శామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్‌ఏఐ కంపెనీ భారతీయ వినియోగదారుల కోసం భారీ ఆఫర్‌ను ప్రకటించింది! నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే పరిమిత కాల ప్రమోషనల్ పీరియడ్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి ChatGPT Go సబ్‌స్క్రిప్షన్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది.

భారత్‌లో తొలిసారిగా బెంగళూరులో కంపెనీ నిర్వహించనున్న 'దేవ్డే' ఈవెంట్‌కు ముందు ఓపెన్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ఆఫర్ కొత్త యూజర్లకు, ఇప్పటికే చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రైబర్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి అదనంగా 12 నెలల ఉచిత సేవలు లభిస్తాయి!
చాట్‌జీపీటీ గో ద్వారా లభించే ప్రయోజనాలేంటి?
అధునాతన ఏఐ (ఏఐ) టూల్స్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావాలని వినియోగదారులు కోరిన నేపథ్యంలో, వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఓపెన్‌ఏఐ గత ఆగస్టులో భారత్‌లో, తక్కువ ధరకే (నెలకు రూ. 399) ప్రారంభించింది.
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అధిక మెసేజ్ పరిమితులు, ఇమేజ్ జనరేషన్ (చిత్రాలను రూపొందించడం), ఫైల్ అప్‌లోడ్ వంటి సామర్థ్యాలను పొందవచ్చు. ఇది రోజువారీ, వృత్తిపరమైన అవసరాలకు అనువుగా ఉంటుంది.
ఓపెన్‌ఏఐ తెలిపిన వివరాల ప్రకారం.. చాట్‌జీపీటీ గోను ప్రారంభించిన మొదటి మార్కెట్లలో భారతదేశం ఒకటి. ఇది ఈ ప్రాంతంపై కంపెనీకి పెరుగుతున్న దృష్టిని తెలియజేస్తుంది. లాంచ్ అయిన మొదటి నెలలోనే, భారతదేశంలో చెల్లింపు సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య రెట్టింపు అయ్యింది! దీంతో ఓపెన్‌ఏఐ ఈ ప్లాన్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 మార్కెట్‌లకు విస్తరించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో భారత్!
భారతదేశం తమకు రెండొవ అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల బేస్‌లో ఒకటిగా ఉందని ఓపెన్‌ఏఐ పేర్కొంది. డెవలపర్లు, విద్యార్థులు, నిపుణులతో సహా లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజూ చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారు.
{{/usCountry}}భారతదేశం తమకు రెండొవ అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల బేస్‌లో ఒకటిగా ఉందని ఓపెన్‌ఏఐ పేర్కొంది. డెవలపర్లు, విద్యార్థులు, నిపుణులతో సహా లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజూ చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారు.
{{/usCountry}}"ఈ ప్రమోషన్ ఓపెన్‌ఏఐ'ఇండియా-ఫస్ట్' నిబద్ధతకు కొనసాగింపు. ఇది ఇండియాఏఐ మిషన్కి మద్దతు ఇస్తుంది. వచ్చే ఏడాది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో, భారతదేశంలో ఏఐ చుట్టూ పెరుగుతున్న వేగాన్ని ఈ చర్య మరింత బలోపేతం చేస్తుంది," అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఓపెన్‌ఏఐ వైస్ ప్రెసిడెంట్, చాట్‌జీపీటీ హెడ్ నిక్ టర్లీ మాట్లాడుతూ.. భారతదేశంలో చాట్‌జీపీటీ గో ప్రారంభించినప్పటి నుంచి వచ్చిన ఉత్సాహపూరిత స్పందన తమను ప్రోత్సహించిందని చెప్పారు.
"కొన్ని నెలల క్రితం భారతదేశంలో చాట్‌జీపీటీ గోను ప్రారంభించినప్పటి నుంచి, మా వినియోగదారుల నుంచి వచ్చిన ఆదరణ, సృజనాత్మకత మాకు స్ఫూర్తినిచ్చాయి," అని టర్లీ అన్నారు. "భారత్‌లో మా మొదటి దేవ్డే ఎక్స్ఛేంజ్ ఈవెంట్ సందర్భంగా, దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఈ అధునాతన ఏఐ సేవలను సులభంగా యాక్సెస్ చేయడానికి, ప్రయోజనం పొందడానికి వీలుగా చాట్‌జీపీటీ గోను ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నాము," అని తెలిపారు.