...
...
Next Story

సంచలనం సృష్టిస్తున్న GPT-6 Astra.. ఆలోచించడమే కాదు, పని కూడా చేసేస్తుంది! ఇక మనుషులు అవసరం లేదు

ఓపెన్ఏఐ తన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్ 'జీపీటీ-6 ఆస్ట్రా'ను ఇటీవలే గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, కంప్యూటర్ పనులను సొంతంగా పూర్తి చేయగల సామర్థ్యంతో రూపుదిద్దుకున్న ఈ టెక్నాలజీ వివరాలు మీకోసం.

Published on: Sep 8, 2026, 14:01:44 IST
Advertisement

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ తన అత్యంత అధునాతన, శక్తివంతమైన మోడల్ ‘జీపీటీ-6 ఆస్ట్రా’ను ఇటీవలే అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏఐ మోడళ్లు కేవలం సమాధానాలు ఇవ్వడానికి, వ్యాసాలు రాయడానికి లేదా కోడింగ్ సూచనలు ఇవ్వడానికి మాత్రమే పరిమితమవ్వగా.. ఈ కొత్త 'ఆస్ట్రా' ఒకడుగు ముందుకు వేసి, మానవ ప్రమేయం చాలా తక్కువగా ఉంటూనే, కంప్యూటర్‌లో సంక్లిష్టమైన పనులను నేరుగా పూర్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

చాట్​జీపీటీ 6 ఆస్ట్రా..
చాట్​జీపీటీ 6 ఆస్ట్రా..

ఇప్పటికే చాట్‌జీపీటీ ప్లస్, ప్రో, బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులకు ఈ జీపీటీ-6 ఆస్ట్రా సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన వినియోగదారులందరికీ ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

జీపీటీ-5.6 సోల్ వర్సెస్ ఆస్ట్రా: తేడా ఏంటి?

గతంలో వచ్చిన జీపీటీ-5.6 సోల్ మోడల్‌తో పోలిస్తే, జీపీటీ-6 ఆస్ట్రా పనితీరులో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పాత మోడల్ కేవలం ఆలోచించి, విశ్లేషించి సమాధానం ఇచ్చేది. కానీ ఆస్ట్రా మాత్రం ఆలోచించడంతో పాటు ఆ పనిని నేరుగా కంప్యూటర్‌లో ఎగ్జిక్యూట్ చేస్తుంది.

ఆస్ట్రా సాధించిన కొన్ని ప్రధాన సాంకేతిక పురోగతులు:

కంప్యూటర్ కంట్రోల్: బ్రౌజర్‌ను ఓపెన్ చేయడం, వెబ్‌సైట్లలో డేటాను వెతకడం, ఆన్‌లైన్ ఫారమ్‌లను నింపడం వంటి పనులను సొంతంగా చేస్తుంది.

ఆటోమేషన్: కంపెనీల కస్టమర్ డేటా (సీఆర్​ఎం) అప్‌డేట్ చేయడం, క్యాలెండర్‌లలో అపాయింట్‌మెంట్‌లు షెడ్యూల్ చేయడం వంటి మల్టీ-స్టెప్ వర్క్‌ఫ్లోలను సులభంగా పూర్తి చేస్తుంది.

కోడింగ్ అండ్ డేటా అనలిటిక్స్: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్, విస్తృతమైన డేటా విశ్లేషణను అత్యంత వేగంగా చేయగలదు.

డాక్యుమెంట్ మేకింగ్: ప్రెజెంటేషన్లు, ఎక్సెల్ షీట్లు, వర్డ్ డాక్యుమెంట్లను ఆటోమేటిక్‌గా డిజైన్ చేస్తుంది.

సామర్థ్యం ఏ స్థాయిలో ఉందంటే..

డెవలపర్ల కోసం రూపొందించిన దీని ఏపీఐ వర్షన్ 1.05 మిలియన్ టోకెన్ల కాంటెక్ట్స్ విండోను కలిగి ఉంది. దీనివల్ల భారీ ప్రాజెక్టులు, సుదీర్ఘమైన కోడింగ్ ఫైళ్లను ఒకేసారి విశ్లేషించడం సులువవుతుంది.

భారతీయ మార్కెట్, ఐటీ రంగానికి వరమా?

హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రపంచస్థాయి ఐటీ హబ్‌లు ఉన్న భారతదేశంలో ఈ టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు రోజువారీగా చేసే రిపిటీటివ్ టాస్క్​లును జీపీటీ-6 ఆస్ట్రా ఆటోమేట్ చేస్తుంది! దీనివల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరగడమే కాకుండా, కంపెనీలకు సమయం, వ్యయం ఆదా అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఇది కేవలం ఒక చాట్‌బాట్ మాత్రమే కాదు.. ఒక డిజిటల్ అసిస్టెంట్‌లా మీ కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తూ పనులను చక్కబెడుతుంది.

ఎవరెవరికి అందుబాటులో ఉంటుంది?

ప్రస్తుతానికి చాట్‌జీపీటీ పెయిడ్ వర్షన్స్ (ప్లస్, ప్రో, బిజినెస్, ఎంటర్​ప్రైజ్) వాడుతున్న వారికి అదనపు రుసుము లేకుండానే ఇది లభిస్తుంది. అంతేకాకుండా ఓపెన్ఏఐ ఏపీఐ, అమెజాన్ బెడ్‌రాక్ ద్వారా డెవలపర్లు కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe