చాట్‌జీపీటీలో 'గ్రూప్ చాట్స్' ఫీచర్- ప్రయోజనాలేంటి?
చాట్‌జీపీటీలో 'గ్రూప్ చాట్స్' ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందరికి అందుబాటులోకి వచ్చింది. అసలేంటి ఈ గ్రూప్ చాట్స్? ఓపెన్‌ఏఐ ఈ ఫీచర్‌ని ఎందుకు తీసుకొచ్చింది? దీనితో ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఓపెన్‌ఏఐ సంస్థ గత వారం చాట్‌జీపీటీలో గ్రూప్ చాట్స్ ఫీచర్‌ను ప్రకటించింది. అయితే, మొదట్లో ఈ ఫీచర్ కొన్ని ప్రాంతాలdలోని, కొద్దిమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది! దీనితో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాట్‌జీపీటీ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

గ్రూప్ చాట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు 20 మంది వరకు వ్యక్తులను సంభాషణలోకి ఆహ్వానించవచ్చు. ప్రయాణాలు, ప్రాజెక్టులు, ఆఫీస్ పనులు, ఇతర విషయాలపై చర్చించడానికి ఈ గ్రూప్‌ల్లో చాట్‌జీపీటీ కూడా భాగమవుతుంది. చాట్‌జీపీటీ కొత్త గ్రూప్ చాట్స్ ఫీచర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి..
చాట్‌జీపీటీ గ్రూప్ చాట్స్ ఇప్పుడు అందరికి..
చాట్‌జీపీటీలో వచ్చిన ఈ సరికొత్త గ్రూప్ చాట్స్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. మొదట్లో ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో ఉన్న వ్యక్తులతో పరీక్షించడానికి ఓపెన్‌ఏఐ పైలట్ మోడ్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులతో సమర్థవంతంగా కలిసి పనిచేయడానికి ఇది అందరికీ అందుబాటులో ఉంది.
గ్రూప్ చాట్స్ ద్వారా వినియోగదారులకు చాట్‌జీపీటీతో కూడిన షేర్డ్ కాన్వర్జేషన్ స్పేస్ లభిస్తుంది. ఒక గ్రూప్‌లో గరిష్టంగా 20 మంది వరకు ఉండవచ్చు. ఈ స్పేస్‌లో చేరడానికి అవసరమైన ఆహ్వాన లింక్‌ను గ్రూప్‌లోని ప్రతి ఒక్కరూ సృష్టించి, ఇతరులతో పంచుకోవచ్చు.
వాట్సాప్ తరహాలోనే వినియోగం
మనం వాట్సాప్‌లో గ్రూప్ చాట్‌లను ఎలా ఉపయోగిస్తామో, చాట్‌జీపీటీ వెర్షన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. వినియోగదారులు ప్రయాణ ప్రణాళికలు, ప్రాజెక్టులపై పని, బ్రెయిన్‌స్టార్మింగ్, కలుసుకోవడానికి ప్రణాళికలు వంటి అనేక విషయాలను గ్రూప్‌లో చర్చించుకోవచ్చు.
ముఖ్యంగా, గ్రూప్‌లోని చర్చల్లో ఏమైనా సిఫార్సులు, ప్రణాళికలు, కొత్త ఆలోచనల కోసం చాట్‌జీపీటీని యాక్టివేట్ చేయవచ్చు. దీని ద్వారా ఈ గ్రూప్ అందరికీ ఉమ్మడి ఏఐ-ఆధారిత స్పేస్‌గా మారుతుంది.
గ్రూప్ చాట్ ఎలా ప్రారంభించాలి?
స్టెప్ -1 చాట్‌జీపీటీలో గ్రూప్ చాట్‌ను ప్రారంభించడానికి, మీరు కుడి ఎగువ మూలలో ఉన్న "పీపుల్" ఐకాన్ని క్లిక్ చేయాలి.
స్టెప్- 2 అక్కడ నుంచి, మీరు గ్రూప్‌కు ఆహ్వానించదలిచిన వ్యక్తులతో పంచుకోదగిన గ్రూప్ ఆహ్వాన యూఆర్ఎల్ని సృష్టించవచ్చు.
స్టెప్- 3 ముఖ్యంగా, గ్రూప్‌ను సృష్టించడానికి లేదా గ్రూప్‌లో చేరడానికి, మీరు మీ ఇమెయిల్‌తో చాట్‌జీపీటీకి సైన్ ఇన్ చేసి ఉండాలి.
ఇక ఆలస్యం చేయకుండా, ఈ కొత్త ఫీచర్‌ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రయత్నించండి. ఇది మీకు ఎంతగా ఉపయోగపడుతుందో మీరే చూడండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


