Asian Games 2026: ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఇవాళ (సెప్టెంబర్ 20) ఈ ఆసియా క్రీడల షూటింగ్ లో భారత్ కు రెండు సిల్వర్ మెడల్స్ వచ్చాయి. 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ టీమ్, ఇండివిజువల్ విభాగంలో రజత పతకాలు ఖాతాలో వేసుకుంది.
ఎలవెనిల్ అదుర్స్

ఆసియా క్రీడలు 2026లో ఐచి జనరల్ షూటింగ్ రేంజ్ వేదికగా జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 27 ఏళ్ల ఎలవెనిల్ వలరివన్ అదరగొట్టింది. మొదటి 5 షాట్ల సిరీస్ నుంచే లీడ్ సాధించిన ఆమె, 24 షాట్ల ఫైనల్లో 20వ షాట్ వరకు మొదటి స్థానంలోనే కొనసాగింది. అయితే చివరి నాలుగు షాట్లలో స్థానిక జపాన్ క్రీడాకారిణి తైచి హినాటా ఊహించని రీతిలో పుంజుకుంది.
జస్ట్ లో గోల్డ్ మిస్
చివరకు హినాటా 253.0 పాయింట్లతో గేమ్స్ రికార్డును తిరగరాస్తూ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఎలవెనిల్ 252.4 పాయింట్లతో రజతాన్ని అందుకుంది. దక్షిణ కొరియాకు చెందిన బాన్ హ్యోజిన్ కాంస్య పతకం గెలుచుకుంది. ఈ ఈవెంట్‌లో తొలిసారి పోటీపడిన మరో భారత షూటర్ సోనమ్ మస్కర్ ఆరో స్థానంతో ముగించింది. కేవలం 0.6 పాయింట్ల తేడాతో ఎలవెనిల్ గోల్డ్ మిస్ అయింది.
ఏషియన్ గేమ్స్ చరిత్రలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇది ఆరో పతకం. అయితే తన మెంటార్ గగన్ నారంగ్ (2010) తర్వాత రజతం సాధించిన రెండో భారత షూటర్‌గా ఎలవెనిల్ రికార్డు సృష్టించింది.
టీమ్ విభాగంలోనూ సిల్వర్
వ్యక్తిగత విభాగంలో రజతం సాధించడానికి కొన్ని గంటల ముందే ఎలవెనిల్ టీమ్ విభాగంలోనూ భారత జట్టుకు సిల్వర్ మెడల్ అందించడం విశేషం. ఎలవెనిల్, సోనమ్ మస్కర్, విధార్సా వినోద్‌లతో కూడిన భారత త్రయం మొత్తం 1898 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. చైనా జట్టు 1904.2 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా, జపాన్ జట్టు కాంస్యాన్ని సొంతం చేసుకుంది.
క్రికెట్ ఫైనల్లో భారత్
{{/usCountry}}వ్యక్తిగత విభాగంలో రజతం సాధించడానికి కొన్ని గంటల ముందే ఎలవెనిల్ టీమ్ విభాగంలోనూ భారత జట్టుకు సిల్వర్ మెడల్ అందించడం విశేషం. ఎలవెనిల్, సోనమ్ మస్కర్, విధార్సా వినోద్‌లతో కూడిన భారత త్రయం మొత్తం 1898 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. చైనా జట్టు 1904.2 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా, జపాన్ జట్టు కాంస్యాన్ని సొంతం చేసుకుంది.
క్రికెట్ ఫైనల్లో భారత్
{{/usCountry}}మరోవైపు ఆసియా గేమ్స్ 2026 విమెన్ క్రికెట్ లో ఇండియా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం సెమీస్ లో భారత్ 114 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లోల 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. షెఫాలి వర్మ 49 బాల్స్ లోనే 100 రన్స్ కొట్టింది.
ఛేజింగ్ లో బంగ్లా 81 రన్స్ కే ఆలౌటైంది. భారత బౌలర్లలో నందని శర్మ 3, దీప్తి శర్మ 3, శ్రీ చరణి 2 వికెట్లు తీశారు. ఆసియా క్రీడల్లో ఫైనల్ చేరడంతో భారత విమెన్ టీమ్ కనీసం సిల్వర్ ఖాయం చేసింది.