వడ్డీ వ్యాపారుల వేధింపులు రోజురోజుకూ హద్దులు దాటుతున్నాయి. ఆపదలో ఉండి తీసుకున్న అప్పుకు వాయిదాలు చెల్లించడంలో ఆలస్యమైతే.. మానవత్వాన్ని మరిచి దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటువంటి ఒక అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుగా తీసుకున్న సొమ్ముకు వడ్డీ చెల్లించలేదన్న కోపంతో ఒక మహిళను కిడ్నాప్ చేసి, నిర్బంధించి, బట్టలు తీసేసి దారుణంగా హింసించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

దారుణానికి ఒడిగట్టడమే కాకుండా ఆ దృశ్యాలను సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బాధితురాలిని బెదిరించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
అసలేం జరిగింది?
అరెస్టయిన నిందితులను నజ్రత్, రేష్మా, సుహైల్, సైఫ్‌లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు రెండేళ్ల క్రితం రేష్మా అనే మహిళ వద్ద రూ. 1 లక్ష అప్పుగా తీసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల గడిచిన ఆరు నెలలుగా ఆమె వడ్డీ చెల్లించలేకపోయింది.
ఇదే క్రమంలో రేష్మా పరిచయంతో నజ్రత్ అనే మరో మహిళ వద్ద బాధితురాలు రూ. 50,000 అప్పు తీసుకుంది. దీనికిగానూ నెలకు బదులుగా ప్రతి వారం రూ. 5,000 చొప్పున వడ్డీ చెల్లిస్తూ వచ్చింది. కానీ, కుటుంబ పరిస్థితులు కలసిరాక గత నాలుగు వారాలుగా నజ్రత్‌కు కూడా వడ్డీ కట్టలేకపోయింది.
పక్కా పథకం ప్రకారం కిడ్నాప్..
వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో భయపడిపోయిన బాధితురాలు.. రేష్మా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి, నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చింది. అయితే ఆమెను ఎలాగైనా పట్టుకోవాలని చూసిన నజ్రత్ ఒక పథకం వేసింది. బాధితురాలికి ఫోన్ చేసి పని ఇప్పిస్తానని, డబ్బులు కూడా ఇస్తానని నమ్మించింది. నజ్రత్ మాటలు నమ్మి ఆమె ఇంటికి వెళ్లిన బాధితురాలిపై అక్కడే ఉన్న సుహైల్ తీవ్రంగా దాడి చేసి, దుర్భాషలాడాడు.
అనంతరం ఆమెను బలవంతంగా ఒక ఆటోరిక్షాలోకి ఎక్కించారు. రేష్మా, నజ్రత్ ఆటోలో బాధితురాలి ఇరువైపులా కూర్చోగా.. సుహైల్, మరొక ఇద్దరు వ్యక్తులు వారిని అనుసరించారు. బెంగళూరు శివారు ప్రాంతమైన కుంబళగోడు సమీపంలోని ఒక నిర్మానుష్య ఇంటికి ఆమెను తీసుకెళ్లి బంధించారు.
వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్- చివరికి..
{{/usCountry}}అనంతరం ఆమెను బలవంతంగా ఒక ఆటోరిక్షాలోకి ఎక్కించారు. రేష్మా, నజ్రత్ ఆటోలో బాధితురాలి ఇరువైపులా కూర్చోగా.. సుహైల్, మరొక ఇద్దరు వ్యక్తులు వారిని అనుసరించారు. బెంగళూరు శివారు ప్రాంతమైన కుంబళగోడు సమీపంలోని ఒక నిర్మానుష్య ఇంటికి ఆమెను తీసుకెళ్లి బంధించారు.
వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్- చివరికి..
{{/usCountry}}ఆ ఇంట్లో బాధితురాలిని బంధించిన నిందితులు ఆమెపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆమె దుస్తులు విప్పేసి తీవ్రంగా కొట్టారు. ఈ అమానుషాన్ని తమ ఫోన్లలో వీడియో తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా లేదా అప్పు తీర్చకపోయినా ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తామని తీవ్రంగా బెదిరించారు.
మరోవైపు కూతురు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన బాధితురాలి తల్లి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సకాలంలో స్పందించారు. టెక్నాలజీ సాయంతో బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని ట్రాక్ చేసి, ఆమెను సురక్షితంగా రక్షించారు. దాడికి పాల్పడిన నలుగురు నిందితులను ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు.