంకులకు సెలవు ఉందా? లేదా?

బక్రీద్ పండుగ సెలవును మొదట మే 27న నిర్ణయించినప్పటికీ, చంద్రదర్శనం ఆధారంగా కేంద్ర సిబ్బందికార్యాలయ మంత్రిత్వ శాఖ సవరించిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ హాలిడేను మే 28వ తేదీకి మార్చారు.

రాష్ట్రాల వారీగా సెలవుల వివరాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవల అప్‌డేట్ ఇక్కడ చూద్దాం:

బక్రీద్ 2026- ఈ రాష్ట్రాల్లో సెలవు తేదీల్లో మార్పులు..

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం బక్రీద్ పండుగ చంద్రదర్శనంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్థానిక ప్రభుత్వాల నోటిఫికేషన్ల ప్రకారం కొన్ని ప్రాంతాలలో ఈ సెలవుల్లో మార్పులు ఉన్నాయి:

మే 28 (గురువారం): తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెజారిటీ భారతీయ నగాల్లో నేడు బ్యాంకులు పూర్తిగా బంద్.

కాగా జమ్ము, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో స్థానిక మార్పుల ఆధారంగా నిన్ననే (మే 27) సెలవును పాటించారు.

Bakrid 2026 : ముస్లింలు బక్రీద్​ని ఎందుకు జరుపుకుంటారు? గొర్రెలను ఎందుకు బలి ఇస్తారు?

మే నెలలో బ్యాంక్ సెలవుల లిస్ట్..

బ్యాంకు శాఖలు మూతపడినప్పటికీ, కస్టమర్ల రోజువారీ అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.

ఆర్​టీజీఎస్, ఎన్​ఈఎఫ్​టీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపుకునే ఆర్​జీఎస్, ఎన్​ఈఎఫ్​టీ సేవలు 24x7x365 రోజులూ నిరంతరాయంగా పనిచేస్తాయి.

డిజిటల్ ట్రాన్సాక్షన్స్: మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్లు (గూగుల్ పే, ఫోన్​పే, పేటీఎం మొదలైనవి) ఎప్పటిలాగే సజావుగా సాగుతాయి.

ఏటీఎం సేవలు: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏటీఎం కేంద్రాలు పనిచేస్తాయి. వినియోగదారులు నగదు విత్‌డ్రా, డిపాజిట్లను సులభంగా చేసుకోవచ్చు. అదనంగా కొత్త చెక్‌బుక్ కోసం దరఖాస్తు చేయడం, ఆన్‌లైన్ లోన్ల వంటి సేవలను కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.

బక్రీద్ 2026 సందర్భంగా బ్యాంకులే కాదు, స్టాక్​ మార్కెట్​లకు సైతం ఈరోజు సెలవు ఉండనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks