సీబీఎస్​ఈ 10వ తరగతి ఇంగ్లీష ఎగ్జామ్​- పరీక్ష తేదీ, ఫార్మాట్​ ఇలా..

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఈ ఏడాది ఎప్పుడు జరుగుతుంది? ఈ పరీక్ష విధానం, విభాగాల వారీగా మార్కుల కేటాయింపు, మార్కింగ్ స్కీమ్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీ ప్రిపరేషన్​కి ఇది ఉపయోగపడుతుంది.

Published on: Jan 6, 2026, 06:45:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీబీఎస్‌ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకెండరీ ఎడ్యుకేషన్​) 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్! 2026 విద్యా సంవత్సరానికి గాను ఫిబ్రవరి 21న ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇంగ్లీష్ (కమ్యూనికేటివ్), ఇంగ్లీష్ (లాంగ్వేజ్ అండ్ లిటరేచర్) పరీక్షలు రెండూ ఒకే రోజున, ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ పేపర్​ ఫార్మాట్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు 2026..
సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు 2026..

ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్: పేపర్ విశ్లేషణ

ఈ సీబీఎస్​ఈ క్లాస్ 10 ఇంగ్లీష్​ పేపర్ మొత్తం 80 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు విభాగాల (సెక్షన్లు) కింద మొత్తం 11 ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థులు అన్ని ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

సెక్షన్ ఏ (రీడింగ్ స్కిల్స్): దీనికి 20 మార్కులు కేటాయించారు.

సెక్షన్ బీ (గ్రామర్ అండ్​ క్రియేటివ్ రైటింగ్): ఈ విభాగం నుంచి 20 మార్కుల ప్రశ్నలు వస్తాయి.

సెక్షన్ సీ (లిటరేచర్ టెక్ట్స్​బుక్): పాఠ్యపుస్తకం ఆధారంగా అడిగే ఈ విభాగానికి అత్యధికంగా 40 మార్కులు ఉంటాయి.

ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ పేపర్ వివరాలు..

ఈ క్వశ్చన్ పేపర్‌లో మొత్తం 12 ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ తప్పనిసరిగా రాయాల్సిన ప్రశ్నలే. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి:

సెక్షన్ ఏ (రీడింగ్ స్కిల్స్): 22 మార్కులు.

సెక్షన్ బి (రైటింగ్ స్కిల్స్): 22 మార్కులు.

సెక్షన్ సి (గ్రామర్): 10 మార్కులు.

సెక్షన్ డి (లిటరేచర్): 26 మార్కులు.

సీబీఎస్​ఈ క్లాస్​ 10 విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను సులభతరం చేసుకునేందుకు వీలుగా బోర్డు 'మార్కింగ్ స్కీమ్'ను కూడా విడుదల చేసింది. దీనిని సీబీఎస్‌ఈ అకాడమిక్ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

మార్కింగ్ స్కీమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

విద్యార్థులు కింద సూచించిన పద్ధతిలో మార్కింగ్ స్కీమ్‌ను పొందవచ్చు:

స్టెప్​ 1- ముందుగా సీబీఎస్‌ఈ అకడమిక్ వెబ్‌సైట్ cbseacademic.nic.in సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే 'Sample Paper' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- అక్కడ 10వ తరగతి ఆప్షన్‌ను ఎంచుకోండి.

స్టెప్​ 4- ఆ తర్వాత ఇంగ్లీష్ పేపర్ మార్కింగ్ స్కీమ్ లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్​ 5- వెంటనే ఒక పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.

స్టెప్​ 6- దానిని చెక్​ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోండి.

మరిన్ని వివరాల కోసం సీబీఎస్​ఈ 10వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు తరచు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More