ఐటీ రాజధాని బెంగళూరులో ఇళ్లు, వ్యాపార సముదాయాలు కలిగిన పన్ను చెల్లింపుదారులకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) ఊహించని షాక్ ఇచ్చింది! ఇప్పటివరకు ఉన్న ఆస్తి పన్నుతో పాటు ఇక నుంచి అదనంగా ప్రతీ ఏటా ‘సాఫ్ట్‌వేర్ ఛార్జీ’ వసూలు చేయడం ప్రారంభించింది. ఎలాంటి ముందస్తు అధికారిక ప్రకటన లేకుండా, ఆర్థిక సంవత్సరం మధ్యలోనే ఈ పెంపును అమల్లోకి తీసుకురావడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

ఐటీ కారిడార్‌గా పేరొందిన బెంగళూరులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి స్థిరపడిన వేలాది మంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలు సొంత ఆస్తులు కలిగి ఉన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా అమల్లోకి తెచ్చిన ఈ నూతన రుసుములు ఇప్పుడు స్థానిక పన్నుదారుల జేబులకు చిల్లులు పొడుస్తున్నాయి.
ఆస్తి పన్నుపై ఎంత అదనపు భారం?
జీబీఏ పరిధిలోని ఐదు ప్రధాన కార్పొరేషన్ల ద్వారా ఈ రుసుములను వసూలు చేస్తున్నారు. నివాస గృహాల యజమానులు ప్రతీ ఏటా రూ. 200 చొప్పున చెల్లించాల్సి ఉండగా, వాణిజ్య సముదాయాల యజమానులు రూ. 1,000 అదనంగా కట్టాలని అధికారులు నిబంధన విధించారు. పౌరులు ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను చెల్లించేందుకు వినియోగిస్తున్న సాంకేతిక వ్యవస్థల నిర్వహణ కోసమే ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు అథారిటీ వెల్లడించింది.
అయితే కనీస సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా పన్ను పోర్టల్‌లో ఈ అదనపు ఛార్జీలను చేర్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ సేవలను ఉచితంగా, సులభంగా అందించాల్సిన ప్రభుత్వమే, వాటి నిర్వహణ పేరుతో ప్రత్యేక రుసుము వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అధికారులు ఏమంటున్నారు? జీబీఏ వివరణ..
ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో గ్రేటర్ బెంగళూరు అథారిటీ స్పందించింది. డిజిటల్ మౌలిక వసతుల నిరంతర నిర్వహణ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఖర్చుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
{{/usCountry}}ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో గ్రేటర్ బెంగళూరు అథారిటీ స్పందించింది. డిజిటల్ మౌలిక వసతుల నిరంతర నిర్వహణ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఖర్చుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
{{/usCountry}}"ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించాలంటే మనకు అత్యుత్తమ సాఫ్ట్‌వేర్, ఐటీ మౌలిక వసతులు అవసరం," అని జీబీఏ స్పెషల్ కమిషనర్ (రెవెన్యూ అండ్ ఐటీ) మునీష్ మౌద్గిల్ పేర్కొన్నారు. డిజిటల్ వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణకు భారీగా నిధులు అవసరమవుతాయని, తమ వద్ద ఐటీ రంగానికి ప్రత్యేక ఆదాయ వనరులు లేకపోవడం వల్లే ఈ ఛార్జీలు విధించామని ఆయన వివరించారు. ఆన్‌లైన్ సేవల ద్వారా పన్ను చెల్లింపుదారులకు మిగులుతున్న సమయం, లభిస్తున్న సౌకర్యంతో పోలిస్తే ఏటా చెల్లించే రూ. 200 చాలా స్వల్పమైన మొత్తమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ-ఖాత వ్యవస్థతో ఊరట!
గత రెండేళ్లలో చేపట్టిన డిజిటల్ విప్లవం వల్ల పౌరులకు సేవలు వేగంగా అందుతున్నాయని అథారిటీ గుర్తుచేసింది. ఈ-ఖాత విధానం ద్వారా కేవలం రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12 లక్షల ఈ-ఖాతాలను జారీ చేసినట్లు తెలిపింది. పాత కాగితాల పద్ధతిలో ఇదంత వేగంగా సాధ్యమయ్యేది కాదని, ప్రస్తుతం వచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తుల్లో 98 శాతం దరఖాస్తులను కేవలం ఏడు నుంచి ఎనిమిది రోజుల్లోనే పరిష్కరిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
సాంకేతికత సౌకర్యం అందిస్తోందన్నది వాస్తవమే అయినా, దానికి అయ్యే నిర్వహణ వ్యయాన్ని పన్ను చెల్లింపుదారులపైనే మోపడం సరికాదని బెంగళూరువాసులు అంటున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి సాఫ్ట్‌వేర్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.