...
...
Next Story

DRDO Recruitment 2026 : నెలకు రూ. 1.23లక్షల వరకు జీతంతో డీఆర్​డీఓలో సైంటిస్ట్​ ఉద్యోగాలు- వివరాలు..

DRDO Scientist Recruitment 2026 : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) వివిధ విభాగాల్లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 19, 2026 లోపు ఆర్ఏసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Jun 7, 2026, 10:43:02 IST
Advertisement

దేశ రక్షణ రంగంలో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసే ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి సువర్ణావకాశం లభించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) వివిధ గ్రేడ్‌ల్లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్​ఏసీ) అధికారిక పోర్టల్ rac.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

డీఆర్​డీఓ సైంటిస్ట్​ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..
డీఆర్​డీఓ సైంటిస్ట్​ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..

రక్షణ రంగ పరిశోధనలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో భాగస్వాములు కాగల అనుభవజ్ఞులైన నిపుణుల కోసం డీఆర్‌డీఓ ఎదురుచూస్తోందని అధికారిక నోటిఫికేషన్ పేర్కొంది. ఇక్కడ ఎంపికైన అభ్యర్థులకు జాతీయ భద్రత, స్వదేశీ రక్షణ సామర్థ్యాల పెంపుదలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులలో పనిచేసే అద్భుతమైన అవకాశం లభిస్తుంది.

డీఆర్​డీఓ రిక్రూట్​మెంట్​ 2026- మొత్తం 33 పోస్టుల భర్తీ..

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సైంటిస్ట్ సీ, సైంటిస్ట్ డీ, సైంటిస్ట్ ఈ విభాగాల్లో మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను జూన్ 19, 2026 సాయంత్రం 4 గంటలలోపు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలిs.

మొత్తం ఖాళీల్లో సైంటిస్ట్ సీ పోస్టులు 20, సైంటిస్ట్ డీ పోస్టులు 11, సైంటిస్ట్ ఈ పోస్టులు 2 ఉన్నాయి.

డీఆర్​డీఓ రిక్రూట్​మెంట్​ 2026- అర్హతలు, వయోపరిమితి, జీతాల వివరాలు..

సైంటిస్ట్ సీ-

అనుభవం: అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తుదారుల గరిష్ట వయసు 35 ఏళ్లు మించకూడదు.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం నెలకు రూ. 67,700 బేసిక్ పే లభిస్తుంది.

అనుభవం: అభ్యర్థులకు కనీసం ఏడేళ్ల పని అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లుగా నిర్ణయించారు.

జీతం: ఈ పోస్టుకు నెలకు రూ. 78,800 బేసిక్ పే అందుతుంది.

CTET September 2026 : సీటెట్​ పరీక్షకు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? ఇంకొన్ని రోజులో ఛాన్స్..

సైంటిస్ట్ ఈ-

అనుభవం: అభ్యర్థులకు సంబంధిత విభాగంలో కనీసం 11 ఏళ్ల లోతైన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఈ పోస్టుకు కూడా గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లుగా ఉంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,23,100 బేసిక్ పే లభిస్తుంది.

డీఆర్​డీఓ రిక్రూట్​మెంట్​ 2026- ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా ఆర్‌ఏసీ పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ అందుబాటులో ఉన్న వివరణాత్మక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, తమ అర్హతలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్హతలు, వయసు, అనుభవానికి సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుని, గడువు ముగిసేలోపు ఆన్‌లైన్ ఫారమ్‌ను ఖచ్చితమైన వివరాలతో పూర్తి చేయాల్సి ఉంటుంది.

డీఆర్​డీఓ సైంటిస్ట్ రిక్రూట్​మెంట్​ 2026కి అప్లై చేసుకునేందుకు కావాల్సిన డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks