అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడిచమురు మంటలు మళ్లీ తీవ్రమయ్యాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం మరింత క్షీణించడం, సముద్ర మార్గంలో చమురు ట్యాంకర్లపై దాడులు పెరగడంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందనే భయాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో క్రూడాయిల్ నిల్వలు అనూహ్యంగా పడిపోవడంతో బుధవారం ముడిచమురు ధరలు గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే ఎక్కువ (2 శాతానికి పైగా) ఎగబాకాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు ఐదు నెలల గరిష్ఠ స్థాయికి సమీపంలో నిలిచింది.
గ్యాలన్‌కు $110 దాటిన బ్రెంట్ క్రూడ్
రాయిటర్స్ కథనం ప్రకారం.. అంతర్జాతీయ ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బుధవారం జీఎమ్‌టీ కాలమానం ప్రకారం ఉదయం 10:48 గంటల సమయానికి $2.06 (1.9 శాతం) పెరిగి పీపాకు $110.85 వద్దకు చేరింది. మరోవైపు అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్‌మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్స్ కూడా అదే సమయానికి $2.13 (2.2 శాతం) లాభపడి పీపాకు $99.95 వద్ద ముగిసింది.
ముందుటి సెషన్లలోనూ ముడిచమురు ధరలు కొన్ని నెలల గరిష్ఠ స్థాయిలకు చేరాయి. టెహ్రాన్‌లో ఇరాన్ అధ్యక్షుడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భేటీ సందర్భంగా అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వంపై చర్చలు జరుగుతాయనే వార్తలతో కాసేపు ధరలు శాంతించినప్పటికీ, ఆశించిన పురోగతి లేకపోవడంతో మళ్లీ పుంజుకున్నాయి.
చర్చలకు ఆస్కారం లేదన్న ఇరాన్
అమెరికాతో శాంతి చర్చల్లో పురోగతి ఉంటుందని భావించడం లేదని ఇరాన్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. తమ దేశంపై దిగ్బంధనాలు, బెదిరింపులు కొనసాగిస్తూనే మరోవైపు చర్చలకు రావాలని అమెరికా కోరడం సరికాదని ఇరాన్ అధ్యక్షుడు మసూర్ పెజెష్కియాన్ ప్రభుత్వ మీడియాతో వ్యాఖ్యానించారు. తమను తాము రక్షించుకోవడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ 'ఫైనాన్షియల్ టైమ్స్'కు స్పష్టం చేశారు.
దౌత్యపరమైన చర్చలు విఫలం కావడం చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పశ్చిమాసియాలో సంక్షోభంతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా తగ్గకపోవడంతో ఇంధన ధరల పెంపునకు అడ్డుకట్ట పడటం లేదని పివిఎమ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ట్యాంకర్లపై దాడులు.. పెరుగుతున్న ఆందోళనలు
{{/usCountry}}దౌత్యపరమైన చర్చలు విఫలం కావడం చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పశ్చిమాసియాలో సంక్షోభంతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా తగ్గకపోవడంతో ఇంధన ధరల పెంపునకు అడ్డుకట్ట పడటం లేదని పివిఎమ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ట్యాంకర్లపై దాడులు.. పెరుగుతున్న ఆందోళనలు
{{/usCountry}}సముద్ర మార్గంలో వెళ్తున్న నౌకలపై దాడులు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది. మార్కెట్ విశ్లేషణ సంస్థ 'క్లెపర్' సమాచారం ప్రకారం.. గత రెండు వారాల్లో నౌకలపై కనీసం 18 దాడులు నమోదయ్యాయి. హార్ముజ్ జలసంధి దాటి వెళ్లి మరి ఇరాన్ చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులు ఒమన్ గల్ఫ్ వరకు విస్తరిస్తుండటంతో సముద్రంలో చమురు రవాణా, ఒక ఓడ నుంచి మరొక ఓడకు సరుకు మార్పిడి ప్రక్రియలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఎల్ఎస్ఈజి విశ్లేషకులు హెచ్చరించారు.
సౌదీ అరామ్‌కో లక్ష్యంగా హౌతీల దాడులు
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని ఇంధన వనరులపై దాడులకు తెగబడ్డారు. యాన్బులోని సౌదీ అరామ్‌కో కేంద్రం, షైబా చమురు క్షేత్రంతో పాటు రియాద్, అభాలలోని విమానాశ్రయాలపై తాము దాడులు చేసినట్లు హౌతీ దళాలు సోమవారం వెల్లడించాయి. పశ్చిమాసియాలోని చమురు మౌలిక సదుపాయాలు, రవాణా మార్గాలపై దాడులు పెరగడం మార్కెట్లను మరింత ఆందోళనలోకి నెట్టివేసింది.
రూ.4.9 మిలియన్ బారెళ్లు తగ్గిన యూఎస్ నిల్వలు
మరోవైపు అమెరికా పెట్రోలియం ఇన్స్టిట్యూట్ (ఏపీఐ) నివేదిక ప్రకారం.. అక్టోబర్ 16తో ముగిసిన వారంలో అమెరికాలో ముడిచమురు నిల్వలు అనూహ్యంగా 4.9 మిలియన్ బారెళ్లకు పడిపోయాయి. గ్యాసోలిన్, డిస్టిలేట్ నిల్వలు కూడా క్షీణించాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు నిల్వలు తగ్గడం చమురు ధరల పెంపునకు మరింత బలాన్నిచ్చింది. అమెరికా ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఇంధన నిల్వల నివేదిక కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు.