స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అప్డేట్! ప్రముఖ డైరీ ఉత్పత్తుల బ్రాండ్ 'మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్స్' ఐపీఓ రేపటి నుంచి (ఆగస్టు 11, మంగళవారం) సబ్‌స్క్రిప్షన్ కోసం మార్కెట్లోకి వస్తోంది. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 13 (గురువారం) వరకు అందుబాటులో ఉంటుంది.

రూ. 1,553 కోట్ల పబ్లిక్ ఆఫర్ కోసం కంపెనీ షేరు ధర రూ. 133 నుంచి రూ. 140 వరకు ధరల శ్రేణిని ఖరారు చేసింది. ఈ ప్రైస్ బ్యాండ్ ప్రకారం.. ఐపీఓ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 10,310 కోట్ల నుంచి రూ. 10,778 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మిల్కీ మిస్ట్ ఐపీఓ- పూర్తి వివరాలు..
మిల్కీ మిస్ట్ ఐపీఓలో భాగంగా రూ. 1,428 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేస్తున్నారు. అలాగే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద రూ. 125 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తంగా ఈ ఇష్యూ సైజ్ రూ. 1,553 కోట్లుగా ఉంది. ఈ ఐపీఓ పట్ల బ్రోకరేజ్ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. మదుపర్లు ఈ ఇష్యూకి 'సబ్‌స్క్రైబ్' చేయవచ్చని సిఫార్సు చేశాయి.
మిల్కీ మిస్ట్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం..
మిల్కీ మిస్ట్ ఐపీఓ జీఎంపీ 17శాతం నుంచి 19శాతం లాభాల మధ్యలో ఊగిసలాడుతోంది. ఈ ఐపీఓ జీఎంపీ ప్రస్తుతం రూ. 26గా ఉంది. అంటే, అప్పర్ ప్రైజ్ బ్యాండ్‌తో పోల్చితే ఈ మిల్కీ మిస్ట్ ఐపీఓ రూ. 26 లేదా దాదాపు 18.5శాతం లాభాలతో రూ. 166 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
అయితే, కేవలం గ్రే మార్కెట్ ప్రీమియంను చూసి ఐపీఓకి సబ్‌స్క్రైబ్ చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే ఈ జీఎంపీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.
మిల్కీ మిస్ట్ ఐపీఓ అప్లై చేయాలా? వద్దా?
{{/usCountry}}అయితే, కేవలం గ్రే మార్కెట్ ప్రీమియంను చూసి ఐపీఓకి సబ్‌స్క్రైబ్ చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే ఈ జీఎంపీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.
మిల్కీ మిస్ట్ ఐపీఓ అప్లై చేయాలా? వద్దా?
{{/usCountry}}మిల్కీ మిస్ట్ ఐపీఓలో పెట్టుబడి పెట్టవచ్చని ఎస్బీఐ సెక్యూరిటీస్ సిఫార్సు చేసింది. సంప్రదాయ తక్కువ మార్జిన్లిక్విడ్ మిల్క్ వ్యాపారంతో పోలిస్తే, మిల్కీ మిస్ట్ ఎక్కువ మార్జిన్లు అందించే వ్యాల్యూ-యాడెడ్ డైరీ ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి పెడుతోందని బ్రోకరేజ్ పేర్కొంది.
ఎగువ ధరల శ్రేణి వద్ద ఈ ఐపీఓ వ్యాల్యూ ఎఫ్వై26 పీఈ మల్టిపుల్ 84.9xగా ఉందని బ్రోకరేజ్ వెల్లడించింది. ఐపీఓ ద్వారా వచ్చే నిధులతో రూ. 497 కోట్ల రుణాలను తీర్చివేయాలని కంపెనీ ప్రణాళిక వేసుకుంది. దీనివల్ల భవిష్యత్తులో వడ్డీ భారం తగ్గుతుందని ఎస్బీఐ సెక్యూరిటీస్ తెలిపింది. సామర్థ్య వినియోగం పెరగడం వల్ల రాబోయే రోజుల్లో బలమైన రెండంకెల వృద్ధి సాధించే అవకాశమూ ఉందని అంచనా వేసింది.
ఎఫ్వై24-ఎఫ్వై26 మధ్య కాలంలో కంపెనీ ఆదాయం, ఎబిట్డా, నికర లాభంలో వరుసగా 31.3 శాతం, 40.5 శాతం, 155.6 శాతం సీఏజీఆర్ వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
ప్యాకేెజ్డ్ పన్నీర్ మార్కెట్లో కంపెనీకి 19 శాతం వాటా ఉంది. చీజ్, పెరుగు, యోగర్ట్ మార్కెట్లలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫుడ్ కంపెనీగా మిల్కీ మిస్ట్ నిలిచింది.
ఇక ఈ ఐపీఓ దీర్ఘకాలిక పెట్టుబడికి అద్భుతమైన అవకాశమని SIMFS లిమిటెడ్ విశ్లేషకులు తెలిపారు.
కంపెనీకి చెందిన విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణి, 74 వేల మందికి పైగా రైతులతో ఉన్న డైరెక్ట్ మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ నెట్‌వర్క్ దీనికి బలమైన పోటీతత్వాన్ని ఇస్తాయని బ్రోకరేజ్ పేర్కొంది. భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం, అదనంగా 66,000 బ్రాండెడ్ కూలింగ్ అసెట్లను ఏర్పాటు చేయడం లాంటి ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది.
"కంపెనీ ప్రత్యేకమైన బిజినెస్ మోడల్, అనుసంధాన ఆపరేషన్స్, అద్భుతమైన అమలు సామర్థ్యాల కారణంగా.. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఈ ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నాము," అని బ్రోకరేజ్ స్పష్టం చేసింది. భారతీయ డైరీ రంగంలో అతిపెద్ద ఐపీఓగా మిల్కీ మిస్ట్ నిలవనుంది.
పరాగ్ మిల్క్ ఫుడ్స్, హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్, దొడ్లా డైరీ వంటి సంస్థలు ఈ రంగంలో దీనికి పోటీదారులుగా ఉన్నాయి.