...
...
Next Story

LPG gas cylinder : మరోసారి భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్​ సిలిండర్ల ధర..

Commercial LPG Prices : మే 1 ఉదయాన్నే షాక్​! కమర్షియల్​ ఎల్పీజీ గ్యాస్​ సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్​ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

Published on: May 1, 2026, 06:41:26 IST
Advertisement

అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల సామాన్యుడిపై కోలుకోలేని దెబ్బ పడుతోంది! ఈ నేపథ్యంలోనే తాజాగా కమర్షియల్​ ఎల్పీజీ గ్యాస్​ సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్​ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా ఇప్పుడు ఒక్కో వాణిజ్య సిలిండర్​పై రూ. 993 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంచిన ధరలు నేటి నుంచే (మే 1, 2026) అమల్లోకి వచ్చాయి.

ఎల్పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర..
ఎల్పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర..

కాగా ఇళ్లల్లో వాడుకునే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్​ ధరలను సవరించకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం.

తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్​ ధర రూ. 3071.5కి చేరింది. ఇక ముంబైలో ఇది రూ. 2,031 నుంచి రూ. 3,024కి పెరిగింది. బెంగళూరులో రూ. 3,152గాను, చెన్నైలో రూ. 3237గాను ఉంది. కోల్​కతాలో సిలిండర్​ ధర 3,300గా కొనసాగుతోంది.

తాజా పెంపుతో హైదరాబాద్​లో 19 కేజీల వాణిజ్య సిలిండర్​ ధర రూ. 3,300 దాటేసింది. ఇక హైదరాబాద్​లో 14.2 కేజీల డొమెస్టిక్​ ఎల్పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర రూ. 965గా ఉంది.

ఇక విజయవాడలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్​ ధర రూ. 3,251.50గాను, 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్​ ధర రూ. 937.5గాను ఉంది.

ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాలా? వద్దా? అనే విషయంపై ప్రతి నెల 1వ తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. దేశంలో చాలా నెలల పాటు సిలిండర్ల ధరలు స్థిరంగా కొనసాగాయి. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గత కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధర పెరుగుతూ వస్తోంది. ఫలితంగా రెస్టారెంట్లు తమ మెన్యూ రేట్లను పెంచుతున్నాయి. ఇది సామాన్యుడిని పరోక్షంగా ప్రభావితం చేస్తోంది. ఇదే కొనసాగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే దేశ జీడీపీ కూడా ఎఫెక్ట్​ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇరాన్ యుద్ధంతో అల్లకల్లోలం!

తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఎల్పీజీ కనెక్షన్లను ఇవ్వడం కూడా ఆపేసిందని తెలుస్తోంది.

పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరగలేదు..

ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు వార్తలు ప్రజలకు అలవాటైపోయాయి. ఇప్పుడందరు పెట్రోల్​, డీజల్​ ధరల పెంపుపై ఫోకస్​ చేస్తున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇంధన ధరలు పెరుగాయని అందరు ఊహించారు. కానీ పెట్రోల్​, డీజిల్​ ధరలను కేంద్రం పెంచకపోవడం ఊరటనిచ్చే విషయం.

విమానాల్లో వాడే ఇంధనం ( ఏటీఎఫ్) ధరలను కూడా ఈసారి పెంచలేదు. ఇది విమానయాన రంగానికి పెద్ద ఊరటనిచ్చే అంశం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe