2026 Hyundai Verna : హ్యుందాయ్​ వెర్నా ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు- వాటి ఫీచర్లు, ధరలు..

Hyundai Verna : 2026 హ్యుందాయ్​ వెర్నా వచ్చేసింది. మీరు ఈ సెడాన్​ని కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. ఇది మీకోసమే! హ్యుందాయ్​ వెర్నా ఫేేస్​లిఫ్ట్​ వేరియంట్లు, వాటి ఫీచర్లు, వాటి ధరలకు సంబంధంచిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 10, 2026, 07:30:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హ్యుందాయ్ వెర్నా.. ఇప్పుడు సరికొత్తగా భారతీయుల ముందుకు వచ్చింది. ఈ మేరకు 2026 హ్యుందాయ్​ వెర్నాని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వేరియంట్లు, వాటి ఫీచర్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

2026 హ్యుందాయ్​ వెర్నా..
2026 హ్యుందాయ్​ వెర్నా..

2026 హ్యుందాయ్ వెర్నా- ధర, ఇంజిన్ వివరాలు..

హ్యుందాయ్​ వెర్నా ఫేస్​లిఫ్ట్​ ఇంజిన్, పవర్‌ట్రెయిన్లలో ఎలాంటి మార్పులు లేవు. దీని ఎక్స్​షోరూం ధరలు రూ. 10.98 లక్షల నుంచి రూ. 18.25 లక్షల వరకు ఉన్నాయి. ఇది మార్కెట్లో వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, హోండా సిటీలతో పోటీ పడుతుంది.

1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్: 115 హెచ్​పీ పవర్, 144 ఎన్​ఎం టార్క్.

1.5-లీటర్ టర్బో-పెట్రోల్: 160 హెచ్​పీ పవర్, 253 ఎన్​ఎం టార్క్.

గేర్‌బాక్స్ ఆప్షన్లు: రెండింటికీ 6-స్పీడ్ మాన్యువల్ స్టాండర్డ్. ఎన్​ఎం పెట్రోల్‌కు సీవీటీ, టర్బో-పెట్రోల్‌కు 7-స్పీడ్ డీసీటీ ఆప్షన్లు ఉన్నాయి.

2026 హ్యుందయ్​ వెర్నా- కలర్​ ఆప్షన్స్​..

వెర్నా ఫేస్​లిఫ్ట్​ ఇప్పుడు 7 కంటే ఎక్కువ రంగుల్లో లభిస్తుంది. ఇందులో కొత్తగా టైటాన్ గ్రే మ్యాట్, క్లాసీ బ్లూ రంగులు చేరాయి.

ఇతర రంగులు:

టైటానియం బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, స్టారీ నైట్. కేవలం అట్లాస్ వైట్ రంగుకు మాత్రమే బ్లాక్ రూఫ్‌తో డ్యూయల్-టోన్ ఆప్షన్ ఉంది.

2026 హ్యుందాయ్​ వెర్నా- వేరియంట్ల వారీగా ఫీచర్లు..

హ్యుందాయ్​ వెర్నా హెచ్​ఎక్స్​2- (ఎక్స్​షోరూం ధర: రూ. 10.98 లక్షలు | 1.5లీటర్​ ఎన్​ఏ పెట్రోల్​ ఎంటీ)

6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్​, ఈబీడీ, ఈఎస్​సీ.

రియర్ పార్కింగ్ సెన్సార్లు, డే/నైట్ ఐఆర్​వీఎం, ఆటో హెడ్‌ల్యాంప్స్.

కీలెస్ ఎంట్రీ, రియర్ డీఫాగర్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్.

15-అంగుళాల స్టీల్ వీల్స్ (కవర్లతో), డ్యూయల్ టోన్ ఇంటీరియర్, ఫ్యాబ్రిక్ సీట్లు.

మాన్యువల్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, టిల్ట్ స్టీరింగ్, టైప్-సి పోర్ట్‌లు.

ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్​వీఎం

హ్యుందాయ్​ వెర్నా హెచ్​ఎక్స్​4- (ఎక్స్​షోరూం ధర: రూ. 12.25 లక్షలు | 1.5లీటర్​ ఎన్​ఏ పెట్రోల్​ ఎంటీ)

(హెచ్​ఎక్స్​2 కంటే అదనంగా ఉండేవి)

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్​).

ఎల్​ఈడీ పొజిషనింగ్ ల్యాంప్స్, డీఆర్​ఎల్స్​, టెయిల్-ల్యాంప్స్.

రియర్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 15- ఇంచ్​ అల్లాయ్ వీల్స్.

8- ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే అండ్​ ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ రికగ్నిషన్.

సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్.

హ్యుందాయ్​ వెర్నా హెచ్​ఎక్స్​6- ( ఎక్స్​షోరూం ధర: రూ. 13.19 లక్షల నుంచి రూ. 14.40 లక్షలు | ఎన్​ఏ పెట్రోల్​ ఎంటీ అండ్​ సీవీటీ)

(హెచ్​ఎక్స్​4 కంటే అదనంగా ఉండేవి)

రియర్ వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఆటో-డిమ్మింగ్ ఐఆర్​వీఎం.

పుష్ బటన్ స్టార్ట్, ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 16- ఇంచ్​ అల్లాయ్ వీల్స్.

లెదర్ స్టీరింగ్ వీల్ అండ్​ గేర్ నాబ్, యాంబియంట్ లైటింగ్.

ప్యాడిల్ షిఫ్టర్స్, డ్రైవ్ మోడ్స్ (కేవలం సీవీటీలో).

వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్​వీఎంలు.

హ్యుందాయ్​ వెర్నా హెచ్​ఎక్స్​6+ - (ఎక్స్​షోరూం ధర: రూ. 13.81 లక్షల నుంచి రూ. 15.02 లక్షలు | ఎన్​ఏ పెట్రోల్​ ఎంటీ అండ్​ సీవీటీ)

(హెచ్​ఎక్స్​6 కంటే అదనంగా ఉండేవి)

లెదరెట్ సీట్ అప్‌హోలిస్ట్రీ.

8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్.

ఫ్రంట్ సీట్ వెంటిలేషన్.

హ్యుందాయ్​ వెర్నా హెచ్​ఎక్స్​8- (ఎక్స్​షోరూం ధర: రూ. 14.88 లక్షల నుంచి రూ. 17.62 లక్షలు | ఎన్​ఏ పెట్రోల్​ అండ్​ టర్బో పెట్రోల్​)

(హెచ్​ఎక్స్​6+ కంటే అదనంగా ఉండేవి)

ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (డీసీటీ), రియర్ డిస్క్ బ్రేక్స్.

లెవల్ 2 అడాస్​ (టర్బో పెట్రోల్‌లో), డాష్ కామ్.

16- ఇంచ్​ డార్క్ గ్రే అల్లాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ (టర్బోలో).

8-వే పవర్ డ్రైవర్ సీట్ (మెమరీ ఫంక్షన్‌తో).

10.25- ఇంచ్​ టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ.

హ్యుందాయ్​ వెర్నా హెచ్​ఎక్స్​10- (ఎక్స్​షోరూం ధర: రూ. 17.15 లక్షల నుంచి రూ. 18.25 లక్షలు | సీవీటీ అండ్​ డీసీటీ)

(హెచ్​ఎక్స్​8 కంటే అదనంగా ఉండేవి)

7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్.

4-వే పవర్డ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్.

ప్యాసింజర్ సీట్ కోసం పవర్డ్ ‘బాస్ మోడ్’.

10.25- ఇంచ్​ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే.

2026 హ్యుందాయ్​ వెర్నా- మీరు ఏ వేరియంట్ ఎంచుకోవాలి?

ఆటోమొబైల్​ నిపుణుల ప్రకారం.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు (వాల్యూ ఫర్​ మనీ) కోరుకునే వారికి హెచ్​ఎక్స్​6+ సరైన ఎంపిక. ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి లగ్జరీ ఫీచర్లు లభిస్తాయి. బడ్జెట్ పరిమితి లేకపోతే, మెమరీ సీట్లు- పెద్ద స్క్రీన్ కోసం హెచ్​ఎక్స్​8 వేరియంట్ తీసుకోవడం ఉత్తమం.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. 2026 వెర్నాలో పెరిగిన ధరల వివరాలు ఏంటి?

అప్‌డేట్ తర్వాత బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 18,000 పెరగ్గా, ఫీచర్లు ఎక్కువగా ఉన్న టాప్ వేరియంట్ ధర పాత మోడల్ కంటే దాదాపు రూ. 1.1 లక్షల వరకు పెరిగింది.

2. వెర్నాలో కొత్తగా వచ్చిన 'బాస్ మోడ్' ఫీచర్ దేనికి ఉపయోగపడుతుంది?

హెచ్​ఎక్స్​10 వేరియంట్​లో లభించే ఈ 'పవర్డ్ బాస్ మోడ్' ద్వారా వెనుక కూర్చున్న ప్రయాణికులు ముందు ప్యాసింజర్ సీటును బటన్ నొక్కడం ద్వారా ముందుకు జరుపుకోవచ్చు. దీనివల్ల వెనుక లెగ్‌రూమ్ (కాలు పెట్టుకునే స్థలం) పెరుగుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More