Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో కొత్త వేరియంట్- రూ. 1.49 లక్షలకే..
Royal Enfield Hunter 350 : రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాపులర్ మోడల్ 'హంటర్ 350'లో సరికొత్త 'బేస్ ప్రీమియం' వేరియంట్‌ను పరిచయం చేసింది. లక్నోలో జరిగిన హంటర్ హుడ్ ఈవెంట్‌లో కొత్త రంగులు, అప్‌డేటెడ్ ఫీచర్లతో కూడిన ఈ బైక్‌లను కంపెనీ ఆవిష్కరించింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాపులర్ మోడల్ 'హంటర్ 350' రేంజ్‌ని 2026 అప్‌డేట్స్‌తో సరికొత్తగా ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కొత్తగా 'బేస్ ప్రీమియం' వేరియంట్‌ను పరిచయం చేయడంతో పాటు టాప్ ట్రిమ్ కోసం రెండు సరికొత్త రంగులను అందుబాటులోకి తెచ్చింది. లక్నోలో ఘనంగా జరిగిన ‘హంటర్ హుడ్’ ఈవెంట్‌లో ఈ అప్‌డేటెడ్ మోడళ్లను ప్రదర్శించారు. ఏప్రిల్ 4, 2026 నుంచే ఈ బైక్‌ల బుకింగ్స్, అమ్మకాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వీటి వివరాలను ఇక్కడ చూసేయండి..

2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350- కొత్త బేస్ ప్రీమియం వేరియంట్ ప్రత్యేకతలు..
తక్కువ బరువుతో, సిటీ రైడింగ్‌కు అత్యంత అనువుగా ఉండే బైక్‌గా గుర్తింపు పొందిన హంటర్ 350, ఇప్పుడు ఈ కొత్త వేరియంట్‌తో మరిన్ని ఫీచర్లను తన ఖాతాలో వేసుకుంది. ఎంట్రీ లెవల్ మోడల్ పైన ఉండేలా దీనిని రూపొందించారు.
లుక్ అండ్ డిజైన్: ‘టార్మాక్ బ్లాక్’ కలర్‌లో వస్తున్న ఈ బైక్ చూడటానికి చాలా క్లాసీగా ఉంది.
ముఖ్యమైన మార్పులు: పాత స్పూక్ రిమ్స్ స్థానంలో ఆధునిక అల్లాయ్ వీల్స్‌ను చేర్చారు. నేటి కాలంలో ట్యూబ్ టైర్ల పంచర్లు వేయించడం ఒక పెద్ద తలనొప్పి కాబట్టి, ఈ అల్లాయ్ వీల్స్ అప్‌గ్రేడ్ యూజర్లకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
ఫీచర్లు: అప్‌డేటెడ్ రౌండ్ హాలోజన్ హెడ్‌ల్యాంప్, డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రోటరీ స్విచ్ గేర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు స్టిచ్డ్ సీటు, స్పోర్టీ గ్రాబ్ రైల్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ సౌకర్యం కూడా లభిస్తుంది.
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350- టాప్ వేరియంట్‌లో సరికొత్త రంగులు..
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టాప్ ఎండ్ మోడల్ కొనే వారి కోసం 'ముంబై ఎల్లో', ‘మూన్‌షాట్ వైట్’ అనే రెండు కొత్త కలర్ వేరియంట్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిచయం చేసింది.
నగర జీవనంలోని వేగాన్ని ప్రతిబింబించేలా 'ముంబై ఎల్లో' రంగును.. ఖగోళ వింతలు, హ్యాండ్-రెండర్డ్ గ్రాఫిక్స్ స్ఫూర్తితో 'మూన్‌షాట్ వైట్'ను డిజైన్ చేశారు.
హంటర్ హుడ్ ఈవెంట్..
చెన్నై, దిల్లీ, ముంబై, షిల్లాంగ్ వంటి నగరాల తర్వాత లక్నోలో జరిగిన ఈ ఈవెంట్ ఒక పండుగలా సాగింది. మ్యూజిక్, ఆర్ట్ అండ్ మోటార్ స్పోర్ట్స్ కలయికగా సాగిన ఈ కార్యక్రమంలో లైవ్ ఇన్‌స్టాలేషన్లు, కస్టమ్ బిల్డ్ బైక్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350- ధరల వివరాలు..
కొత్త బేస్ ప్రీమియం వేరియంట్ ధర: రూ. 1,49,900
కొత్త రంగులతో కూడిన టాప్ వేరియంట్ ధర: రూ. 1,69,804
దేశవ్యాప్తంగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో ఈ అప్‌డేటెడ్ హంటర్ 350 మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. వెంటనే టెస్ట్ రైడ్స్, డెలివరీలు కూడా మొదలయ్యాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. కొత్తగా వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 'బేస్ ప్రీమియం' వేరియంట్ ధర ఎంత?
ఈ కొత్త బేస్ ప్రీమియం వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,49,900 గా నిర్ణయించారు.
2. బేస్ ప్రీమియం వేరియంట్‌లో పాత మోడల్ కంటే జరిగిన ముఖ్యమైన మార్పులేమిటి?
ఇందులో ప్రధానంగా పాత స్పోక్ రిమ్స్ స్థానంలో అల్లాయ్ వీల్స్‌ను చేర్చారు. దీనితో పాటు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, కొత్త డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
3. హంటర్ 350 టాప్ వేరియంట్‌లో కొత్తగా పరిచయం చేసిన రంగులు ఏంటి?
టాప్ వేరియంట్‌లో ‘ముంబై ఎల్లో’, ‘మూన్‌షాట్ వైట్’ అనే రెండు సరికొత్త రంగులను రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశపెట్టింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 1,69,804 గా ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


