జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌లను భారతీయులకు తిరిగి పరిచయం చేసిన మహీంద్రా బ్యాక్డ్ సంస్థ ‘క్లాసిక్ లెజెండ్స్’.. ఇప్పుడు బీఎస్ఏ లైనప్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. స్క్రాంబ్లర్ శైలిలో కొత్త మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 బైక్ ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఇది ఏప్రిల్ 23, 2026న భారత మార్కెట్లో అడుగుపెట్టనుందని సమాచారం.
గోల్డ్ స్టార్ 650 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారితం..

అంచనాల ప్రకారం.. ఈ కొత్త స్క్రాంబ్లర్ 650 మోటార్‌సైకిల్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న గోల్డ్ స్టార్ 650 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. లాంచ్ అయిన తర్వాత, ఇది మిడిల్ వెయిట్ స్క్రాంబ్లర్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650తో నేరుగా తలపడనుంది. గతేడాది జులైలో యూకేలో జరిగిన గ్లోబల్ ఈవెంట్‌లో ఈ బైక్‌ని సంస్థ ఆవిష్కరించింది.
బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650- డిజైన్, స్టైలింగ్..
బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 ‘నియో-రెట్రో స్క్రాంబ్లర్’ థీమ్‌తో చాలా పవర్‌ఫుల్, రగ్గడ్ లుక్‌ను కలిగి ఉంటుంది. దీని డిజైన్ ముఖ్యాంశాలు ఇవే:
హై-మౌంటెడ్ ఫ్రంట్ మడ్‌గార్డ్: ఎత్తుగా అమర్చిన ముందు వైపు మడ్‌గార్డ్.
సింగిల్ పీస్ సీటు: ఫ్లాట్ డిజైన్‌తో కూడిన సింగిల్ పీస్ సీటు.
హ్యాండిల్‌బార్: తిన్నగా ఉండే అప్‌రైట్ హ్యాండిల్‌బార్.
లైటింగ్: రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, దానికి అదనంగా రక్షణ గ్రిల్ (ఆప్షనల్).
గ్రాఫిక్స్: సైడ్ ప్యానెల్‌పై ఆకట్టుకునే '65' గ్రాఫిక్స్, అడ్వెంచర్ ప్రేరిత ఫినిషింగ్.
బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 బైక్‌లో 652సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు.
పవర్: ఇది సుమారుగా 46 బీహెచ్పీ పవర్‌ని, 55 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
{{/usCountry}}పవర్: ఇది సుమారుగా 46 బీహెచ్పీ పవర్‌ని, 55 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
{{/usCountry}}గేర్‌బాక్స్: దీనికి 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ జత చేసి ఉంటుంది.
ఎగ్జాస్ట్: ఈ బైక్ ఎగ్జాస్ట్ కానస్టర్‌ను రీడిజైన్ చేశారు. దీనివల్ల గంభీరమైన 'డీపర్ ఎగ్జాస్ట్ నోట్' వస్తుందని సమాచారం.
బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650- చాసిస్, టైర్లు..
స్క్రాంబ్లర్ అవసరాలకు అనుగుణంగా ఇందులో బలమైన చక్రాలను అందించారు.
వీల్స్: ముందు వైపు 19- ఇంచ్, వెనుక వైపు 17- ఇంచ్ స్పోక్ వీల్ సెటప్ ఉంది.
టైర్లు: వీటికి పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ ఎస్టీఆర్ టైర్లను వాడారు.
సబ్-ఫ్రేమ్: వెనుక భాగంలో సన్నగా ఉండేలా సవరించిన సబ్-ఫ్రేమ్‌ను ఉపయోగించారు.
బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650- ధర, పోటీ..
ఈ బైక్ ధర రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 ధర రూ. 3.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. బీఎస్ఏ తన స్క్రాంబ్లర్‌ను మరింత తక్కువ ధరకే ఆఫర్ చేయడం ద్వారా మార్కెట్లో బలమైన పోటీనివ్వాలని భావిస్తోంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. BSA స్క్రాంబ్లర్ 650 భారతదేశంలో ఎప్పుడు విడుదల అవుతుంది?
ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ మోటార్‌సైకిల్ ఏప్రిల్ 23, 2026న అధికారికంగా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
2. BSA స్క్రాంబ్లర్ 650 ఏయే బైక్లకు పోటీనిస్తుంది?
ఇది ప్రధానంగా మిడిల్ వెయిట్ స్క్రాంబ్లర్ విభాగంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 మోటార్‌సైకిల్‌కు గట్టి పోటీనిస్తుంది.