పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి మరోసారి నిప్పులు చెరిగారు. వైట్ హౌస్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన, ఇరాన్ గత నాలుగు దశాబ్దాలకు పైగా ప్రపంచానికి చేసిన నష్టానికి ఇప్పుడు తగిన శిక్ష అనుభవిస్తోందని వ్యాఖ్యానించారు. "చరిత్రలో ఏ దేశం చూడనంత భారీ దెబ్బను ఇరాన్‌కు రుచి చూపించాం.. అయినా ఇరాన్‌తో మా పని ఇంకా పూర్తి కాలేదు" అంటూ ట్రంప్ హెచ్చరించడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
‘47 ఏళ్ల పాపానికి ప్రతిఫలం’

ఇరాన్ పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ట్రంప్, ఆ దేశం గత 47 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సాగిస్తున్న విచ్ఛిన్నకర చర్యలకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోందని విమర్శించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా ఇప్పటికే తుడిచిపెట్టేసిందని, ఇరాన్ నావికాదళం, ఆర్మీ కథ ముగిసిపోయిందని ఆయన ఘంటాపథంగా చెప్పారు.
ముగియని యుద్ధం.. పెరుగుతున్న హెచ్చరికలు
హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మందుపాతరలు వేస్తోందన్న వార్తల నేపథ్యంలో, ట్రంప్ తన హెచ్చరికల తీవ్రతను పెంచారు. "ఇరాన్ తలవంచకపోతే మునుపెన్నడూ చూడని రీతిలో సైనిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు. అయితే, అమెరికా గడ్డపై ఇరాన్ దాడులు చేయగలదన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు. చమురు కంపెనీలు భయం లేకుండా హార్ముజ్ జలసంధి గుండా తమ రవాణాను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రాంతీయ యుద్ధంగా మారుతున్న సంక్షోభం
అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు పశ్చిమాసియా మొత్తాన్ని చుట్టుముట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు గల్ఫ్ దేశాలలోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. దీనివల్ల యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్ వంటి పొరుగు దేశాలు కూడా డ్రోన్, క్షిపణి దాడుల భయంతో వణికిపోతున్నాయి.
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు.. "నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే యుద్ధం ముగుస్తుంది.. అది చాలా త్వరలోనే జరగొచ్చు" అని ట్రంప్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఐతే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే ఇరు దేశాలూ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు.. "నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే యుద్ధం ముగుస్తుంది.. అది చాలా త్వరలోనే జరగొచ్చు" అని ట్రంప్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఐతే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే ఇరు దేశాలూ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}1. ఇరాన్‌పై ట్రంప్ చేసిన ప్రధాన విమర్శ ఏమిటి?
ఇరాన్ గత 47 ఏళ్లుగా ప్రపంచానికి కలిగించిన నష్టానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోందని, చరిత్రలో ఏ దేశం చూడనంత తీవ్రమైన దాడులను ఎదుర్కొంటోందని ట్రంప్ విమర్శించారు.
2. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా పరిస్థితి ఏమిటి?
ఇరాన్ దాడుల భయం ఉన్నప్పటికీ, చమురు కంపెనీలు యధావిధిగా రవాణా కొనసాగించాలని ట్రంప్ సూచించారు. అయితే, ఇరాన్ మందుపాతరలు వేస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
3. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని ట్రంప్ చెప్పారు?
"నేను ఎప్పుడు చెప్పినా ఈ యుద్ధం ముగుస్తుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే దెబ్బతిందని ఆయన వాదిస్తున్నారు.