బెంగళూరులో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! ఓ కుటుంబాన్ని తీసుకెళుతున్న ద్విచక్ర వాహనాన్ని కారుతో వేగంగా ఢీకొట్టిన అనంతరం, ఓ వ్యక్తి ఘటనాస్థలం అక్కడి నుంచి పారిపోయాడు. తాజాగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే..

ఈ దారుణ సంఘటన గత నెలలో ఎం.ఎస్. రామయ్యా ఆసుపత్రి సమీపంలో జరిగింది. అప్పుడు భార్యాభర్తలతో పాటు వారి చిన్నారి స్కూటర్‌పై ప్రయాణిస్తున్నారు. కారు నడుపుతున్న 23 ఏళ్ల సుకృత్ అనే యువకుడు స్కూటర్‌ను అతి వేగంతో ఢీకొట్టాడు.
తాకిడి బలంగా ఉండడంతో, స్కూటర్ అదుపుతప్పి డివైడర్ పై నుంచి ఎగిరి పడింది. స్కూటర్ మీద ఉన్న ముగ్గురు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో కుటుంబం మొత్తం గాయపడింది.
ఈ ఘటనలో మహిళకు చేయి, తల, భుజాలపై గాయాలయ్యాయి. పురుషుడికి పక్కటెముకలకు దెబ్బ తగిలింది.వెంటనే అప్రమత్తమైన అటుగా వెళున్న ప్రయాణికులు వారిని ఆసుపత్రికి తరలించారు.
సీసీటీవీ ద్వారా నిందితుడి గుర్తింపు..
సంఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించిన పోలీసులు కారు నంబర్‌ను గుర్తించి, నిందితుడు సుకృత్‌ను పట్టుకున్నారు.
అనంతరం అతడిని అరెస్టు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, గాయాలకు కారణం కావడం, ప్రమాదం జరిగిన తర్వాత పారిపోవడం వంటి సెక్షన్ల కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోపంతోనే ఢీకొట్టాడా?
స్కూటర్ని కారు ఢీకొట్టడానికి గల కారణంపై పోలీసులకు ఒక విషయాన్ని చెప్పాడు నిందితుడు సుకృత్. ఘటన జరగడానికి కొంతసేపటి ముందు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్కూటర్ నడుపుతున్న వ్యక్తి తనను చూసి హారన్ కొట్టడం తనకు కోపం తెప్పించిందని, అందుకే ఉద్దేశపూర్వకంగానే స్కూటర్‌ను కారుతో ఢీకొట్టినట్టు చెప్పాడు!
ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి రాష్ డ్రైవింగ్ కేసుల నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారా?
{{/usCountry}}ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి రాష్ డ్రైవింగ్ కేసుల నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారా?
{{/usCountry}}