భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ రంగం ఇప్పుడు వివిధ మోడల్స్‌తో కళకళలాడిపోతోంది. ఒకప్పుడు కేవలం స్టార్టప్‌ల ప్రయోగశాలగా ఉన్న ఈ విభాగం.. నేడు దిగ్గజ తయారీ సంస్థల రాకతో యుద్ధ క్షేత్రంగా మారింది. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీలు మొదట్లో గట్టి పునాది వేయగా.. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి మోడళ్లతో పాత తరం సంస్థలు తమ ఉనికిని చాటుకున్నాయి.

ఇప్పుడు మరో కొత్త అంకం మొదలైంది. సుజుకీ సంస్థ తన 'ఇ-యాక్సెస్' ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇటీవలే లాంచ్ చేసింది. దీనితో వాహనదారులకు ఆప్షన్లు పెరిగాయి. మరి కొత్తగా వచ్చిన సుజుకీ ఇ-యాక్సెస్, ప్రస్తుతం ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్‌లో దుమ్మురేపుతున్న ఏథర్ రిజ్టాకు ఏ మేర పోటీ ఇవ్వనుంది? ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్? ఓసారి చూద్దాము..
సుజుకీ ఇ-యాక్సెస్ వర్సెస్ ఏథర్ రిజ్టా- ధరలు..
ధర విషయంలో సుజుకీ తన ఇ-యాక్సెస్‌ను కాస్త ప్రీమియం రేంజ్‌లో ఉంచింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.88 లక్షలుగా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో ఇది కాస్త ఖరీదైన ధరగానే కనిపిస్తోంది.
మరోవైపు, ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్లో వినియోగదారులకు మూడు వేర్వేరు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. దీని ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.11 లక్షల నుంచి ప్రారంభమై రూ. 1.51 లక్షల వరకు ఉన్నాయి.
అంటే తమ బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా రిజ్టాలో నచ్చిన వేరియంట్‌ను ఎంచుకునే వెసులుబాటు కొనుగోలుదారులకు ఉంది.
సుజుకీ ఇ-యాక్సెస్ వర్సెస్ ఏథర్ రిజ్టా- బ్యాటరీ, పర్ఫార్మెన్స్..
సుజుకీ ఇ-యాక్సెస్ విషయానికి వస్తే.. ఇందులో 3.07 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చారు. దీని మోటార్ 5.49 బీహెచ్పీ పవర్, 15 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గంటకు 71 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సుజుకీ సంస్థ పేర్కొంది. ఈ ఈ-స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి దాదాపు ఆరు గంటలకు పైగా సమయం పడుతుంది.
{{/usCountry}}సుజుకీ ఇ-యాక్సెస్ విషయానికి వస్తే.. ఇందులో 3.07 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చారు. దీని మోటార్ 5.49 బీహెచ్పీ పవర్, 15 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గంటకు 71 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సుజుకీ సంస్థ పేర్కొంది. ఈ ఈ-స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి దాదాపు ఆరు గంటలకు పైగా సమయం పడుతుంది.
{{/usCountry}}ఏథర్ రిజ్టా ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంది. ఇందులో 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. మోడల్‌ను బట్టి ఇది 123 కి.మీ నుంచి గరిష్టంగా 160 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. ఇక వేగం విషయానికొస్తే, ఇది గంటకు 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. నగర ప్రయాణాల్లో కొంచెం వేగంగా వెళ్లాలనుకునే వారికి రిజ్టా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
సుజుకీ ఇ-యాక్సెస్ వర్సెస్ ఏథర్ రిజ్టా- ఏది కొనాలి?
సుజుకీ బ్రాండ్ పట్ల నమ్మకం ఉండి, సిటీలో తిరగడానికి సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వారికి ఇ-యాక్సెస్ సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, గణాంకాలను పరిశీలిస్తే మాత్రం ఏథర్ రిజ్టా స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తోంది. మెరుగైన రేంజ్, ఎక్కువ వేగం, తక్కువ ధరతో పాటు విభిన్న వేరియంట్లలో లభిస్తుండటం రిజ్టాకు పెద్ద ప్లస్ పాయింట్. అందుకే ఇండియాలో ఇది బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కొనసాగుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధర, ఫీచర్ల పరంగా చూస్తే సుజుకీ కంటే ఏథర్ రిజ్టానే మెరుగైన ఎంపికగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.