...
...
Next Story

Vaibhav Sooryavanshi : ఇండియన్​ జెర్సీలో వైభవ్​! ఆ జట్టుపై తొలి మ్యాచ్​- సచిన్​ కన్నా తక్కువ వయస్సులో..

Vaibhav Sooryavanshi Team India : భారత క్రికెట్‌లో మరో 'వండర్ కిడ్' ఉద్భవించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన బ్యాటింగ్‌తో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ, త్వరలోనే టీమ్ ఇండియా జర్సీ ధరించబోతున్నాడనే వార్తలు ఇప్పుడు క్రీడాలోకంలో సంచలనం రేపుతున్నాయి.

Published on: Apr 14, 2026 01:30 PM IST
Advertisement

Vaibhav Sooryavanshi age : భారత క్రికెట్ దిగ్గజాలు,​ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘట్టం అతి త్వరలోనే ఆవిష్కృతం అయ్యేడట్టు కనిపిస్తోంది! 'వండర్​ కిడ్​', డ్యాషింగ్​ ఓపెనర్​, యంగ్​ గన్​ వైభవ్​ సూర్యవంశీ ఇంకొన్ని రోజుల్లో టీమిండియా జెర్సీలో మెరవనున్నట్టు సమాచారం. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే క్రమంలో అజిత్​ అగార్కర్​ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్​ కమిటీ.. జూన్​ నెలల జరగనున్న ఐర్లాండ్​ పర్యటనకు వైభవ్​ను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం అతడి పేరును షార్ట్​లిస్ట్​ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

వైభవ్​ సూర్యవంశీ (PTI)
వైభవ్​ సూర్యవంశీ (PTI)

అన్ని అనుకున్నట్టు జరిగితే.. జూన్ 26, 28 తేదీల్లో జరగనున్న రెండు టీ20ల సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం చేస్తాడు.

సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు?

ఒకవేళ వైభవ్ గనుక ఐర్లాండ్ టూర్‌లో బరిలోకి దిగితే, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్సులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు! ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉన్న ఈ రికార్డు ఇప్పుడు స్మాష్​ అయిపోతుంది

వైభవ్​ సూర్యవంశీ ఇటీవలే తన 15వ పుట్టినరోజును జరుపుకున్నాడు.

ఐపీఎల్ 2026లో విధ్వంసం..

వాస్తవానికి గతేడాది కాలంగా వైభవ్​ సూర్యవంశీ అద్భుతంగా రాణిస్తున్నాడు. దేశవాళీ టోర్నీలతో పాటు విదేశీ టూర్లలోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ అందరిని ఆకర్షిస్తున్నాడు. అయితే, అతని పేరు ఈ స్థాయిలో మారుమోగిపోవడానికి కారణం మాత్రం ఈ ఐపీఎల్​ 2026 అనే చెప్పుకోవాలి.

దిగ్గజాలపై విరుచుకుపడి: ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మొదటి బంతికే సిక్సర్ కొట్టడం ద్వారా వైభవ్ తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌ను చాటిచెప్పాడు.

టాప్ బౌలర్లపై ఆధిపత్యం: జోష్ హాజిల్‌వుడ్ వేసిన ఒకే ఓవర్‌లో 19 పరుగులు సాధించడంతో పాటు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు.

ఇన్ని చూసిన తర్వాత.. మాజీ ప్లేయర్ల నుంచి కామెంటేటర్ల వరకు సూర్యవంశీ టీమిండియాలో త్వరలోనే కనిపిస్తాడని అందరు అంచనాలకు వచ్చేశారు.

అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుతం..

ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్‌కు ఆరోసారి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ అద్భుత ఇన్నింగ్స్ చూసిన మైఖేల్ వాన్ వంటి దిగ్గజాలు, వైభవ్‌ను వెంటనే సీనియర్ జట్టులోకి తీసుకోవాలని సూచించారు.

"వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అద్భుతం. అతని ప్రతిభకు తగినట్టుగా టీమ్ ఇండియా తరపున అతి పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసే అవకాశం అతనికి ఖచ్చితంగా దక్కాలి," అని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు.

భవిష్యత్తు ప్రణాళిక..

ఒకవేళ ఐర్లాండ్ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ రాణిస్తే, జులై 23 నుంచి 26 వరకు జరిగే జింబాబ్వే పర్యటనకు కూడా అతను ఎంపికయ్యే అవకాశం ఉంది. వచ్చే టీ20 ప్రపంచకప్ సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ యువ సంచలనాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. వైభవ్ సూర్యవంశీ ఏ రాష్ట్రానికి చెందినవాడు?

వైభవ్ సూర్యవంశీ బీహార్ రాష్ట్రానికి చెందినవారు. దేశవాళీ క్రికెట్‌లో బీహార్ తరపున ఆడుతున్నారు.

2. ఐపీఎల్‌లో వైభవ్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు?

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్​ఆర్) జట్టు తరపున ఆడుతున్నారు. ఈ జట్టు అతనిని రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది.

3. వైభవ్ అరంగేట్రం చేస్తే ఎవరి రికార్డును బ్రేక్ చేస్తాడు?

భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 'యంగెస్ట్ డెబ్యూటంట్' రికార్డును వైభవ్ బ్రేక్ చేస్తారు. సచిన్ 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేయగా, వైభవ్ 15 ఏళ్లకే బరిలోకి దిగుతాడు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe