దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల ఆగ్రహం చల్లారడం లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ప్రారంభమైన ఆందోళనలు మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసనల్లో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఒక వినూత్న ప్రచారాన్ని ప్రకటించింది.
‘రోజుకో డైపర్.. లీకేజీలకు దూరం’

జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా జూన్ 23 సాయంత్రం 6 గంటలకు ‘డైపర్ విరాళాల డ్రైవ్’ (Diaper Donation Drive) నిర్వహించనున్నట్లు సీజేపీ సోషల్ మీడియాలో ప్రకటించింది. "రోజుకో డైపర్.. లీకేజీలకు దూరం" (Diaper A Day Keeps Leaks Away) అనే నినాదంతో ఈ విచిత్రమైన నిరసనను చేపట్టారు.
"నిరసన వేదికకు ఒక డైపర్‌ను తీసుకురండి, దానిపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే మీ డిమాండ్‌ను రాయండి. ఆ డైపర్లను మేము నేరుగా కేంద్ర విద్యాశాఖ మంత్రికి చేరేలా చూస్తాం" అని సీజేపీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
విద్యార్థుల స్మృత్యర్థం కొవ్వొత్తుల ప్రదర్శన
పరీక్షల్లో జరిగిన అక్రమాలు, లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి రాజీనామా చేసేంతవరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. పేపర్ లీక్ వివాదం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మారకార్థం నిరసన స్థలంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. పరీక్షా కేంద్రాలకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను రీ-టెస్ట్‌కు అనుమతించని అధికారులు, పేపర్ లీకేజీకి కారణమైన పెద్దలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దిప్కే ప్రశ్నించారు. ఈ నిరసనల్లో ఆదివారం జరిగిన నీట్ రీ-టెస్ట్‌కు హాజరైన కొందరు అభ్యర్థులు కూడా పాల్గొని తమ చేదు అనుభవాలను పంచుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థుల బాధలను వినాలని, వారు తమ అనుభవాలను నేరుగా ప్రధానితో పంచుకోవాలని అనుకుంటున్నారని దిప్కే తెలిపారు.
తనిఖీల ఆరోపణలను ఖండించిన ఢిల్లీ పోలీసులు
{{/usCountry}}ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థుల బాధలను వినాలని, వారు తమ అనుభవాలను నేరుగా ప్రధానితో పంచుకోవాలని అనుకుంటున్నారని దిప్కే తెలిపారు.
తనిఖీల ఆరోపణలను ఖండించిన ఢిల్లీ పోలీసులు
{{/usCountry}}ఆందోళనల్లో పాల్గొనకుండా విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు గుర్తింపు కార్డులను (ఆధార్ కార్డులను) అడుగుతున్నారని అభిజీత్ దిప్కే ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఖండించారు. జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఆధార్ తనిఖీలు చేపట్టలేదని, ప్రజల నుంచి ఎలాంటి చిరునామా వివరాలు సేకరించలేదని, ఈ ఆరోపణలు ముమ్మాటికీ వాస్తవ విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు.
విద్యార్థి సంఘాల మద్దతు.. ఉచిత లైబ్రరీ ఏర్పాటు
ఈ ఆందోళనలకు ఎస్‌ఎఫ్‌ఐ (SFI), ఐసా (AISA), ఏఐఎస్‌ఎఫ్ (AISF), కేవైఎస్ (KYS) వంటి పలు వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ప్రకటించి నిరసనల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఇందులో భాగంగా ఏఐఎస్‌ఎఫ్ (AISF) నిరసన స్థలంలో "విద్యతోనే విద్య కోసం పోరాటం" (Fight for Education with Education) అనే చొరవతో ఒక ఉచిత లైబ్రరీని కూడా ఏర్పాటు చేసింది. పోలీసులు నిర్దేశించిన సమయం ముగిసినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆందోళనలను రాత్రంతా కొనసాగిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.