...
...
Next Story

CSK vs KKR: కేకేఆర్‌కు ఏమైంది? ఐపీఎల్ 2026లో ఇంకా బోణీ కొట్ట‌ని షారుక్ ఖాన్ టీమ్‌.. సీఎస్కేకు వ‌రుస‌గా రెండో విక్ట‌రీ

CSK vs KKR: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఆ టీమ్ ఇంకా బోణీ కొట్టలేదు. ఆ టీమ్ ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విక్టరీని ఖాతాలో వేసుకుంది.

Published on: Apr 15, 2026, 06:06:58 IST
Advertisement

CSK vs KKR: ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫామ్ లోకి వచ్చింది. అయిదు సార్లు ఛాంపియన్ అయిన ఈ టీమ్ వరుసగా రెండో విక్టరీని ఖాతాలో వేసుకుంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి మాత్రం రోజురోజుకూ దిగజారుతోంది. షారుక్ ఖాన్ ఓనర్ గా ఉన్న కేకేఆర్ ఈ సీజన్ లో ఇంకా బోణీ కూడా కొట్టలేదు.

సీఎస్కే విక్టరీ

సీఎస్కే ప్లేయర్స్
సీఎస్కే ప్లేయర్స్

ఐపీఎల్ 2026లో సీఎస్కే వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం (ఏప్రిల్ 14) రాత్రి ముగిసిన మ్యాచ్ లో ఆ టీమ్ 32 పరుగుల తేడాతో కేకేఆర్ ను ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఛేజింగ్ లో కేకేఆర్ 7 వికెట్లకు 160 రన్స్ మాత్రమే చేయగలిగింది.

నూర్ అహ్మద్ స్పిన్ మాయ

చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఈ మ్యాచ్ లో చెలరేగాడు. ఈ అఫ్గానిస్థాన్ యువ సంచలనం, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కోల్‌కతా వెన్ను విరిచాడు. 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా అజింక్య రహానె, కామెరూన్ గ్రీన్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లాడు.

రూ.25.20 కోట్ల ఆటగాడు

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు వేలంలో రూ.25.20 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ జట్టుకు భారంగా మారుతున్నాడు. అటు బ్యాటుతో, ఇటు బంతితో ప్రభావం చూపలేకపోతున్నాడు. గ్రీన్ ఓవర్లో ఆయుష్ మాత్రె ఏకంగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 20 పరుగులు రాబట్టాడు. ఇక బ్యాటింగ్‌లో నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఆడిన మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు గ్రీన్.

ప్రయోగాలన్నీ విఫలం

ఐదు మ్యాచ్‌లు ఆడినా ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయకపోవడం కేకేఆర్ జట్టు ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

శాంసన్, మాత్రే మెరుపులు

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై ఇన్నింగ్స్ లో సంజు శాంసన్ (48), డెవాల్డ్ బ్రేవిస్ (41), ఆయుష్ మాత్రే (38) సత్తాచాటారు. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే కేవలం 17 బంతుల్లో 38 పరుగుల (6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి తన వేగంతో ఆకట్టుకున్నాడు. సంజు శాంసన్ వికెట్ ను 148.1 కి.మీ వేగంతో వేసిన బంతితో పడగొట్టాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe