543 కి.మీ రేంజ్‌తో Toyota Urban Cruiser Ebella- వేరియంట్లు, వాటి ఫీచర్లు..
మారుతీ సుజుకీ 'ఈ విటారా' ఆధారంగా రూపొందిన టయోటా మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా' బుకింగ్స్ రూ. 25,000తో ప్రారంభమయ్యాయి. మూడు వేరియంట్లు, తొమ్మిది రంగుల్లో లభించే ఈ కారు ఫీచర్లు, బ్యాటరీ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోటా ఇండియాలో తన తొలి ఎలక్ట్రిక్ కారును ఇటీవలే రివీల్ చేసింది. దాని పేరు టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా. ఇది మారుతీ సుజుకీ ఈ-విటారాకు రీబ్యాడ్జ్ వర్షెన్. ఇది మరో కొన్ని వారాల్లో అధికారికంగా లాంచ్ కానుంది. కాగా రూ. 25,000 టోకెన్ అమౌంట్‌తో ఈ ఈవీ కోసం బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది.

ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా.. ఈ1, ఈ2, ఈ3 అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇక వేరియంట్లు, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను బట్టి ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధర రూ. 19 లక్షల నుంచి రూ. 24 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా కోసం టయోటా ఎనిమిదేళ్ల బ్యాటరీ వారంటీని, 60% బైబ్యాక్ అస్యూరెన్స్, 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్' ప్రోగ్రామ్‌ను కూడా ధృవీకరించింది.
ఒకవేళ మీరు టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కలర్ ఆప్షన్స్, వేరియంట్ల ఫీచర్లను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా కలర్స్..
ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఈవీ మొత్తం తొమ్మిది రంగుల్లో లభిస్తుంది. ఇందులో ఐదు మోనోటోన్ షేడ్స్, అలాగే నాలుగు డ్యూయల్-టోన్ రంగులు ఉంటాయి.
మోనోటోన్ షేడ్స్: స్పోర్టిన్ రెడ్, కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్, గేమింగ్ గ్రే, బ్లూయిష్ బ్లాక్.
డ్యూయల్-టోన్ షేడ్స్: స్పోర్టిన్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, కేఫ్ వైట్ విత్ బ్లాక్ రూఫ్, ఎంటైసింగ్ సిల్వర్ విత్ బ్లాక్ రూఫ్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్ విత్ బ్లాక్ రూఫ్.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా: వేరియంట్లు, వాటి ఫీచర్లు..
ఈ1 వేరియంట్:
ఎక్స్‌టీరియర్-
రూఫ్-ఎండ్ స్పాయిలర్
బాడీ సైడ్ మౌల్డింగ్
18-ఇంచ్ అలాయ్ వీల్స్
హై-మౌంట్ స్టాప్ ల్యాంప్
రియర్ విండో వైపర్ వాషర్
ఇంటీరియర్-
10.25-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
10.1-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్
ఫుల్-సైజ్ స్పేర్ వీల్
కప్ హోల్డర్‌తో కూడిన సెంటర్ కన్సోల్
సెంటర్ లోయర్ బాక్స్
గ్లోవ్‌బాక్స్ డాంపర్
స్నో మోడ్ స్విచ్, డ్రైవ్ మోడ్ స్విచ్, వన్-పెడల్ మోడ్ స్విచ్
టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ లెదర్ స్టీరింగ్
ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్
ఫ్యాబ్రిక్ సీట్లు, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్
ప్యాసింజర్ సైడ్ సీట్‌బ్యాక్ పాకెట్
40:20:40 స్ల్పిట్ రియర్ సీట్లు
స్లైడింగ్, రెక్లైనింగ్ సెకండ్ రో (రెండో వరుస సీట్లు)
కప్ హోల్డర్‌తో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్
బూట్ ల్యాంప్
డోర్ లైన్, కన్సోల్ స్పాట్ యాంబియంట్ లైట్స్
సింగిల్-జోన్ ఆటోమేటిక్ ఏసీ, పీఎం 2.5 ఫిల్టర్
షార్క్-ఫిన్ యాంటెన్నా
కీ-లెస్ ఎంట్రీ, స్టార్ట్-స్టాప్ సిస్టమ్
ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం
డ్రైవర్, కో-డ్రైవర్ సన్ వైజర్, వానిటీ మిర్రర్, టికెట్ హోల్డర్
ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంలు
మాన్యువల్ లెవలింగ్‌తో కూడిన ఆటోమేటిక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్
డెమిస్టర్
సేఫ్టీ-
ఫ్రంట్, రియర్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్
ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్పీ, ఈపీబీ, హిల్ హోల్డ్ కంట్రోల్
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్)
హైట్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్‌బెల్ట్స్
డ్రైవర్, ప్యాసింజర్, రియర్ ప్యాసింజర్ సీట్‌బెల్ట్ రిమైండర్ అలారం అండ్ ల్యాంప్
ఇమ్మొబిలైజర్
అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ (ఏవీఏఎస్)
పెడల్ రిలీజ్ సిస్టమ్
లో బ్యాటరీ వార్నింగ్ లైట్, పవర్ ఆఫ్ వార్నింగ్ బజర్, డోర్ అజార్ వార్నింగ్
పవర్‌ట్రెయిన్-
49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ
142 బీహెచ్పీ పీక్ పవర్
189 ఎన్ఎం పీక్ టార్క్
7 కేడబ్ల్యూ ఏసీ ఛార్జింగ్
రీజెన్ ఫీచర్
ఈ2 వేరియంట్ (ఈ1లో ఉన్నవాటితో పాటు అదనంగా)
ఇంటీరియర్-
వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్
లగేజ్ షెల్ఫ్
సేఫ్టీ-
రివర్స్ పార్కింగ్ కెమెరా
పవర్‌ట్రెయిన్:
61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్
171.5 బీహెచ్పీ ఎలక్ట్రిక్ మోటార్
189 ఎన్ఎం పీక్ టార్క్
ఈ3 వేరియంట్ (ఈ2లో ఉన్నవాటితో పాటు అదనంగా):
ఇంటీరియర్-
సింథటిక్ లెదర్ + ఫ్యాబ్రిక్ సీట్లు
పవర్డ్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు
వెంటిలేటెడ్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు
ట్వీటర్, సబ్ వూఫర్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్
పనోరమిక్ సన్‌రూఫ్
సేఫ్టీ-
అడాప్టివ్ హై బీమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ లెవలింగ్
మల్టీ-కొలీషన్ బ్రేక్
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ఏసీసీ)
లేన్ కీపింగ్ అసిస్ట్ (ఎల్కేఏ)
సరౌండ్-వ్యూ మానిటర్
అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఏఈబీ)
లేన్ డిపార్చర్ వార్నింగ్, స్టాగర్ వార్నింగ్, బ్లైండ్-స్పాట్ వార్నింగ్
రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్
ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్ ఎస్యూవీ 543 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది.
చివరగా చెప్పాలంటే, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్ ఎస్యూవీ బేస్ వేరియంట్ ఈ1 నుంచే అనేక ఫీచర్లతో వస్తుంది. ఈ2 వేరియంట్‌లో వైర్‌లెస్ ఛార్జర్, రివర్స్ కెమెరాతో పాటు శక్తివంతమైన మోటార్, పెద్ద బ్యాటరీ ప్యాక్ లభిస్తాయి. ఇక టాప్-ఎండ్ వేరియంట్ ఈ3లో వెంటిలేటెడ్ సీట్లు, అడ్వాన్స్‌డ్ అడాస్ ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి విలాసవంతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


