రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) పరిధిలోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన 'డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్' (డీఐపీఏఎస్).. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. దేశ రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధనల్లో భాగస్వాములయ్యేందుకు ఇదొక గొప్ప అవకాశం.
డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026- ముఖ్యమైన వివరాలు, తేదీలు..

ఈ డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026 ప్రోగ్రామ్ జులై 1న ప్రారంభమై ఆరు నెలల పాటు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 15, 2026.
మొత్తం ఖాళీలు: 08.
ఇంటర్న్‌షిప్ ప్రారంభం: జులై 1, 2026 (తాత్కాలికం).
డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026- అర్హతలు..
2026-2027 విద్యా సంవత్సరంలో కింది కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు:
బీ.ఈ / బీ.టెక్
ఎం.ఈ / ఎం.టెక్
డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026- స్టైపెండ్, సర్టిఫికేట్..
ఈ ఆరు నెలల శిక్షణా కాలంలో ఎంపికైన అభ్యర్థులకు మొత్తం రూ. 30,000 స్టైపెండ్ అందిస్తారు. దీనిని రెండు విడతల్లో చెల్లిస్తారు:
మొదటి 3 నెలల తర్వాత: రూ. 15,000.
చివరి 6 నెలల తర్వాత: రూ. 15,000.
గమనిక: నెలకు కనీసం 15 రోజుల హాజరు తప్పనిసరి. అలాగే, 6 నెలల కోర్సును పూర్తి చేయని విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ మంజూరు అవ్వదు.
డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026- దరఖాస్తు విధానం
డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026 కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన ధృవపత్రాలతో కలిపి కింది చిరునామాకు పంపాలి:
{{/usCountry}}డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026 కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన ధృవపత్రాలతో కలిపి కింది చిరునామాకు పంపాలి:
{{/usCountry}}చిరునామా:
The Director, Defence Institute of Physiology and Allied Sciences (DIPAS), DRDO, Lucknow Road, Timarpur, Delhi - 110054.
ఎన్వలప్ పైన తప్పనిసరిగా “Application for Paid Internship with Discipline” అని మీరు ఏ విభాగానికి దరఖాస్తు చేస్తున్నారో స్పష్టంగా రాయాలి.
డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026- ఎంపికైన తర్వాత సమర్పించాల్సిన పత్రాలు..
ఒకవేళ మీరు ఎంపికైతే, జాయినింగ్ సమయంలో కింది పత్రాలు అవసరమవుతాయి:
పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్.
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ): సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి లెటర్ హెడ్ పైన తీసుకోవాలి. ఇందులో సదరు విద్యార్థి దిల్లీలోని డీఐపీఏఎస్ లేదా హల్ద్వానీలోని డీఐబీఈఆర్లో శిక్షణ పొందేందుకు అనుమతిస్తున్నట్లు ఉండాలి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in ను సందర్శించవచ్చు.
అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఇంటర్న్‌షిప్ ఎక్కడ ఉంటుంది?
రిజల్ట్స్‌ని బట్టి దిల్లీలోని DIPAS లేదా హల్ద్వానీలోని DIBER లో అభ్యర్థులకు శిక్షణ కేటాయిస్తారు.
2. స్టైపెండ్ నెలకు రూ. 30,000 ఇస్తారా?
లేదు, ఆరు నెలల మొత్తం ఇంటర్న్‌షిప్ కాలానికి గాను రూ. 30,000 ఇస్తారు (అంటే సగటున నెలకు రూ. 5,000 చొప్పున లెక్కింస్తారు. కానీ దీనిని రెండు విడతల్లో మాత్రమే చెల్లిస్తారు).
3. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చా?
దరఖాస్తు ఫారమ్‌ను వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు, కానీ దానిని పూర్తి చేసి పోస్ట్ ద్వారా మాత్రమే పంపాల్సి ఉంటుంది.