ఆసియా గేమ్స్ 2026లో భారత క్రీడా బృందం బోణీ కొట్టింది. టోర్నీ ప్రారంభమైన నాలుగో రోజు భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్ని అందించింది. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో శ్రీలంకపై 147 పరుగుల వ్యత్యాసంతో ఘన విజయం సాధించి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.

2023 హాంగ్‌జౌ ఆసియా గేమ్స్, ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్స్ తర్వాత వరుసగా మూడోసారి శ్రీలంకను చిత్తు చేసి భారత మహిళలు తమ ఆధిపత్యాన్ని పునరావృతం చేశారు.
బాదడమే లక్ష్యంగా ఓపెనర్లు.. రికార్డుల సునామీ!
ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఊహించని శుభారంభాన్ని ఇచ్చారు. లంక బౌలర్లపై విరుచుకుపడుతూ పవర్‌ప్లేలోనే ఏకంగా 67 పరుగులు చేశారు. ఐదో ఓవర్లోనే మూడు సిక్సర్లతో 19 పరుగులు రాబట్టి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 2026 సంవత్సరంలో అత్యధిక పరుగులు (863) చేసిన మహిళా క్రికెటర్‌గా లారా వోల్వార్డ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరింది షఫాలీ వర్మ.
మరోవైపు స్మృతి మంధాన ఏడు సిక్సర్లతో లంక బౌలర్లను ఉతికారేస్తూ 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ క్రమంలో మంధాన-షఫాలీ జోడీ టీ20ల్లో 4,000 భాగస్వామ్య పరుగుల మైలురాయిని దాటింది. అంతకంటే ముఖ్యంగా, స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో 11,000 పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ కేవలం 22 బంతుల్లోనే 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది.
{{/usCountry}}ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ కేవలం 22 బంతుల్లోనే 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది.
{{/usCountry}}ఆసియా గేమ్స్ చరిత్రలోనే మహిళల విభాగంలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం!
దీప్తి శర్మ మ్యాజిక్.. 69 పరుగులకే లంక ఆలౌట్!
217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. ప్రారంభంలోనే షఫాలీ వర్మ వికెట్ల పతనాన్ని ప్రారంభించగా, లంక స్కోరు 49/6 వద్ద తీవ్ర ఊబిలో కూరుకుపోయింది. లంక కెప్టెన్ చమరి అటపట్టు మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ భారత బౌలింగ్‌ను ఎదుర్కొనలేకపోయారు. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు!
స్పిన్నర్ దీప్తి శర్మ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి లంకను కోలుకోలేని దెబ్బతీసింది. శ్రీ చరణే, షఫాలీ వర్మ కూడా కీలక వికెట్లతో రాణించడంతో శ్రీలంక జట్టు 69 పరుగులకే కుప్పకూలింది.
పతకాల పట్టికలో భారత్ పురోగతి..
ఈ చారిత్రాత్మక విజయంతో ఆసియా గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. ఇప్పటివరకు భారత్ మొత్తంగా 7 పతకాలు సాధించింది. ఇందులో మహిళల క్రికెట్ స్వర్ణంతో పాటు సుచికా తరియాల్ సాధించిన ఎంఎంఏ కాంస్యం, షూటింగ్‌లో లభించిన 5 పతకాలు ఉన్నాయి.