మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నప్పుడు, ఎక్కువ రాబడులు ఇచ్చే కొన్ని నిర్దిష్ట రంగాలు లేదా షేర్లపైనే భారీగా పెట్టుబడి పెట్టాలని చాలామంది ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. అయితే, ఇలా ఒకే చోట నిధులన్నీ కేంద్రీకరించడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుందని కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ స్పష్టం చేస్తున్నారు.

"డైవర్సిఫికేషన్ అనేది రిస్క్‌ను పూర్తిగా తొలగించలేదు. కానీ ఒక పెట్టుబడి సరిగ్గా పనిచేయనప్పుడు మొత్తం పోర్ట్‌ఫోలియోపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది" అని శ్రీకాంత్ చౌహాన్ వివరించారు.
ఒకే రంగానికో, కంపెనీకో పరిమితమైతే వచ్చే ప్రమాదం
పరిమితమైన షేర్లు లేదా ఒకే రంగంలో అధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల కొన్ని కంపెనీల పనితీరు మొత్తం సంపదపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, మీరు పెట్టిన పెట్టుబడుల్లో అత్యధిక భాగం ఏదైనా ఒక రంగానికి మాత్రమే పరిమితమైతే.. ఆ రంగంలో మందగమనం వచ్చినా, ప్రభుత్వ నిబంధనలు మారినా లేదంటే వినియోగదారుల అలవాట్లలో మార్పులు వచ్చినా మొత్తం పోర్ట్‌ఫోలియో దెబ్బతింటుంది.
ఇదే సూత్రం వ్యక్తిగత కంపెనీలకూ వర్తిస్తుంది. ఎంత బలమైన పునాదులు ఉన్న కంపెనీ అయినా ఊహించని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచినా, పోటీ తీవ్రమైనా లేదా యాజమాన్య నిర్ణయాలు వికటించినా నష్టాలు తప్పవు. ఒకే కంపెనీలో ఎక్కువ పెట్టుబడి ఉన్నప్పుడు ఇటువంటి పరిణామాలు ఇన్వెస్టర్ల సంపదను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
విభిన్న కోణాల్లో పెట్టుబడుల వ్యాప్తి
డైవర్సిఫికేషన్ అంటే కేవలం ఎక్కువ సంఖ్యలో షేర్లను కొనడం మాత్రమే కాదు. అసెట్ క్లాస్‌లు, రంగాలు, మార్కెట్ క్యాప్ వర్గాలు, అవసరమైతే అంతర్జాతీయ మార్కెట్లలోనూ పెట్టుబడులను విస్తరించడమే నిజమైన డైవర్సిఫికేషన్.
ఉదాహరణకు, ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నిర్మించుకునేటప్పుడు ఒకే రంగానికి ప్రాధాన్యం ఇవ్వకుండా వేర్వేరు పరిశ్రమలకు చెందిన కంపెనీలను ఎంచుకోవాలి. అలాగే ఆర్థిక లక్ష్యాలు, ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఈక్విటీలు, స్థిరాదాయ సాధనాలు, బంగారం వంటి సాధనాల్లో పెట్టుబడులను సర్దుబాటు చేసుకోవాలి. వేర్వేరు కారణాలతో ప్రభావితమయ్యే సాధనాల్లో నిధులు మళ్లించడం వల్ల మార్కెట్లో ఏదైనా ఒక ప్రతికూల సంఘటన జరిగినా మొత్తం పోర్ట్‌ఫోలియో దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.
ఎక్కువ ఫండ్లు ఉంటే డైవర్సిఫికేషన్ ఉన్నట్లు కాదు
{{/usCountry}}ఉదాహరణకు, ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నిర్మించుకునేటప్పుడు ఒకే రంగానికి ప్రాధాన్యం ఇవ్వకుండా వేర్వేరు పరిశ్రమలకు చెందిన కంపెనీలను ఎంచుకోవాలి. అలాగే ఆర్థిక లక్ష్యాలు, ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఈక్విటీలు, స్థిరాదాయ సాధనాలు, బంగారం వంటి సాధనాల్లో పెట్టుబడులను సర్దుబాటు చేసుకోవాలి. వేర్వేరు కారణాలతో ప్రభావితమయ్యే సాధనాల్లో నిధులు మళ్లించడం వల్ల మార్కెట్లో ఏదైనా ఒక ప్రతికూల సంఘటన జరిగినా మొత్తం పోర్ట్‌ఫోలియో దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.
ఎక్కువ ఫండ్లు ఉంటే డైవర్సిఫికేషన్ ఉన్నట్లు కాదు
{{/usCountry}}చాలామంది ఇన్వెస్టర్లు ఎక్కువ సంఖ్యలో ఫండ్లు లేదా షేర్లు ఉంటే తమ పోర్ట్‌ఫోలియో సురక్షితంగా ఉందని పొరబడుతుంటారు. అయితే విభిన్న మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేసినప్పటికీ, ఆయా ఫండ్లు ఒకే రకమైన కంపెనీలలో పెట్టుబడులు పెడితే పోర్ట్‌ఫోలియోలో కేంద్రీకరణ రిస్క్ అలాగే ఉంటుంది.
దీనినే 'మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఓవర్‌ల్యాప్' అంటారు. ఒకే రకమైన విధివిధానాలు కలిగిన వేర్వేరు స్కీమ్‌లు ఒకే రకమైన షేర్లలో భారీగా పెట్టుబడులు పెడుతుంటాయి. ఫలితంగా కొత్త ఫండ్‌ను పోర్ట్‌ఫోలియోలో చేర్చినప్పటికీ రిస్క్ తగ్గదు. అందుకే ఏదైనా కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌ను జోడించే ముందు అది మొత్తం పోర్ట్‌ఫోలియోకు ఎలాంటి అదనపు ప్రయోజనం ఇస్తుందో అర్థం చేసుకోవడం అవసరం.
అతి డైవర్సిఫికేషన్తోనూ నష్టమే
పరిమితికి మించిన డైవర్సిఫికేషన్ కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఎక్కువ సంఖ్యలో సాధనాల్లో పెట్టుబడి పెడితే పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షించడం కష్టమవుతుంది. అంతేకాకుండా అధిక నమ్మకం ఉన్న బలమైన షేర్ల నుంచి వచ్చే మెరుగైన రాబడుల ప్రభావం తగ్గిపోతుంది. ఇది రిస్క్‌ను తగ్గించకపోగా, అనవసరమైన సంక్లిష్టతను పెంచుతుంది.
కాబట్టి సంఖ్యను పెంచడం కంటే అర్థవంతమైన రీతిలో పెట్టుబడులను విభజించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అసెట్ క్లాస్, రంగం, మార్కెట్ సెగ్మెంట్ లేదా ఇన్వెస్ట్మెంట్ విధానం పరంగా ప్రతి సాధనానికి ఒక స్పష్టమైన పాత్ర ఉండాలి.
క్రమం తప్పకుండా పునఃసమీక్ష, రీబ్యాలెన్సింగ్
డైవర్సిఫికేషన్ అనేది ఒక్కసారితో పూర్తయ్యే ప్రక్రియ కాదు. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల కాలక్రమేణా ఒక్కో షేరు వాటా మారుతుంటుంది. ఉదాహరణకు మీరు కొనుగోలు చేసినప్పుడు పోర్ట్‌ఫోలియోలో 5 శాతం ఉన్న ఒక షేరు, దాని ధర గణనీయంగా పెరిగిన తర్వాత మొత్తం పోర్ట్‌ఫోలియోలో అతిపెద్ద వాటాగా మారవచ్చు.
ఇలాంటి మార్పులను గుర్తించడానికి క్రమబద్ధమైన పోర్ట్‌ఫోలియో రివ్యూలు తోడ్పడతాయి. అవసరమైన చోట రీబ్యాలెన్సింగ్ చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోను మళ్లీ కావలసిన రిస్క్ పరిమితిలోకి తీసుకురావచ్చు. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం సిద్ధం చేసుకున్న పోర్ట్‌ఫోలియో, స్వల్పకాలిక ఆర్థిక అవసరాల కోసం తయారు చేసుకున్న పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇన్వెస్టర్ వ్యక్తిగత పరిస్థితులపైనే సరైన డైవర్సిఫికేషన్ స్థాయి ఆధారపడి ఉంటుంది తప్ప దీనికి ఎలాంటి స్థిరమైన ఫార్ములా ఉండదు.
సమతుల్య పోర్ట్ఫోలియోతోనే రక్షణ
"డైవర్సిఫికేషన్ అంటే రిస్క్‌ను పూర్తిగా నివారించడం కాదు, ఒకే రకమైన పెట్టుబడి లేదా రాబడి మార్గంపై అనవసరంగా ఆధారపడకుండా ఉండటం" అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఒకే చోట కేంద్రీకరించడం వల్ల తాత్కాలికంగా భారీ లాభాలు వచ్చినా, అంచనాలు తప్పితే తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
అనుకోని అనిశ్చితులను తట్టుకుంటూనే దీర్ఘకాలిక వృద్ధిని అందించే పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడమే ఇన్వెస్టర్ల ప్రధాన ధ్యేయం కావాలి. ఎన్ని సాధనాల్లో ఇన్వెస్ట్ చేశామనే దానికంటే, ఉన్న సాధనాలు రిస్క్‌ను తగ్గించడంలో నిజంగా దోహదపడుతున్నాయా లేదా అని ప్రశ్నించుకోవాలి.