...
...
Next Story

PF withdrawal rules : ఉద్యోగం కోల్పోతే.. పీఎఫ్​ డబ్బులు మొత్తం విత్​డ్రా చేసుకోవచ్చా?

సడెన్​గా ఉద్యోగం కోల్పోతే.. పీఎఫ్​ డబ్బులు ఎంత వరకు విత్​డ్రా చేసుకోవచ్చు? అని చాలా మంది వేతన జీవులకు సందేహం ఉంటుంది. ఈ విషయాన్ని ఈపీఎఫ్​ స్కీమ్ 2026లో స్పష్టంగా చేప్పారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 16, 2026, 10:45:49 IST
Advertisement

ఉద్యోగం కోల్పోవడం ఎవరికైనా సరే మానసిక ఆందోళన కలిగించే విషయమే. అద్దెలు, ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు తలచుకుంటే నిద్ర కరువవుతుంది. ఇలాంటి కష్టకాలంలో జీతభత్యాల మీద ఆధారపడే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)సమయానికి ఆదుకుంటుంది. అయితే ఉద్యోగం పోయినప్పుడు మన ఖాతాలో ఉన్న డబ్బులో ఎంత మొత్తం వెత్‌డ్రా చేసుకోవచ్చనే సందేహం చాలా మందిలో వస్తుంటుంది.

పీఎఫ్​ కొత్త విత్​డ్రా రూల్స్ తెలుసుకోండి..
పీఎఫ్​ కొత్త విత్​డ్రా రూల్స్ తెలుసుకోండి..

కొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026 నిబంధనల ప్రకారం.. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు! మిగిలిన 25 శాతం మొత్తాన్ని మాత్రం 12 నెలల పాటు మీ ఖాతాలోనే ఉంచాల్సి ఉంటుంది.

పాత ఈపీఎఫ్ స్కీమ్ 1952 స్థానంలో ఈ కొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026ను అమల్లోకి తెచ్చారు.

ఉదాహరణకు మీ ఉద్యోగం పోయిన సమయంలో పీఎఫ్ ఖాతాలో రూ. 5 లక్షలు ఉన్నాయని అనుకుందాము.

మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్: రూ. 5 లక్షలు

మీరు విత్‌డ్రా చేసుకోగలిగే 75% మొత్తం: రూ. 3.75 లక్షలు

ఖాతాలో అలాగే ఉండే 25% మొత్తం: రూ. 1.25 లక్ష

ఉద్యోగం కోల్పోయిన వెంటనే మీరు రూ. 3.75 లక్షల వరకు డ్రా చేసుకోవచ్చు. మిగిలిన రూ. 1.25 లక్ష మీ ఖాతాలోనే భద్రంగా ఉంటుంది. ఒకవేళ మీరు వరుసగా 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

ఉదాహరణకు ఆగస్టు 2026లో మీ ఉద్యోగం పోయి, ఆ తర్వాత కూడా ఉపాధి లభించకపోతే, ఆ 12 నెలల గడువు ఆగస్టు 2027 వరకు వర్తిస్తుంది. ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత మిగిలిన డబ్బును కూడా తీసుకోవచ్చు.

మరి.. 12 నెలలు పూర్తికాకముందే కొత్త ఉద్యోగం వస్తే?

ఒకవేళ మీరు ఇటీవలె ఉద్యోగం కోల్పోయి ఉంటే, ముందుగా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ని సరిచూసుకోండి. ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్ ద్వారా లేదా ఉమంగ్ యాప్ సహాయంతో బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

  • మీ యూఏఎన్ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో చూసుకోండి.
  • కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోండి.
  • ముఖ్యంగా మీ పీఎఫ్ ఖాతాకు ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి, ప్రాపర్ వెరిఫికేషన్ పూర్తయిందా లేదా అనేది ముందే చెక్ చేసుకోవడం మంచిది.
  • వివరాల్లో ఏదైనా పొరపాట్లు ఉంటే లేదా వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంటే పీఎఫ్ డబ్బు జమ కావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks