...
...
Next Story

Stock market today : ఇరాన్​పై దాడుల ఎఫెక్ట్​- ఈరోజు స్టాక్​ మార్కెట్​ క్రాష్​ అనివార్యమేనా?

ఇరాన్​, అమెరికా, ఇజ్రాయెల్​ దాడుల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలకు నష్టాలు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో మార్చ్​ 2న గిఫ్ట్​ నిఫ్టీ లైవ్​, బంగారం- వెండి ధరలు, చమురు ధరలతో పాటు బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

Published on: Mar 2, 2026, 09:02:49 IST
Advertisement

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 961 పాయింట్లు పడి 81,287 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 318 పాయింట్లు కోల్పోయి 25,179 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 659 పాయింట్లు పడి 60,529 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

శనివారం ఇరాన్​పై అమెరికా- ఇజ్రాయెల్​లు సంయుక్త దాడులు చేశాయి. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 7,536.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,292.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 115 పాయింట్ల నష్టంలో ఉంది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న గందరగోళం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 ఇప్పటికే డౌన్​ ట్రెండ్​లో ఉన్నట్టు కనిపిస్తోంది. చార్ట్​ పాటర్న్​ కూడా నెగిటివ్​గానే ఉంది. సూచీ ఇక్కడి నుంచి 24,700 వరకు వెళ్లొచ్చు. 25,400 వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.00 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.4శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.92 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​ల పరిస్థితి కూడా ఇంతే! సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అనేక దేశాల సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్​ నిక్కీ 2శాతం పతనమైంది.

బంగారం, వెండి ధరలు ఇలా..

స్టాక్​ మార్కెట్​లలో అనిశ్చితి కనిపించినప్పుడు సేఫ్​ హెవెన్​గా భావించే బంగారం ధరలు పెరుగుతాయన్న విషయం తెలిసిందే. సోమవారం కూడా ఇదే జరిగింది.

అంతర్జాతీయ మార్కెట్​లో స్పాట్​ గోల్డ్​ ఔన్సుకు 5,400 డాలర్లను హిట్​ చేసింది. స్పాట్​ సిల్వర్​ ఔన్సుకు 96డాలర్లు దాటింది.

చమురు ధరలకు రెక్కలు..

ఆయిల్​ రిచ్​ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బ్రెంట్​ క్రూడ్​ 7.6శాతం వృద్ధిచెంది బ్యారెల్​కి 78.4 డాలర్ల మార్క్​ను తాకింది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ప్రెసిషన్​ వైర్స్​ ఇండియా- బై రూ. 312, స్టాప్​ లాస్​ రూ. 297, టార్గెట్​ రూ. 330

టీడీ పవర్​ సిస్టెమ్స్​- బై రూ. 903, స్టాప్​ లాస్​ రూ. 863, టార్గెట్​ రూ. 966

అపొలో పైప్స్​- బై రూ. 358, స్టాప్​ లాస్​ రూ. 344, టార్గెట్​ రూ. 388

ఐడీబీఐ బ్యాంక్​- బై రూ. 116, స్టాప్​ లాస్​ రూ. 112, టార్గెట్​ రూ. 123

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్​- బై రూ. 962, స్టాప్​ లాస్​ రూ. 904, టార్గెట్​ రూ. 1030

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe