అదిరిందిగా! సింగిల్ ఛార్జ్‌తో 543 కి.మీ రేంజ్- టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఇదిగో..
టయోటా తన తొలి ఎలక్ట్రిక్ కారు 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా'ను భారత్‌లో ఆవిష్కరించింది. రూ. 25,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్‌ని సైతం ప్రారంభమయ్యాయి. 543 కి.మీ రేంజ్, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ కారు హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది.
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది టయోటా కిర్లోస్కర్ మోటార్. భారత్‌లో తన మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ను మంగళవారం అధికారికంగా ఆవిష్కరించింది. మారుతీ సుజుకీ ఈ- విటారా ఆధారంగా రూపొందిన ఈ మోడల్‌తో టయోటా ఇప్పుడు మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా- బుకింగ్స్..
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాని ఆవిష్కరించడంతో పాటు ఈ ఈవీ బుకింగ్స్‌ని సైతం సంస్థ ప్రారంభించింది. రూ. 25,000 చెల్లించి ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకోవచ్చు.
భారత మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా- అదిరిపోయే డిజైన్..
ఎబెల్లా చూడటానికి మారుతీ సుజుకీ ఈ-విటారాను పోలి ఉన్నప్పటికీ, టయోటా తన మార్కు స్టైలింగ్‌ను దీనికి జోడించింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో టయోటా కార్లకు ఉండే డిజైన్ లాంగ్వేజ్‌ను దీనికి వాడారు.
డైమెన్షన్స్: 4,285 ఎంఎం పొడవు, 1,800 ఎంఎం వెడల్పు, 1,640 ఎంఎం ఎత్తుతో ఇది రోడ్డుపై భారీగా కనిపిస్తుంది.
- Tata Punch: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్- తక్కువ ధరలో అదిరిపోయే సేఫ్టీ - పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీల్‌బేస్: 2,700 ఎంఎం వీల్‌బేస్ ఉండటం వల్ల లోపల స్పేస్ ఎక్కువగా ఉంటుంది.
రంగులు: కేఫ్ వైట్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్ వంటి ఆకర్షణీయమైన సింగిల్ టోన్ రంగులతో పాటు బ్లాక్ రూఫ్ వచ్చే డ్యూయల్ టోన్ ఆప్షన్లు కూడా ఈ ఈవీలో అందుబాటులో ఉన్నాయి.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా- విలాసవంతమైన ఇంటీరియర్, ఫీచర్లు..
కారు లోపలి భాగం బ్లాక్- బ్రౌన్ రంగుల డ్యూయల్ టోన్ థీమ్‌తో చాలా ప్రీమియంగా ఉంటుంది. ఆధునిక కారులో ఉండాల్సిన అన్ని హై-టెక్ ఫీచర్లను టయోటా ఇందులో పొందుపరిచింది.
"ప్రయాణికుల సౌకర్యం కోసం పనోరమిక్ సన్‌రూఫ్, 10.1 ఇంచ్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, జేబీఎల్ సౌండ్ సిస్టమ్‌ను అందించాము," అని కంపెనీ ప్రతినిధులు వివరించారు. భద్రత కోసం ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, లెవల్-2 అడాస్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా- బ్యాటరీ, రేంజ్..
అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఈవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. అవి..
49 కేడబ్లూహెచ్ బ్యాటరీ: ఇది 106 హెచ్‌పీ పవర్‌ని పవర్‌ని ఇస్తుంది.
61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది 171.6 హెచ్‌పీ పవర్, 189 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఒక్కసారి పూర్తిస్థాయిలో ఛార్జ్ చేస్తే ఈ ఎస్‌యూవీ గరిష్టంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సంస్థ వెల్లడించింది. ఇందులో 2డబ్ల్యూ, ఏడబ్ల్యూడీ (ఆల్ వీల్ డ్రైవ్) ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ టెక్నాలజీ వల్ల ఇది ఏసీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ ఈవీకి సంబంధించిన ధరల వివరాలను సంస్థ వెల్లడించాల్సి ఉంది.
మీరు గనక ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం చూస్తుంటే, ఈ టయోటా ఎబెల్లా ఖచ్చితంగా మీ లిస్ట్‌లో ఉండాల్సిన కారు!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


