...
...
Next Story

Kia Discounts April : మండే ఎండల్లో చల్లటి వార్త! కియా కార్లపై అదిరే ఆఫర్లు- రూ. 3.2లక్షల వరకు ఆదా..

Discounts on Kia cars : ఏప్రిల్ 2026లో కొత్త కారు కొనాలనుకునే వారికి కియా ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కార్నివాల్, సెల్టోస్, సైరోస్ వంటి పాపులర్ మోడళ్లపై ఏకంగా రూ. 3.20 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది.

Published on: Apr 20, 2026, 05:47:03 IST
Advertisement

Discounts on Kia seltos : కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే తెలుగు రాష్ట్రాల వాహన ప్రియులకు కియా ఇండియా అదిరిపోయే తీపి కబురు అందించింది. ఏప్రిల్ 2026 నెలకు గానూ తన లైనప్‌లోని ప్రముఖ ఎస్‌యూవీ, ఎంపీవీ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. నగదు తగ్గింపులు, ఎక్స్​ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్ల రూపంలో ఈ ప్రయోజనాలను కస్టమర్లు పొందవచ్చు. ముఖ్యంగా పాత స్టాక్ క్లియర్ చేసే ఉద్దేశంతో కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో ఆఫర్లను గుప్పిస్తోంది.

కియా కార్నివాల్‌పై కళ్లు చెదిరే ఆఫర్..

కియా కార్లపై అదిరే డిస్కౌంట్లు..
కియా కార్లపై అదిరే డిస్కౌంట్లు..

కియా లైనప్‌లోనే అత్యంత లగ్జరీ మోడల్ అయిన 'కార్నివాల్'పై ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్లు లభిస్తున్నాయి. 2025లో తయారైన యూనిట్లపై ఏకంగా రూ. 3.20 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

నగదు తగ్గింపు: రూ. 50,000

ఎక్స్​ఛేంజ్ బోనస్: రూ. 2,00,000 (మీ పాత కారును మార్చుకుంటే)

కార్పొరేట్ బెనిఫిట్స్: రూ. 50,000 వరకు.

అయితే, 2026 మోడల్ (ఎంవై26) కార్నివాల్‌పై మాత్రం కేవలం రూ. 1 లక్ష వరకు మాత్రమే ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

సెల్టోస్ కొంటే రూ. 1.35 లక్షలు ఆదా!

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలుగుతున్న కియా సెల్టోస్​పై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. 2025 మోడల్ సెల్టోస్‌పై మొత్తం రూ. 1.35 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ. 40,000 నగదు తగ్గింపు, రూ. 60,000 ఎక్స్​ఛేంజ్ బోనస్, రూ. 20,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్ ఉన్నాయి. క్రెటా వంటి పోటీదారులతో పోలిస్తే సెల్టోస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

కియా సైరోస్, ఎలక్ట్రిక్ కార్లపై ఆఫర్లు..

క్యారెన్స్ క్లావిస్ ఈవీ (హెచ్​టీఎం వేరియంట్): 2025 స్టాక్‌పై రూ. 2.15 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ కారు కొనేవారికి ఇది సరైన సమయమని చెప్పవచ్చు.

"ఈ ఆఫర్లు డీలర్‌షిప్‌ను బట్టి, స్టాక్ లభ్యతను బట్టి మారుతుంటాయి. కాబట్టి కచ్చితమైన వివరాల కోసం మీ సమీపంలోని కియా షోరూమ్‌ను సంప్రదించడం ఉత్తమం," అని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. కియా కార్లపై ఈ డిస్కౌంట్లు ఎంతకాలం అందుబాటులో ఉంటాయి?

ఈ ఆఫర్లు ప్రస్తుతానికి ఏప్రిల్ 2026 చివరి వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

2. అత్యధిక డిస్కౌంట్ ఏ మోడల్ మీద ఉంది?

కియా కార్నివాల్ (PY25) మోడల్ మీద అత్యధికంగా రూ. 3.20 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

3. ఎక్స్​ఛేంజ్ బోనస్ అంటే ఏమిటి?

మీరు వాడుతున్న పాత కారును కియా షోరూమ్‌లో ఇచ్చేసి, కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే అదనపు తగ్గింపునే ఎక్స్ఛేంజ్ బోనస్ అంటారు.

4. 2025, 2026 మోడళ్ల మధ్య ఆఫర్లలో తేడా ఎందుకు ఉంది?

పాత స్టాక్‌ను (2025లో తయారైనవి) త్వరగా విక్రయించడం కోసం కంపెనీలు సాధారణంగా వాటిపైనే ఎక్కువ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe