...
...
Next Story

CBSE Board Exams Postponed : అక్కడ సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా.. కారణం ఇదే

CBSE Board Exams Postponed : సీబీఎస్ఈ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో బోర్డు పరీక్షలు వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఎక్కడెక్కడ పరీక్షలు వాయిదా పడ్డాయో చూద్దాం..

Published on: Mar 3, 2026, 15:26:14 IST
Advertisement

సీబీఎస్ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు ఆటంకాలు తప్పడం లేదు. పలు కారణాలతో బోర్డు పరీక్షలు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇబ్బందులు ఉన్న ప్రదేశాల్లో బోర్డు పరీక్షలు వాయిదా వేస్తూ ఉంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 6 తేదీల్లో కొన్ని సెంటర్లలో జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది సీబీఎస్ఈ.

సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

భారత్‌‌తోపాటు 26 దేశాల్లో సీబీఎస్ఈ ఏడాది 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. 46 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అక్కడ బోర్డు పరీక్షలకు ఆటంకాలు కలుగుతున్నాయి.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా దృష్ట్యా మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను అనేక గల్ఫ్ దేశాలలో వాయిదా వేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) మార్చి 3న ప్రకటించింది.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాజాగా సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా వేసింది.

  • పశ్చిమాసియాలో కొన్ని ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
  • మార్చి 3న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేశారు.

అంతకుముందు బోర్డు మార్చి 2, 2026న జరగాల్సిన 10, 12 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసింది. సవరించిన తేదీలను తరువాత తెలియజేస్తామని వెల్లడించింది. మార్చి 5 నుండి జరగాల్సిన పరీక్షలపై నిర్ణయం తీసుకునే ముందు మార్చి 3న పరిస్థితిని తిరిగి అంచనా వేస్తామని తెలిపింది.

పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయడం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్.. టెహ్రాన్‌లోని పలు లక్ష్యాలపై వరుస క్షిపణి, డ్రోన్ దాడులను చేసింది. ఇరాన్.. ఇజ్రాయెల్‌లోని ఇతర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేసింది. అలాగే పశ్చిమాసియా అంతటా అమెరికన్ సైనిక స్థావరాలు, దౌత్య కార్యాలయాలను కూడా లక్ష్యంగా చేసుకుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks