సినిమా స్టార్లకు లగ్జరీ కార్లంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్ పవర్‌హౌస్ రణ్వీర్ సింగ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం 'ధురంధర్ 2' విజయంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ స్టార్ హీరో గ్యారేజీలో ఉన్న కార్ల విలువ చూస్తే కళ్లు తిరగడం ఖాయం! ఒక లగ్జరీ విల్లాను ఖరీదు చేసే రణ్వీర్ కార్ల కలెక్షన్ గురించి ఇక్కడ తెలుసుకోండి..
1. జాగ్వార్ ఎక్స్‌జే ఎల్..

ఎక్స్‌షోరూం ధర: సుమారు రూ. 1.97 కోట్లు
అత్యంత ప్రీమియం మెటీరియల్స్‌తో తయారైన ఈ కారు రణ్వీర్ క్లాసీ టేస్ట్‌ను ప్రతిబింబిస్తుంది. లాంగ్ వీల్ బేస్ ఉన్న ఈ సెడాన్ అత్యంత విలాసవంతమైనది.
2. మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600..
ఎక్స్‌షోరూం ధర: సుమారు రూ. 2.75 కోట్లు
లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అయిన మేబ్యాక్ సిరీస్ కారు రణ్వీర్ కలెక్షన్‌లో హైలైట్. దీని ఇంటీరియర్ ఒక ప్రైవేట్ జెట్‌ను తలపిస్తుంది.
3. లంబోర్గిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్..
ఎక్స్‌షోరూం ధర: సుమారు రూ. 3.15 కోట్లు
రణ్వీర్ గ్యారేజీలో ఉన్న అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీ ఇది. 2021 ఎడిషన్‌కి చెందిన ఈ సూపర్‌కార్ పర్ఫార్మెన్స్లో మేటి అని చెప్పుకోవాలి.
4. ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్..
ఎక్స్‌షోరూం ధర: సుమారు రూ. 3.29 కోట్లు
స్పోర్ట్స్ కార్లంటే రణ్‌వీర్‌కు ప్రాణం. అందుకే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్ ఆయన గ్యారేజీలో చేరింది. మొదట తెల్ల రంగులో ఉన్న ఈ కారును, తర్వాత రణ్వీర్ తన టేస్ట్‌కి తగ్గట్టుగా 'స్నాపర్ రాక్స్ బ్లూ మెటాలిక్' రంగులోకి మార్పించారు.
5. రేంజ్ రోవర్ ఎస్‌వీ..
ధర: సుమారు రూ. 4.25 కోట్లు
{{/usCountry}}ధర: సుమారు రూ. 4.25 కోట్లు
{{/usCountry}}బాలీవుడ్‌లో అతికొద్ది మంది సెలబ్రిటీల వద్ద మాత్రమే ఉండే ఈ లగ్జరీ ఎస్‌యూవీ దాదాపు 400 కోట్ల నెట్ వర్త్ కలిగిన రణ్వీర్ సొంతం. దీని కంఫర్ట్, రాయల్ లుక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.
6. జీఎంసీ హమ్మర్ ఈవీ..
ధర: సుమారు రూ. 4.5 కోట్లు
పర్యావరణంపై మక్కువతో రణ్వీర్ ఒక ఎలక్ట్రిక్ సూపర్ ట్రక్ ఎస్‌యూవీని కూడా కొనుగోలు చేశారు. ఆయన దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన వాహనాల్లో ఇది ఒకటి. దీని పవర్, లుక్ రోడ్డుపై వెళుతుంటే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
వీటితో పాటు రణ్వీర్ వద్ద కారు కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 1.28 నుండి 1.37 కోట్ల మధ్య ఉంటుంది.
ధురంధర్ జోరు..
ప్రస్తుతం రణ్వీర్ సింగ్ కెరీర్ పీక్స్‌లో ఉందని చెప్పుకోవాలి. 'ధురంధర్' సూపర్ హిట్ తర్వాత, ఇటీవలే విడుదలైన దాని సీక్వెల్ 'ధురంధర్ 2' కూడా అద్భుతమైన టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. 3 రోజుల్లో 500 కోట్లు కొల్లగొట్టింది.
ఈ మూడు రోజుల నెట్ కలెక్షన్స్‌తో ‘ధురంధర్ 2’ సినిమా హృతిక్ రోషన్ ‘వార్’ (రూ. 318 కోట్లు), సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ (రూ. 282.79 కోట్లు) వంటి చిత్రాల లైఫ్ టైమ్ వసూళ్లను అలవోకగా దాటేసింది. గతేడాది విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ (రూ. 236 కోట్లు) రికార్డును కూడా ధురంధర్ ది రివేంజ్ చిత్రం ఎప్పుడో అధిగమించింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.