Protein Condom : ఇది ప్రపంచంలోనే తొలి ‘ప్రోటీన్​’ కండోమ్​- నెటిజన్లను ఊరిస్తున్న బీస్ట్ లైఫ్ ప్రకటన!

ఫిట్‌నెస్ బ్రాండ్ 'బీస్ట్ లైఫ్' ప్రపంచంలోనే మొట్టమొదటి 'ప్రోటీన్ కండోమ్‌'ను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది నిజమైన ఉత్పత్తియా లేక ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ ఆ అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

Published on: Mar 30, 2026 6:02 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిట్‌నెస్ ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలు రావడం సహజమే కానీ, తాజాగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త మాత్రం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇప్పటివరకు ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ బార్ల గురించి విన్న మనకు, ఇప్పుడు ఏకంగా "ప్రోటీన్ కండోమ్స్" పరిచయమయ్యాయి! అవును, మీరు చదివింది నిజమే! ప్రముఖ ఇండియన్ ఫిట్‌నెస్ బ్రాండ్ ‘బీస్ట్ లైఫ్’ ఈ వింత ప్రకటనతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ప్రోటీన్​ కండోమ్స్..
ప్రోటీన్​ కండోమ్స్..

ప్రపంచంలోనే తొలి ప్రోటీన్​ కండోమ్​!

ప్రముఖ కంటెంట్ క్రియేటర్, ఫిట్‌నెస్ ఫ్రీక్ గౌరవ్ తనేజా స్థాపించిన ఈ బ్రాండ్, ఆదివారం ఒక సర్‌ప్రైజ్ పోస్ట్ పెట్టింది.

"ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రోటీన్ కండోమ్‌ను పరిచయం చేస్తున్నాము.. మీ నైట్ పర్ఫార్మెన్స్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి మేము వస్తున్నాము," అంటూ ఇన్​స్టాగ్రామ్‌లో పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సప్లిమెంట్లకు పేరొందిన ఈ బ్రాండ్ నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన ఈ పోస్ట్​ని ఇక్కడ చూసేయండి :

సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు..

ఈ ప్రోటీన్​ కండోమ్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? కామెంట్ సెక్షన్లో జోకులు, సెటైర్లతో రెచ్చిపోతున్నారు.

"ఇది వే-ఐసోలేటా లేక నార్మల్ ప్రోటీనా?" అని ఒకరు ప్రశ్నిస్తే..

"అవసరం లేని సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరికింది" అంటూ మరొకరు చమత్కరించారు.

"ఇలాంటి ప్రోటీన్ కండోమ్ గురించి మా వంశంలోనే వింటున్న మొదటి వ్యక్తిని నేనే" అని ఇంకొకరు నవ్వులు పూయించారు.

"బీస్ట్ లైఫ్ అన్ని విభాగాల్లోనూ పర్ఫార్మెన్స్ చూపిస్తోంది" అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Dhurandhar 2 : ఆదిత్య ధర్​ పీక్​ డీటైలింగ్​ ఫెయిల్​! షేక్​ హ్యాండ్​తో 'బడే సాహెబ్​'ని అలా చేయడం అసాధ్యం?

ఇదంతా ఏప్రిల్ ఫూల్ ప్లానేనా?

ఈ ప్రోటీన్​ కండోమ్​ ప్రకటన చూస్తుంటే ఇదంతా 'ఏప్రిల్ ఫూల్' ప్రాంక్ కోసమేనని మెజారిటీ నెటిజన్లు ఫిక్స్​ అయిపోయారు. ఏప్రిల్ 1 దగ్గర పడుతుండటంతో, బ్రాండ్ ప్రమోషన్ కోసం చేస్తున్న గిమ్మిక్కు ఇదని చాలా మంది కొట్టిపారేస్తున్నారు.

"ఏప్రిల్ ఫూల్ చేయడానికి గట్టిగానే ప్లాన్ చేశారు" అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై బ్రాండ్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.

పోస్ట్​లో "కమింగ్​ సూన్​" అని ఉండటం గమనార్హం. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

గతంలోనూ డిజిటల్ కండోమ్..

ఇలాంటి వింత ఆలోచనలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో జర్మనీకి చెందిన 'బిల్లీ బాయ్' అనే సంస్థ ‘క్యామ్‌డోమ్’ పేరుతో ఒక డిజిటల్ కండోమ్ యాప్‌ను తీసుకొచ్చింది. సన్నిహితంగా ఉన్న సమయంలో ఎవరూ అనధికారికంగా వీడియోలు తీయకుండా అడ్డుకోవడమే ఆ యాప్ ఉద్దేశం.

ఇక ఈ 'ప్రోటీన్ కండోమ్' నిజంగా మార్కెట్​లోకి వస్తుందా లేక కేవలం ఫన్నీ మార్కెటింగ్ స్టంటా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. కండోమ్ వాడటం వల్ల గర్భధారణను 100% నిరోధించవచ్చా?

సమాధానం: సాధారణంగా ఏ గర్భనిరోధక సాధనమూ 100% గ్యారెంటీ ఇవ్వదు. అయితే, కండోమ్‌లను సరైన పద్ధతిలో వాడితే అవి 98% వరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. పొరపాట్ల వల్ల (ఉదాహరణకు: గడువు ముగిసినవి వాడటం, సరిగ్గా ధరించకపోవడం లేదా చిరిగిపోవడం) ఈ ప్రభావం 85% నుంచి 82% కి తగ్గే అవకాశం ఉంది. అందుకే నాణ్యమైన కండోమ్‌లను ఎంచుకోవడం, వాటి ఎక్స్‌పైరీ డేట్ చూసుకోవడం చాలా ముఖ్యం.

2. ఒకేసారి రెండు కండోమ్‌లు వాడటం వల్ల రక్షణ పెరుగుతుందా?

సమాధానం: ఖచ్చితంగా పెరగదు, పైగా అది ప్రమాదకరం. ఒకేసారి రెండు కండోమ్‌లు వాడటం వల్ల వాటి మధ్య ఫ్రిక్షన్ ఏర్పడి, కండోమ్‌లు చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్షణను పెంచడానికి బదులు, గర్భధారణ లేదా లైంగిక వ్యాధులు సోకే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఎప్పుడూ ఒకే ఒక కొత్త కండోమ్‌ను మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More