Bihar election results : ఇప్పుడు పోటీ అంతా బీజేపీ- జేడీయూ మధ్యే! విపక్షాలు ఢమాల్​..

బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు కుదేలయ్యాయి! అధికారి బీజేపీకి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్​ ఎన్నికల ఫలితాల్లో ‘అతిపెద్ద’ పార్టీగా అవతరించేందుకు బీజేపీ- జేడీయూ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Published on: Nov 14, 2025, 11:14:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బీహార్​ ఎన్నికల్లో ఆర్జేడీ- కాంగ్రెస్​తో కూడిన విపక్ష మహాఘటబంధన్​, ప్రశాంత్​ కిశోర్​కి చెందిన జన్​ సురాజ్​ పార్టీలు అధికార ఎన్డీఏకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి! శుక్రవారం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యం లభిస్తోంది. విపక్షాలు డీలా పడిన వేళ.. ఇప్పుడు 'అతిపెద్ద పార్టీ' పొజిషన్​ కోసం ఎన్డీఏలోని బీజేపీ- జేడీయూలు తీవ్రంగా పోటీపడుతున్నాయి.

బీహార్​ ఎన్నికల్లో బేజేపీ- జేడీయూ ఫైట్​..
బీహార్​ ఎన్నికల్లో బేజేపీ- జేడీయూ ఫైట్​..

బీహార్​ ఎన్నికల ఫలితాలు 2025- ఎన్డీఏ పార్టీల మధ్యే పోటీ!

బీహార్​ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం సీట్లు 243లో మెజారిటీ మార్క్​ 122గా ఉంది. ఉదయం 11 గంటల వరకు ఉన్న డేటా ప్రకారం..

ఎన్డీఏ- 182 సీట్లతో ముందంజలో ఉంది.

మహాఘటబంధన్​- 56 చోట్ల ఆధిక్యంలో ఉంది.

జేఎస్పీ- ఇప్పటివరకు ఉన్న ఆధిక్యాన్ని (5 సీట్లల్లో) కూడా కోల్పోయింది!

ఇతరులు- 5 చోట్ల ముందంజలో ఉన్నారు.

ఇదిలా ఉండగా..

ఎన్డీఏలో ప్రధాన పార్టీలైన బీజేపీ, నితీశ్​ కమార్​కి చెందిన జేడీయూ మధ్య 'అతిపెద్ద పార్టీ' పేరు కోసం తీవ్ర పోటీ కొనసాగుతోంది!

జేడీయూ 80 సీట్లతో దూసుకెళుతుండగా, బీజేపీ 78 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రెండు పార్టీల మధ్య నువ్వా- నేనా అన్నట్టు జరుగుతున్న పోరులో సీట్ల ఆధిక్యం ఎప్పటికప్పుడు మారుతూనే వస్తోంది.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో పోల్చితే బీజేపీకే ఎక్కువ సీట్లు దక్కాయి.

మరోవైపు మహాఘటబంధన్​లో కీలకమైన, తేజస్వీ యాదవ్​ నేతృత్వంలోని ఆర్జేడీ 43 స్థానాల్లో లీడింగ్​లో కొనసాగుతోంది. 2020లో జరిగిన బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఒకానొక దశలో 11 స్థానాల్లో లీడింగ్​లో ఉన్న మరో కీలక పార్టీ కాంగ్రెస్​.. ఇప్పుడు 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025: నేపథ్యం

ప్రధాన పోటీ: 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రధాన పోటీ బీజేపీ, జేడీయూ ఉన్న ఎన్డీఏ కూటమికి, ఆర్జేడీ- కాంగ్రెస్ ఉన్న మహాఘటబంధన్‌కు మధ్య నెలకొంది.

ముఖ్యమంత్రి అభ్యర్థి: మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్. ఎన్డీఏ కూటమి అధికారికంగా ఎవరి పేరును ప్రకటించకపోయినా, మద్దతుదారులు మాత్రం నితీశ్​ కుమారే మళ్లీ సీఎం అవుతారని నమ్ముతున్నారు.

2020 ఎన్నికలు: 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తక్కువ మెజారిటీతో (125 సీట్లు) అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 74 సీట్లతో డామినెంట్ భాగస్వామిగా నిలవగా, జేడీయూ 43 సీట్లు గెలుచుకుంది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘటబంధన్ 110 సీట్లు గెలిచి, సింగిల్-లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

నితీష్ కుమార్ రాజకీయ మలుపులు: ప్రస్తుత అసెంబ్లీ కాలంలో నితీష్ కుమార్ రెండుసార్లు కూటమిని మార్చారు. 2022 ఆగస్టులో ఎన్డీఏ వీడి ఆర్జేడీతో జట్టు కట్టారు (తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు), ఆపై 2024 జనవరిలో మళ్లీ ఎన్డీఏలోకి తిరిగి వచ్చారు.

ఎగ్జిట్ పోల్స్ అంచనా: చాలా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ సునాయాసంగా గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే, 'యాక్సిస్ మై ఇండియా' వంటి కొన్ని సంస్థలు మాత్రం బీజేపీ-జేడీ(యూ) కూటమికి స్వల్ప ఆధిక్యతతో గట్టి పోటీ ఉంటుందని అంచనా వేశాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More