ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పరిధిలోకి వచ్చే వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు సామాజిక భద్రతను మరింత విస్తరించే దిశగా ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచుతూ కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.
12 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక పెంపు

సరిగ్గా 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ వేతన పరిమితిని సవరించడం గమనార్హం. గతంలో 2004 నుంచి 2014 వరకు ఈ పరిమితి ఎలాంటి మార్పు లేకుండా కొనసాగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2014లో దీనిని రూ.15,000గా నిర్దేశించారు. నాటి నుంచి పెరుగుతున్న ఆదాయాలు, మారిన ఆర్థిక పరిస్థితులు, అధికారిక ఉపాధి రంగా విస్తరణను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తాజాగా రూ.25,000కి పెంచింది.
51 లక్షల మంది ఉద్యోగులకు అదనంగా లబ్ధి
"కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం తప్పనిసరి సామాజిక భద్రత పరిధిలోకి వస్తారు" అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. ఈ పెంపు ద్వారా ఎక్కువ మంది కార్మికులకు చట్టబద్ధమైన సామాజిక ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
రూ.56,696 కోట్ల భారీ వ్యయం
ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ప్రస్తుతం ఈ పథకానికి వార్షిక బడ్జెట్ రూపంలో రూ.10,250 కోట్లు కేటాయిస్తుండగా, కొత్త సవరణతో ప్రభుత్వం చేసే వార్షిక వ్యయం రూ.11,339 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ సామాజిక భద్రతా పథకాల నిమిత్తం ప్రభుత్వం సుమారు రూ.56,696 కోట్లు వెచ్చించనుంది.
విస్తృతమైన సామాజిక భద్రతా వ్యవస్థ
ఈపీఎఫ్‌ఓ ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ)లను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు 7.68 లక్షల సంస్థలలో 7.98 కోట్ల మంది చందాదారులు ఈపీఎఫ్‌ఓ సేవలు పొందుతున్నారు. అలాగే ఈపీఎస్ పథకం ద్వారా సుమారు 82 లక్షల మంది పింఛనుదారులు ప్రతి నెలా పెన్షన్ ప్రయోజనాలు అందుకుంటున్నారు. తాజా వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల దీర్ఘకాలిక రిటైర్మెంట్ భద్రత మరింత బలపడనుంది.
{{/usCountry}}ఈపీఎఫ్‌ఓ ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ)లను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు 7.68 లక్షల సంస్థలలో 7.98 కోట్ల మంది చందాదారులు ఈపీఎఫ్‌ఓ సేవలు పొందుతున్నారు. అలాగే ఈపీఎస్ పథకం ద్వారా సుమారు 82 లక్షల మంది పింఛనుదారులు ప్రతి నెలా పెన్షన్ ప్రయోజనాలు అందుకుంటున్నారు. తాజా వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల దీర్ఘకాలిక రిటైర్మెంట్ భద్రత మరింత బలపడనుంది.
{{/usCountry}}ఈ మార్పు వల్ల ఎక్కువ మందికి ఎలా లబ్ధి చేకూరుతుందో ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు.
1. గతంలో ఉన్న నిబంధన (రూ. 15,000 పరిమితి)
ఒక ఉద్యోగి బేసిక్ జీతం రూ. 15,000 వరకు ఉంటే, సదరు సంస్థ ఆ ఉద్యోగికి కచ్చితంగా (Mandatory) పీఎఫ్ ఖాతా తెరిచి పీఎఫ్ జమ చేయాలి.
జీతం రూ. 15,001 దాటితే, ఆ ఉద్యోగికి పీఎఫ్ ఇవ్వాలా వద్దా అనేది కంపెనీ యాజమాన్యం, ఉద్యోగి ఇష్టాయిష్టాలపై (Voluntary) ఆధారపడి ఉండేది. చాలా కంపెనీలు రూ. 15,000 దాటిన వారికి పీఎఫ్ సౌకర్యం కల్పించేవి కావు.
2. కొత్త నిబంధన (రూ. 25,000 పరిమితి)
ప్రభుత్వం ఈ గరిష్ఠ పరిమితిని రూ. 15,000 నుంచి రూ. 25,000కి పెంచింది.
దీని అర్థం: ఇకపై నెలవారీ జీతం రూ. 25,000 వరకు ఉన్న ప్రతి ఒక్కరికీ కంపెనీలు తప్పనిసరిగా పీఎఫ్ ఖాతా తెరిచి డబ్బులు జమ చేయాల్సిందే.
3. లబ్ధిదారుల సంఖ్య ఎలా పెరుగుతుంది?
రూ. 15,001 నుంచి రూ. 25,000 మధ్య జీతం పొందుతున్న ఉద్యోగులు (ఉదాహరణకు రూ. 18,000 లేదా రూ. 22,000 సంపాదించేవారు) ఇప్పటివరకు కంపెనీల నిబంధనల వల్ల పీఎఫ్ పరిధికి దూరంగా ఉన్నారు.
ఇప్పుడు గరిష్ఠ పరిమితిని రూ. 25,000కి పెంచడంతో, ఈ శ్రేణిలో ఉన్న సుమారు 51 లక్షల మంది ఉద్యోగులు కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వస్తారు.
వీరికి పీఎఫ్ పొదుపుతో పాటు ప్రతి నెలా పింఛను పథకం (EPS), ఉచిత ఇన్సూరెన్స్ (EDLI) ప్రయోజనాలు చట్టబద్ధంగా అందుతాయి.