...
...
Next Story

CBSE results 2026 : సీబీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు? ఎలా చెక్​ చేసుకోవాలి?

CBSE 10th class results : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే మధ్యలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. రిజల్ట్స్, పాస్ మార్కుల వివరాలు మీకోసం.

Published on: Mar 25, 2026 07:31 AM IST
Advertisement

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) బోర్డు పరీక్షల సందడి ముగియడంతో, ఇప్పుడు అందరి కళ్లు ఫలితాలపైనే ఉన్నాయి. సీబీఎస్​ఈ త్వరలోనే 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను విడుదల చేయనుంది. సాధారణంగా గత రెండేళ్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే.. 2024, 2025 సంవత్సరాల్లో మే 13న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా ఏప్రిల్ చివరి వారం నుంచి మే మధ్యలోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సీబీఎస్​ఈ రిజల్ట్స్ 2026 ఎలా చూడాలి? ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి?

సీబీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు? (RAJ K RAJ /HT PHOTO)
సీబీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు? (RAJ K RAJ /HT PHOTO)

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు బోర్డు అధికారిక పోర్టల్స్ ద్వారా తమ మార్కులను చూసుకోవచ్చు.

results.cbse.nic.in

cbseresults.nic.in

cbse.nic.in

cbse.gov.in

సీబీఎస్​ఈ ఫలితాలు 2026- ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన వివరాలు..

వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవడానికి మీ హాల్ టికెట్ (అడ్మిట్ కార్డ్) పై ఉన్న కింది వివరాలు తప్పనిసరి:

రోల్ నంబర్

స్కూల్ నంబర్

అడ్మిట్ కార్డ్ ఐడీ

సీబీఎస్​ఈ ఫలితాలు 2026- వెబ్‌సైట్ పనిచేయకపోతే ప్రత్యామ్నాయాలు ఏంటి?

సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 ఫలితాల విడుదల రోజున వెబ్‌సైట్‌పై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సర్వర్ సమస్యలు తలెత్తినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెబ్‌సైట్‌తో సంబంధం లేకుండా విద్యార్థులు ఎస్​ఎంఎస్​, ఐవీఆర్​ఎస్​ (ఫోన్ కాల్), డిజిలాకర్, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా తమ మార్కులను తెలుసుకోవచ్చు. మీ 2026 అడ్మిట్ కార్డ్‌ను దగ్గర పెట్టుకోవడం మర్చిపోవద్దు.

పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి?

సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం.. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 33 శాతం మార్కులు సాధించాలి. ఇందులో థియరీ, ఇంటర్నల్ అసెస్‌మెంట్ రెండూ కలిపి ఉంటాయి. సాధారణంగా థియరీ పేపర్‌లో 27 మార్కులు, ఇంటర్నల్ అసెస్‌మెంట్ (20 మార్కులకు గాను) లో కనీసం 7 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

1. సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది?

గత రెండేళ్ల (2024, 2025) ట్రెండ్‌ను బట్టి చూస్తే, మే 13వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ చివరి వారం నుంచి మే మధ్యలోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంచనా. బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడగానే వెబ్‌సైట్‌లో లింక్స్ అందుబాటులోకి వస్తాయి.

2. వెబ్‌సైట్ ఓపెన్ కాకపోతే ఫలితాలు ఎలా చూసుకోవాలి?

ఫలితాల విడుదల సమయంలో వెబ్‌సైట్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు విద్యార్థులు డిజిలాకర్ యాప్ లేదా UMANG యాప్ ద్వారా తమ మార్కు షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా SMS, IVRS (ఫోన్ కాల్) ద్వారా కూడా మార్కులను తెలుసుకునే సౌకర్యం బోర్డు కల్పిస్తుంది.

3. పాస్ అవ్వడానికి కనీసం ఎన్ని మార్కులు రావాలి?

సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం, ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు కనీసం 33% మార్కులు సాధించాలి. అంటే 80 మార్కుల థియరీ పేపర్‌లో కనీసం 26 నుంచి 27 మార్కులు, 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో కనీసం 7 మార్కులు తప్పనిసరిగా రావాలి. థియరీ, ప్రాక్టికల్ రెండింటిలోనూ విడివిడిగా పాస్ మార్కులు సాధించడం ముఖ్యం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe