...
...
Next Story

OnePlus smartphones : జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్- వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్స్​పై క్రేజీ ఆఫర్లు..

Amazon Prime Day Sale : జులై 4 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్‌ప్లస్ ప్రాడక్ట్స్​పై భారీ డిస్కౌంట్లను ప్రకటించారు. వన్‌ప్లస్ 15, నార్డ్ 6 సిరీస్ ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్స్‌పై లభించే ఆఫర్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jun 30, 2026, 14:01:20 IST
Advertisement

అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా వన్‌ప్లస్ తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది! జులై 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు రోజుల మెగా సేల్‌లో.. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. నేరుగా ధర తగ్గింపులతో పాటు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఉచిత యాక్సెసరీలను ఈ అమెజాన్ సేల్​లో కంపెనీ ఆఫర్ చేస్తోంది.

వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్స్​, గ్యాడ్జెట్స్​పై క్రేజీ ఆఫర్లు..
వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్స్​, గ్యాడ్జెట్స్​పై క్రేజీ ఆఫర్లు..

ఈ సేల్​లో ఫ్లాగ్‌షిప్ మోడల్ వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ ప్యాడ్ 4 లతో పాటు ఇటీవల లాంచైన వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 వంటి అనేక ప్రొడక్ట్స్ తక్కువ ధరకే లభించనున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అమెజాన్ ప్రైమ్ డే సేల్​లో వన్​ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై లభించే ఆఫర్లు..

ఈ సేల్‌లో వన్‌ప్లస్ 15 ఫోన్‌ను రూ. 4,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి రూ. 81,999 ఎఫెక్టివ్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే, వన్‌ప్లస్ 15ఆర్ మోడల్‌పై రూ. 3,000 డైరెక్ట్ ప్రైస్ కట్, రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ రూపంలో మొత్తం రూ. 6,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. ఫలితంగా దీని ఎఫెక్టివ్ ధర రూ. 48,999 కి తగ్గనుంది.

మరోవైపు, వన్‌ప్లస్ 13ఎస్ ఫోన్‌పై రూ. 3,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుండటంతో దీని ధర రూ. 46,999కి దిగిరానుంది. ఇక వన్‌ప్లస్ 13 ఫోన్ ఎన్నడూ లేనంత తక్కువగా రూ. 49,999 ఎఫెక్టివ్ ధరకే అందుబాటులో ఉంటుంది.

మరోవైపు ఎంపిక చేసిన బ్యాంకులపై 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉండటం విశేషం.

అమెజాన్ ప్రైమ్ డే సేల్​లో వన్​ప్లస్ నార్డ్ సిరీస్‌పై డిస్కౌంట్లు..

టాబ్లెట్ల విభాగంలో వన్‌ప్లస్ ప్యాడ్ 4 కొనుగోలు చేసే వారికి రూ. 5,499 విలువైన 'వన్‌ప్లస్ స్టైలో ప్రో' పెన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. దీని ఎఫెక్టివ్ ధర రూ. 55,999గా ఉంటుంది. బడ్జెట్ ట్యాబ్ వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ రూ. 16,999కి లభిస్తుండగా, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 మోడల్ రూ. 26,499కే సొంతం చేసుకోవచ్చు. దీనితో పాటు రూ. 3,999 విలువైన స్టైలో పెన్ ఉచితంగా వస్తుంది.

ఇక ఆడియో విభాగంలో, కొత్తగా వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 పరిమిత కాలం పాటు రూ. 3,099 కే లభించనుంది. వీటితో పాటు వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ జెడ్2 ఏఎన్​సీ రూ. 1,899 కి, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 రూ. 9,999 కి అందుబాటులో ఉంటాయి.

ఈ ఆఫర్లు జులై 4 నుంచి అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టైలో యాప్, ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. కొన్ని సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్, మింత్రా వంటి ప్లాట్​ఫామ్స్​లో కూడా లభిస్తాయని కంపెనీ పేర్కొంది.

మరి వీటిల్లో మీరు ఏది కొంటున్నారు?

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks