...
...
Next Story

Realme P4 Power : దేశంలోనే తొలి 10,000 ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​ ఇది- ధర ఎంతంటే..

స్మార్ట్‌ఫోన్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ 10,001 ఎంఏహెచ్​ భారీ బ్యాటరీతో 'రియల్‌మీ పీ4 పవర్ 5డీ' భారత మార్కెట్​లోకి అడుగుపెట్టింది. రూ. 25,999 ప్రారంభ ధరతో వస్తున్న ఈ ఫోన్ ఫస్ట్ లుక్, ఫీచర్స్​ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 30, 2026, 07:30:50 IST
Advertisement

ఒకప్పుడు కేవలం ఊహలకే పరిమితమైన భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు నిజమైంది! రియల్‌మీ సంస్థ ఏకంగా 10,001 ఎంఏహెచ్​ బ్యాటరీతో కూడిన సరికొత్త స్మార్ట్​ఫోన్​ని ఇండియాలో లాంచ్ చేసింది. దాని పేరు రియల్‌మీ పీ4 పవర్ 5జీ. ఇండియాలో లాంచ్​ అయిన తొలి 10,000 ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​ ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రియల్​మీ పీ4 పవర్​- డిజైన్, బిల్డ్ క్వాలిటీ..

రియల్​మీ పీ4 పవర్​..
రియల్​మీ పీ4 పవర్​..

హెచ్​టీ టెక్​ టీమ్​ వద్ద ఉన్న రియల్​మీ పీ4 పవర్ ట్రాన్స్ సిల్వర్ కలర్ వేరియంట్ చాలా ప్రీమియం లుక్‌తో ఉంది. 10,001 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్​లాగే కనిపిస్తుంది తప్ప భారీగా ఏమీ అనిపించదు. దీని బరువు 219 గ్రాములు ఉన్నా, చేతిలో పట్టుకున్నప్పుడు సౌకర్యవంతంగానే ఉంటుంది. మునుపటి కంటే ఎక్కువ సిలికాన్ కంటెంట్ ఉన్న 'సిలికాన్-కార్బన్' బ్యాటరీని వాడటం వల్లే ఫోన్ సైజు పెరగకుండా ఈ భారీ బ్యాటరీని అమర్చగలిగామని రియల్‌మీ పేర్కొంది.

ఈ స్మార్ట్​ఫోన్ సిల్వర్‌తో పాటు ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్ బ్లూ రంగుల్లోనూ లభిస్తుంది.

రియల్​మీ పీ4 పవర్- పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్..

స్మార్ట్​ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ వాడారు. దీనికి తోడు రియల్‌మీ తన ఫ్లాగ్‌షిప్ జీటీ8 ప్రోలో వాడే 'హైపర్ విజన్ ఏఐ' చిప్‌ను కూడా ఇందులో జత చేసింది. "ఈ చిప్ వల్ల గేమింగ్‌లో 144ఎఫ్​పీఎస్​ వరకు సపోర్ట్ లభిస్తుంది, వీడియోలను 1.5కే రిజల్యూషన్‌కు అప్‌స్కేల్ చేయవచ్చు," అని కంపెనీ వివరించింది. ఫోన్ ఆపరేషన్​ చాలా స్మూత్‌గా ఉంటుంది.

ఈ రియల్​మీ పీ4 పవర్​కు ఇదే అతిపెద్ద బలం. 10,000 ఎంఏహెచ్​ కేటగిరీలో 'టీయూవీ ఫైవ్ స్టార్ సేఫ్టీ' సర్టిఫికేషన్ పొందిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఎనిమిదేళ్ల తర్వాత కూడా బ్యాటరీ హెల్త్ 80 శాతం ఉండేలా 1,650 ఛార్జ్ సైకిల్స్ వరకు ఇది తట్టుకుంటుంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో కేవలం 36 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు, 27డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా వాడుకుని ఇతర ఫోన్లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

కెమెరా పనితీరు: ఇందులో 50ఎంపీ+ 8ఎంపీ డ్యూయెల్​ రేర్​ కెమెరా ఉంది. వెలుతురులో ఫోటోలు చాలా షార్ప్‌గా, సహజమైన రంగులతో వస్తున్నాయి. కెమెరా యాప్‌లో ఫీచర్లు కూడా బాగున్నాయి. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను సంస్థ ఇచ్చింది.

రియల్​మీ పీ4 పవర్- ధర, ఆఫర్లు..

రియల్​మీ పీ4 పవర్ ధరలు ఇలా ఉన్నాయి..

8GB + 128GB: రూ. 25,999

8GB + 256GB: రూ. 27,999

12GB + 256GB: రూ. 30,999

బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్​ఛేంజ్​ ఆఫర్ ద్వారా రూ. 2,000 వరకు తగ్గించుకోవచ్చు (అంటే రూ. 23,999 నుంచే లభిస్తుంది). ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్లలో ఈ రియల్​మీ పీ4 పవర్ సేల్ మొదలవుతుంది. మొదటి సేల్‌లో కొనేవారికి రూ. 2,999 విలువైన నాలుగేళ్ల బ్యాటరీ వారంటీ కూడా ఉచితంగా లభిస్తుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe