ఆన్లైన్లో ఎంబీఏ కోర్సులు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి అలర్ట్! ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్ కోర్సుల్లో బెస్ట్ ఆన్‌లైన్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026ని విడుదల చేసింది ప్రతిష్టాత్మకమైన 'ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ)'. ఈ ఏడాది కూడా స్పెయిన్‌కు చెందిన ఐఈ బిజినెస్ స్కూల్ (IE Business School) తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా నాలుగోసారి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆన్‌లైన్ ఎంబీఏ పీఠాన్ని కైవసం చేసుకుంది.

ముఖ్యంగా జీతాల పెంపు విషయంలో ఈ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు తమ పాత జీతం కంటే సగటున 42 శాతం అధిక వేతనాన్ని పొందుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
జీతాల్లో 'ఇంపీరియల్' రికార్డు..
లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ బిజినెస్ స్కూల్ ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అయితే, అత్యధిక సగటు వేతనం విషయంలో మాత్రం ఇదే టాప్. ఇక్కడ చదివిన వారు ఏడాదికి సుమారు 2,54,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 2.38 కోట్లు) ఆర్జిస్తున్నారు. అకాడమిక్ రీసెర్చ్ విభాగంలోనూ ఈ సంస్థ ప్రపంచస్థాయిలో రెండో స్థానంలో నిలవడం విశేషం.
కెరీర్ వృద్ధిలో వార్విక్ జోరు..
మూడో స్థానంలో నిలిచిన వార్విక్ బిజినెస్ స్కూల్, కెరీర్ పురోగతి విభాగంలో నంబర్ వన్‌గా నిలిచింది. ఒక సంస్థలో ఉన్నత స్థాయి బాధ్యతలు చేపట్టడం, కెరీర్‌లో వేగంగా ఎదగడం వంటి అంశాల్లో ఈ స్కూల్ విద్యార్థులు ముందున్నారు. ఇక్కడి గ్రాడ్యుయేట్ల సగటు జీతం 2,34,799 డాలర్లుగా నమోదైంది.
కొత్తగా చేరిన సంస్థలు.. ఇతర విశేషాలు..
ఈసారి ర్యాంకింగ్స్‌లో కొన్ని ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి:
బేయస్ బిజినెస్ స్కూల్ : తొలిసారిగా ఈ జాబితాలోకి ప్రవేశించి, నేరుగా నాలుగో స్థానాన్ని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
{{/usCountry}}బేయస్ బిజినెస్ స్కూల్ : తొలిసారిగా ఈ జాబితాలోకి ప్రవేశించి, నేరుగా నాలుగో స్థానాన్ని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
{{/usCountry}}యూనివర్సిటీ ఆఫ్ పోర్టో: ఆరో స్థానంలో నిలిచినప్పటికీ, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించే 'వాల్యూ ఫర్ మనీ' విభాగంలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచింది.
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (మార్షల్): అమెరికాకు చెందిన ఈ సంస్థ ఐదో స్థానాన్ని పొందింది. ఇక్కడి విద్యార్థులు సగటున 2,12,000 డాలర్ల జీతాన్ని అందుకుంటున్నారు.
ఐరోపా హవా.. ఆన్‌లైన్ విద్యకు పెరుగుతున్న క్రేజ్!
ఈ టాప్ ర్యాంకుల్లో మెజారిటీ సంస్థలు ఐరోపా ఖండానికి చెందినవే కావడం గమనార్హం. వ్యాపార విద్యలో యూరప్ తన పట్టును నిరూపించుకుంటోంది. ఉద్యోగం వదులుకోకుండానే ఉన్నత చదువులు చదవాలనుకునే నిపుణుల సంఖ్య పెరుగుతుండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.