...
...
Next Story

CJP protest in Delhi : దిల్లీలో తీవ్ర ఉద్రిక్తత- పార్లమెంట్ మార్చ్​ నిరసనకారులపై లాఠీఛార్జ్!

Jantar Mantar protest news : నీట్​ యూజీ పరీక్షల అక్రమాలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన 'చలో సంసద్' మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పార్లమెంట్‌ వైపు దూసుకెళ్తున్న నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

Published on: Jul 20, 2026, 10:41:02 IST
Advertisement

దేశ రాజధాని దిల్లీలో సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నీట్-యూజీ వైద్య ప్రవేశ పరీక్షల అక్రమాలకు నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) పిలుపునిచ్చిన 'చలో సంసద్' మార్చ్ తీవ్ర ఘర్షణకు దారితీసింది. పార్లమెంట్ ముట్టడికి కోసం జంతర్ మంతర్ వద్ద నుంచి సీజేపీ మద్దతుదారులు బయలుదేరిన వెంటనే వారికి తీవ్ర అడ్డంకులు ఎదురయ్యాయి. నిరసనకారులు, దిల్లీ పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. పరిస్థితి చేదాటడంతో నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

ఓ మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. (AFP)
ఓ మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. (AFP)

వాస్తవానికి ఈ నిరసన ప్రదర్శనకు దిల్లీ పోలీసులు ఆదివారమే అనుమతి నిరాకరించారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాలతో పాటు దిల్లీ జిల్లా వ్యాప్తంగా ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడకుండా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్​ఎస్​ఎస్)లోని సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) కింద కఠిన నిషేధాజ్ఞలు విధించారు. అయినప్పటికీ, వేలాది మంది సీజేపీ కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతలు జంతర్ మంతర్ వద్దకు చేరుకుని పోలీసు బారికేడ్లను బద్దలు కొట్టుకుంటూ పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

మరోవైపు తమ డిమాండ్ల విషయంలో కేంద్రం తొలిసారి స్పందించింది అని సీజేపీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటల 50 నిమిషాలకు, సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్​ని డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని ఆయన మీడియాకు చెప్పారు.

పార్లమెంట్ మార్చ్​కు ప్రముఖల మద్దతు..

సోమవారం ఉదయం జంతర్ మంతర్​ వద్దకు అనేక మంది ప్రముఖులు చేరారు. వెటరన్ నటి షబానా అజ్నీ, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్​లు నిరసన ప్రాంగణానికి చేరుకుని మద్దతిచ్చారు. మరోవైపు ఆప్​ ఆద్మీ సభ్యులు సంజయ్ సింగ్, అతిషి, మనీశ్ సిసోడియా, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రీ సైతం జంతర్ మంతర్​ వద్దకు చేరుకుని నిరసనకారులకు సపోర్ట్ ఇచ్చారు.

ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్​చుక్ సందేశం..

ప్రభుత్వం విఫలమైందంటూ 20కిపైగా రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్​చుక్​ని శనివారం ఉదయం ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఇక పార్లమెంట్ మార్చ్​కి ముందు సోనమ్ వాంగ్​చుక్ ఆసుపత్రి నుంచి కీలక సందేశం పంపించారు. తన 3 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే, నిరాహార దీక్షను విరమిస్తానని చెప్పారు. అవి.

  • విద్యా వ్యవస్థలో వైఫల్యాలకు కేంద్రం బాధ్యత వహించాలి.
  • పార్లమెంట్​లో పేపర్​ లీక్ వ్యవహారంపై చర్చ జరగాలి.
  • పైన పేర్కొన్న డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వ తరపు కీలక నేతలు తనకు ప్రత్యక్షంగా హామీ ఇవ్వాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks