...
...
Next Story

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల - తెలంగాణలో 2 ఖాళీలు, మార్చి 16న ఎన్నికలు

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16న ఎన్నికలుంటాయి. 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

Published on: Feb 18, 2026, 11:08:55 IST
Advertisement

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వివరాలను ప్రకటించింది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ తో 37 మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది.

రాజ్యసభ
రాజ్యసభ

మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న అభిషేక్ సింఘ్వీ(కాంగ్రెస్), కేఆర్ సురేశ్ రెడ్డి (బీఆర్ఎస్ ) పదవీకాలం పూర్తి కానుంది. వీరి పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది. దీంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

  • రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ - 26 ఫిబ్రవరి 2026.
  • నామినేషన్లకు చివరి తేదీ - 5 మార్చి 2026.
  • నామినేషన్ల పరిశీలన - 6 మార్చి 2026.
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - 9 మార్చి 2026.
  • పోలింగ్ తేదీ - 16 మార్చి(సోమవారం).
  • పోలింగ్ సమయం - ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
  • ఓట్ల లెక్కింపు - 16 మార్చి 2026.
  • ఎన్నికల ప్రక్రియ పూర్తి - 20 మార్చి 2026.

ఇక జూన్ లో ఆంధ్రప్రదేశ్‌ లో కూడా రాజ్యసభ స్థానాలు ఖాళీలు కానున్నాయి. వైసీపీ నుంచి ఎంపీలుగా ఉన్న అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, టీడీపీ సభ్యుడు సానా సతీష్‌ల పదవీకాలం జూన్‌తో ముగుస్తుంది. త్వరలోనే ఈ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదలవుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe