అమెరికాలో భారత్ సత్తా- టెక్సాస్‌లో తొలి గణిత విద్యా కేంద్రాన్ని ప్రారంభించిన భాంజు!
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్ నీలకంఠ భాను స్థాపించిన భాంజు కొత్త మైలురాయికి చేరింది! అమెరికా టెక్సాస్‌లోని మెక్‌కిన్నీలో తొలి భౌతిక గణిత శిక్షణా కేంద్రాన్ని సంస్థ ప్రారంభించింది. గణితం పట్ల విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం భాంజు లక్ష్యం.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ గణిత అభ్యాస వేదిక అయిన భాంజు.. యునైటెడ్ స్టేట్స్‌లో తన మొట్టమొదటి భౌతిక అభ్యాస కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది టెక్సాస్‌లోని మెక్‌కిన్నీలో ఉంది.

అమెరికాలో పెరుగుతున్న డిమాండ్
భాంజు ఇప్పటికే తన ఆన్‌లైన్ అభ్యాస కార్యక్రమాల ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో బలమైన ఆదరణను చూసింది. అమెరికాలో భౌతిక కేంద్రాన్ని ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయానికి ప్రధాన కారణం – స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్) ఆధారిత విద్యకు పెరుగుతున్న డిమాండ్, ఫలితాలను సాధించే గణిత కార్యక్రమాలపై తల్లిదండ్రులు, పాఠశాలల్లో కనిపిస్తున్న ఆసక్తి.
"భాంజును యునైటెడ్ స్టేట్స్‌కు తీసుకెళ్లడం అనేది కేవలం ప్రపంచ విస్తరణ మాత్రమే కాదు. లోతైన సైద్ధాంతిక స్పష్టత, ఆత్మవిశ్వాసం-మొదట అనే విధానం ద్వారా ప్రపంచం గణితాన్ని నేర్చుకునే విధానాన్ని తిరిగి ఊహించడం," అని భాంజు సీఈఓ, వ్యవస్థాపకుడు నీలకంఠ భాను అన్నారు.
"భారతదేశం చాలా కాలంగా గణిత ప్రపంచానికి గణనీయమైన సహకారం అందించింది. భారతదేశం నుంచి వచ్చిన భాంజును మా మొదటి యూఎస్ అభ్యాస కేంద్రం ద్వారా ప్రపంచానికి అందించడం మాకు గర్వకారణం. ఈ ప్రత్యేకమైన అభ్యాసాన్ని అమెరికన్ తరగతి గదులకు తీసుకెళ్లడం, తదుపరి తరం సమస్య పరిష్కర్తలను శక్తివంతం చేయడం పట్ల మేము ఉత్సాహంగా ఉన్నాము," అని ఆయన తెలిపారు.
గణితంపై భయాన్ని తొలగించడమే లక్ష్యం..
భాంజు సహ వ్యవస్థాపకుడు, వ్యాపార అభివృద్ధి అధిపతి అయిన ప్రాచోతన్ డీఎల్ మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా గణితంపై ఉన్న భయాన్ని తొలగించడమే మా లక్ష్యం. అమెరికాలో మా మొదటి భౌతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది కేవలం విస్తరణ కాదు, లక్షలాది మంది పిల్లలు గణితాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేసే విధానాన్ని మార్చే దిశగా వేసిన అడుగు," అని అన్నారు. "మా విధానం సృజనాత్మకత, సాంకేతికత, లోతైన బోధనా పద్ధతిని మిళితం చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు గణితాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, ఆనందదాయకంగా మారుస్తుంది," అని ఆయన వివరించారు.
భాంజు అద్భుతమైన విధానం..
భాంజు గణిత అభ్యాస విధానంలో స్పీడ్ మ్యాథ్ టెక్నిక్స్ (వేగవంతమైన గణిత పద్ధతులు), స్టోరీ టెల్లింగ్, గేమిఫికేషన్, ఏఐ-ఆధారిత సాధనాలను మిళితం చేస్తుంది. ఇది మరింత లోతైన ఎంగేజ్మెంట్, వేగవంతమైన ఫలితాలను సృష్టిస్తుంది.
భారతదేశం, ఇతర ప్రపంచ మార్కెట్లలో, భాంజు 16 దేశాలలో 50,000 మందికి పైగా విద్యార్థులకు 40 మిలియన్లకు పైగా గణిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడింది. కేవలం ఐదు నెలల్లో విద్యార్థులు తమ వేగం, కచ్చితత్వాన్ని 4 రెట్లు పెంచుకున్నారు!
భాంజు గురించి..
భాంజు అనేది ప్రపంచ రికార్డు హోల్డర్ నీలకంఠ భాను స్థాపించిన ప్రముఖ గ్లోబల్ మ్యాథ్-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్. ఈయన్ని "ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్"గా పిలుస్తారు. కిండర్ గార్టెన్ నుంచి 9+ తరగతి వరకు విద్యార్థుల కోసం కోర్సులను అందిస్తూ, గణిత అభ్యాసాన్ని ఆనందదాయకంగా, అందుబాటులో ఉండేలా, ప్రభావవంతంగా మార్చడం భాంజు లక్ష్యం.
జెనరేటివ్ ఏఐ మద్దతుతో ప్రత్యేకమైన పాఠ్య ప్రణాళికతో, భాంజు విద్యార్థులకు అర్థం చేసుకోవడం, గుర్తుంచుకోవడం వంటివి పెంచడానికి అనుగుణంగా అభ్యాసాన్ని అందిస్తుంది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉన్న భాంజు, భారతదేశంలో తయారుచేసి, ప్రపంచం కోసం అందించే విద్యా వారసత్వాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంది!
మరిన్ని వివరాల కోసం-
భాంజు
సార్థక్ ఏఎస్
+91 8095309080, sarthak@bhanzu.com
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


