లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన ఘిస్లైన్ మాక్స్‌వెల్ ఇంట్లో గతంలో జరిగిన ఒక పార్టీకి.. ప్రస్తుత న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి, ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్ హాజరయ్యారని తాజాగా విడుదలైన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైళ్లు చెబుతున్నాయి. 2009లో ఆమె తీసిన “అమేలియా” సినిమా విడుదలైన సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా న్యాయశాఖ తాజాగా 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 2,000 వీడియోలు, 1,80,000 చిత్రాలను విడుదల చేసింది. ఇందులో 2009 అక్టోబర్ 21న అమెరికన్ పబ్లిసిస్ట్ పెగ్గీ సీగల్, ఎప్స్టీన్కు పంపిన ఒక ఈమెయిల్ కీలకంగా మారింది. పార్టీ ముగిసిన వెంటనే అర్ధరాత్రి సమయంలో పంపిన ఈ మెయిల్, ఆ వేడుకలోని అంతర్గత విషయాలను వెల్లడిస్తోంది.
ఈ పార్టీకి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ వంటి వారు సైతం హాజరయ్యారు.
"ఇప్పుడే ఘిస్లైన్ ఇంటి నుంచి వస్తున్నాను.. బిల్ క్లింటన్, జెఫ్ బెజోస్ అక్కడ ఉన్నారు.. డైరెక్టర్ మీరా నాయర్, జీన్ పిగోని తదితరులు పాల్గొన్నారు," అని ఆ మెయిల్‌లో ఉంది. అయితే మీరా నాయర్ సినిమాపై అతిథుల స్పందన అంతంతమాత్రంగానే ఉందని, ముఖ్యంగా మహిళలకు ఆ చిత్రం బాగా నచ్చిందని పెగ్గీ సీగల్ పేర్కొన్నాడు. బ్లూమింగ్‌డేల్స్ అనే స్టోర్‌లో జరిగిన పార్టీ వింతగా ఉందని, తాను రేపు 'వాల్ స్ట్రీట్ 2' షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని ఆమె ఆ మెయిల్‌లో వివరించారు.
ఎప్‌స్టీన్ ఫైళ్లలో ఉన్న మరికొన్ని కీలక పేర్లు..
ఈ ఎప్‌స్టీన్ ఫైళ్లలో అనేక మంది ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే, వీరిలో ఎవరిపైనా నేరారోపణలు రుజువు కాలేదని గమనించాలి.
{{/usCountry}}ఈ ఎప్‌స్టీన్ ఫైళ్లలో అనేక మంది ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే, వీరిలో ఎవరిపైనా నేరారోపణలు రుజువు కాలేదని గమనించాలి.
{{/usCountry}}డొనాల్డ్ ట్రంప్: ఈ ఫైళ్లలో డొనాల్డ్ ట్రంప్‌పై ఎఫ్‌బీఐ సేకరించిన లైంగిక వేధింపుల ఆరోపణల జాబితా ఉంది. వీటిలో చాలా వరకు అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చినవి, వాస్తవమని నిరూపితం కానివి ఉన్నాయి. ఈ ఆరోపణలను ట్రంప్ ఎప్పటి నుంచో ఖండిస్తున్నారు. తాజాగా అమెరికా న్యాయశాఖ స్పందిస్తూ.. "2020 ఎన్నికలకు ముందు ట్రంప్‌పై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు అవాస్తవంస సంచలనం కోసం సృష్టించినవి," అని క్లీన్ చిట్ ఇచ్చింది.
బిల్ గేట్స్: ఎప్‌స్టీన్ రాసిన ఒక డ్రాఫ్ట్ ఈమెయిల్‌లో బిల్ గేట్స్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రష్యా అమ్మాయిలతో గేట్స్ ఏకాంతంగా గడపడానికి తాను మందులు సరఫరా చేయడంతో పాటు వివాహిత మహిళలతో ఆయన రహస్యంగా కలవడానికి ఏర్పాట్లు చేశానని ఎప్‌స్టీన్ ఆ మెయిల్‌లో పేర్కొన్నాడు.
రిచర్డ్ బ్రాన్సన్: బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్‌తో ఎప్స్టీన్కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్లు ఫైళ్లు వెల్లడిస్తున్నాయి. 2013లో బ్రాన్సన్, ఎప్స్టీన్కు పంపిన మెయిల్‌లో.. "నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. నీవు ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా.. నీ బృందంతో కలిసి రావాలి" అని కోరారు.
ఎలాన్ మస్క్: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఎప్‌స్టీన్ మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలు కూడా తాజాగా బయటపడ్డాయి. 2012లో మస్క్‌కు ఎప్‌స్టీన్ మెయిల్ చేస్తూ.. ద్వీపానికి హెలికాప్టర్‌లో ఎంతమంది వస్తున్నారని అడిగారు. దానికి మస్క్ బదులిస్తూ.. "నేను, తలులా (అప్పటి మస్క్ భార్య) మాత్రమే వస్తున్నాం. మీ ద్వీపంలో అత్యంత క్రేజీ పార్టీ ఏ రోజు జరుగుతుంది?" అని ప్రశ్నించారు.
ప్రపంచాన్ని శాసించే వ్యక్తుల పేర్లు ఈ స్థాయిలో ఎప్‌స్టీన్ లాంటి నేరస్తుడితో ముడిపడి ఉండటం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను దుమారానికి దారితీస్తోంది.