క్రెడిట్ కార్డులను బాధ్యతాయుతంగా వాడితే అత్యవసర సమయాల్లో ఆర్థిక కొండంత అండగా నిలుస్తాయి. అయితే ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉండి, అందులో ఏదైనా ఒక దానిని అస్సలు వాడకపోతే దానిని రద్దు చేసుకోవడమే మేలని చాలామంది భావిస్తుంటారు. వాలెట్‌లో ఖాళీగా పడి ఉండటం లేదా ఎక్కడైనా పోతుందేమోనన్న భయంతో కార్డు ఖాతాను క్లోజ్ చేయాలనుకుంటారు. అయితే, వాడని క్రెడిట్ కార్డును రద్దు చేయడం అనేది అంత సులువైన నిర్ణయం కాదని, ఇది మీ మొత్తం అప్పు తీసుకునే సామర్థ్యంతో పాటు సిబిల్ స్కోర్‌పై (CIBIL Score) తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్రెడిట్ యూటిలైజేషన్ నిష్పత్తి అంటే ఏమిటి?

కార్డు రద్దు చేయడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం 'క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో' (Credit Utilisation Ratio - CUR). మీ వద్ద ఉన్న అన్ని క్రెడిట్ కార్డుల మొత్తం లిమిట్‌లో మీరు ఎంత శాతం వాడుతున్నారనేదే ఈ నిష్పత్తి.
ఉదాహరణకు, మీ వద్ద ఉన్న కార్డుల మొత్తం లిమిట్ ₹5 లక్షలు అనుకుంటే, అందులో మీరు ₹1 లక్ష వాడుతుంటే మీ క్రెడిట్ యూటిలైజేషన్ నిష్పత్తి 20 శాతంగా ఉంటుంది. ఒకవేళ మీరు వాడని ఒక కార్డును రద్దు చేయడం వల్ల మీ మొత్తం లిమిట్ ₹3 లక్షలకు తగ్గిపోయిందనుకుందాం. పాత బాకీ ₹1 లక్ష అలాగే ఉంటే, అప్పుడు మీ యూటిలైజేషన్ నిష్పత్తి ఒక్కసారిగా 33.3 శాతానికి పెరుగుతుంది. సాధారణంగా మొత్తం క్రెడిట్ పరిమితిలో 30 శాతం కంటే తక్కువగా వాడటాన్ని బ్యాంకులు, రేటింగ్ సంస్థలు మంచి సంకేతంగా భావిస్తాయి. నిష్పత్తి పెరిగే కొద్దీ క్రెడిట్ స్కోర్ తగ్గే ప్రమాదం ఉంటుంది.
నిపుణులు ఏమంటున్నారు?
కార్డును పూర్తిగా రద్దు చేయడం కన్నా దానిని యాక్టివ్‌గా ఉంచడమే మేలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. "వాడని క్రెడిట్ కార్డును రద్దు చేయడం ఆర్థికంగా మంచి పనే అనిపించవచ్చు. కానీ ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. మొత్తం క్రెడిట్ పరిమితిని తగ్గించి, యూటిలైజేషన్ నిష్పత్తిని పెంచుతుంది. ఒకవేళ అది మీ వద్ద ఉన్న అత్యంత పాత కార్డైతే, మీ క్రెడిట్ హిస్టరీ కాలవ్యవధి తగ్గిపోతుంది. అందువల్ల కొన్ని నెలలకోసారి ఏదైనా చిన్న లావాదేవీ చేసి, ఆ బిల్లును పూర్తిగా చెల్లించడం ద్వారా కార్డును యాక్టివ్‌గా ఉంచడం శ్రేయస్కరం. వార్షిక రుసుము సమస్య అయితే, దానిని రద్దు చేయమని బ్యాంక్‌ను కోరడం లేదా ఎలాంటి రుసుము లేని (Lifetime Free) కార్డ్‌గా మార్చుకోవడం మంచిది" అని జాగల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజ్ పి నారాయణం వివరించారు.
బ్యాంక్‌బజార్ సీఈఓ అధిల్ శెట్టి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. "వాడని కార్డును క్లోజ్ చేయడం కంటే ఉంచుకోవడమే వివేకవంతమైన ఆర్థిక నిర్ణయం. కార్డు రద్దు వల్ల మొత్తం క్రెడిట్ లిమిట్ తగ్గి, యూటిలైజేషన్ నిష్పత్తి 30 శాతం దాటిపోయే ప్రమాదం ఉంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించి, భవిష్యత్తులో రుణాలు ప్రియమయ్యేలా చేస్తుంది. అధిక వార్షిక రుసుములు లేకపోతే, చిన్న చిన్న లావాదేవీలతో కార్డును యాక్టివ్‌గా ఉంచడం వల్ల సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర కొనసాగుతుంది" అని ఆయన పేర్కొన్నారు.
కార్డును ఎప్పుడు రద్దు చేయవచ్చు?
{{/usCountry}}బ్యాంక్‌బజార్ సీఈఓ అధిల్ శెట్టి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. "వాడని కార్డును క్లోజ్ చేయడం కంటే ఉంచుకోవడమే వివేకవంతమైన ఆర్థిక నిర్ణయం. కార్డు రద్దు వల్ల మొత్తం క్రెడిట్ లిమిట్ తగ్గి, యూటిలైజేషన్ నిష్పత్తి 30 శాతం దాటిపోయే ప్రమాదం ఉంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించి, భవిష్యత్తులో రుణాలు ప్రియమయ్యేలా చేస్తుంది. అధిక వార్షిక రుసుములు లేకపోతే, చిన్న చిన్న లావాదేవీలతో కార్డును యాక్టివ్‌గా ఉంచడం వల్ల సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర కొనసాగుతుంది" అని ఆయన పేర్కొన్నారు.
కార్డును ఎప్పుడు రద్దు చేయవచ్చు?
{{/usCountry}}అన్ని వేళలా కార్డును ఉంచుకోవడం సాధ్యపడకపోవచ్చు. ఒకవేళ మీరు ఉపయోగిస్తున్న కార్డుకు వార్షిక రుసుము (Annual Fee) చాలా ఎక్కువగా ఉండి, దానికి తగ్గ ప్రయోజనాలు లేదా రివార్డు పాయింట్లు లభించకపోతే రద్దు చేసే ఆలోచన చేయవచ్చు. అలాగే ఆ కార్డు ఉండటం వల్ల అనవసర ఖర్చులు చేసే అలవాటు ఉన్నవారు కూడా దానిని క్లోజ్ చేయడమే మంచిది.
కార్డ్ బ్లాక్ వేరు.. అకౌంట్ క్లోజర్ వేరు
చాలామంది కార్డ్‌ను డియాక్టివేట్ లేదా బ్లాక్ చేయడం అంటే ఖాతాను రద్దు చేయడమే అని పొరబడుతుంటారు. కానీ ఇది సరికాదు. కార్డు ఖాతాను పూర్తిగా క్లోజ్ చేసినప్పుడే బ్యాంక్‌తో ఆ కార్డు సంబంధిత బాధ్యతలు ముగుస్తాయి. బాకీలన్నీ చెల్లించిన తర్వాత, వినియోగదారుడు ఇచ్చిన రద్దు వినతిని 7 పనిదినాల్లోగా బ్యాంకులు పరిష్కరించాల్సి ఉంటుంది.
మీ వద్ద ఉన్న పాత లేదా వాడని క్రెడిట్ కార్డును రద్దు చేసేముందు మీ ఇతర కార్డుల పరిమితి, మొత్తం బాకీలు, క్రెడిట్ స్కోర్‌పై పడే ప్రభావాన్ని క్షుణ్ణంగా అంచనా వేసుకోవాలి. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.