ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా వెలుగుందుతున్న చైనా ఈవీ దిగ్గజం 'బీవైడీ'.. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం మనదేశంలో అట్టో 3, ఈమ్యాక్స్ 7, సీల్, సీలియన్ 7 పేర్లతో నాలుగు మోడళ్లను విక్రయిస్తున్న ఈ సంస్థ.. తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి 'సీల్ యూ ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీతో పాటు 'అట్టో 2' మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది.

అధికారికంగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే 'బీవైడీ అట్టో 2' మిడ్‌సైజ్ ఎస్‌యూవీ టెస్టింగ్ వాహనం భారతీయ రోడ్లపై తొలిసారిగా ముసుగుతో పరీక్షలు నిర్వహిస్తూ కనిపించింది. ఈ స్పై షాట్ ఆధారంగా బీవైడీ అట్టో 2 మోడల్ డిజైన్, ఫీచర్ల విశేషాలు బయటకొచ్చాయి.
అట్రాక్టివ్ డిజైన్.. స్పోర్టీ లుక్..
భారత్‌లో కనిపించిన టెస్టింగ్ వెహికల్‌ను పరిశీలిస్తే, ఇది అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అట్టో 2 మోడల్‌ను పోలి ఉంది.
ముందు భాగం: స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లను కలుపుతూ మధ్యలో గ్లోస్ బ్లాక్ ట్రిమ్‌ను అందించారు. దీనిపై కంపెనీ పేరు 'BYD' బ్యాడ్జ్‌ను అమర్చారు.
పక్క భాగం: వీల్ ఆర్చ్‌లు, బాడీ దిగువ భాగంలో స్పోర్టీ బ్లాక్ క్లాడింగ్‌తో పాటు పెటల్ షేప్డ్ ఉండే అల్లాయ్ వీల్స్‌ను ఇందులో గమనించవచ్చు.
వెనుక భాగం: వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టైల్‌లాంప్స్, సిల్వర్ యాక్సెంట్లతో కూడిన స్పోర్టీ బ్లాక్ బంపర్ అలరించనున్నాయి.
హైటెక్ కేబిన్.. ప్రీమియం ఫీచర్లు!
అట్టో 2 కారు ఇంటీర్యర్ సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పై ఇమేజెస్ ద్వారా స్పష్టమవుతోంది. విండ్‌స్క్రీన్‌పై కెమెరా ఆధారిత 'అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్' (అడాస్) సెన్సార్ అమర్చి ఉంది.
డిస్‌ప్లే: డ్యాష్‌బోర్డ్ మధ్యలో 12.8-ఇంచుల ఫ్రీ-స్టాండింగ్ రోటేటబుల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అందించారు.
{{/usCountry}}డిస్‌ప్లే: డ్యాష్‌బోర్డ్ మధ్యలో 12.8-ఇంచుల ఫ్రీ-స్టాండింగ్ రోటేటబుల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అందించారు.
{{/usCountry}}సీటింగ్: ఆల్-బ్లాక్ సీట్ అప్‌హోల్‌స్టరీతో కేబిన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది.
ఇతర ఫీచర్లు: 8.8-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 3-స్పోక్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్) ఛార్జింగ్ ఫంక్షనాలిటీ వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ కార్లలో ఉండనున్నాయి.
ఎలక్ట్రిక్, ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లు..
యూరోపియన్ మార్కెట్లలో 'బీవైడీ అట్టో 2' మోడల్ ఆల్-ఎలక్ట్రిక్ (ఈవీ), ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ (పీహెచ్‌ఈవీ) పవర్‌ట్రెయిన్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.
ఈవీ వెర్షన్: ఇందులో 45.1kWh లేదా 64.8kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. ఇది ఒకే ఛార్జ్‌పై దాదాపు 430 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ముందు యాక్సిల్‌పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 201హెచ్‌పీ పవర్, 310ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.9 సెకన్లలోనే అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 170 కిలోమీటర్లు.
పీహెచ్‌ఈవీ వెర్షన్: అట్టో 2 'డీఎం-ఐ' హైబ్రిడ్ వెర్షన్‌లో 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను (97హెచ్‌పీ) 7.8kWh లేదా 18kWh బ్యాటరీ ప్యాక్‌లతో జోడించారు. ఇవి 197హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో మొత్తంగా 212హెచ్‌పీ పవర్, 300ఎన్ఎం టార్క్‌ను అందిస్తాయి. పెట్రోల్ + విద్యుత్ రెండింటి కలయికతో ఇది ఏకంగా 1,000 కిలోమీటర్ల మైలేజ్/రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
భారతీయ రోడ్లపై ఈ కారు టెస్టింగ్ ప్రారంభమవడంతో.. త్వరలోనే ఇది ఆటో మార్కెట్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతీ సుజుకీ ఈ విటారా, టాటా కర్వ్ ఈవీ వంటి పాపులర్ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.