Maxwell Retirement: ‘ఫైనల్ వరల్డ్ పాడ్‌కాస్ట్’ వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మ్యాక్స్‌వెల్ అభిమానులతో పంచుకున్నాడు. "ఇది కాస్త బాధాకరం, కానీ తప్పనిసరి నిర్ణయం. ఆస్ట్రేలియా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్‌కు, అలాగే విక్టోరియా జట్టుకు 50 ఓవర్లు, 4 రోజుల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నా. నా కెరీర్‌లో నాకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు ఈ విషయం చెప్పేటప్పుడు ఎమోషనల్ అయ్యాను" అని 38 ఏళ్ల మ్యాక్స్‌వెల్ అన్నాడు.
మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్

రాబోయే ఫ్రాంచైజీ టోర్నమెంట్ల కోసం తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని మ్యాక్స్‌వెల్ తెలిపాడు. 2025 జూన్‌లో టీమిండియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో మ్యాక్సీ ఆఖరి వన్డే ఆడాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో లాస్ట్ టీ20 ఆడాడు. ఏప్రిల్ లో ప్రకటించిన 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని తప్పించడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.
ఇంటర్నేషనల్ కెరీర్
తన సుదీర్ఘ కెరీర్‌లో ఆస్ట్రేలియా తరఫున 286 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 7226 పరుగులు చేయడంతో పాటు 136 వికెట్లు పడగొట్టాడు. 2015, 2023 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్లలో అతను కీలక సభ్యుడు. మొత్తం 7 టెస్టులు, 149 వన్డేలు (3990 రన్స్), 130 టీ20లు (2897 రన్స్) ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో 5 సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
కెరీర్‌లో టాప్ 3 బెస్ట్ ఇన్నింగ్స్
మ్యాక్స్‌వెల్ పేరు చెప్పగానే బౌలర్లకు వణుకు పుట్టే రేంజ్లో అతను ఇన్నింగ్స్ ఆడాడు. అందులో టాప్ 3 ఇవే..
- అఫ్ఘానిస్తాన్‌పై 201 నాటౌట్ (2023 వరల్డ్ కప్): 292 పరుగుల టార్గెట్.. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను మ్యాక్సీ ఒంటిచేత్తో గెలిపించాడు. కండరాలు పట్టేస్తున్నా ఒంటి కాలుతో పోరాడాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 రన్స్ చేసి ప్యాట్ కమిన్స్ తో కలిసి చారిత్రక విజయాన్ని అందించాడు.
- శ్రీలంకపై 145 నాటౌట్ (2016 టీ20): పల్లెకెలె వేదికగా జరిగిన టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మ్యాక్సీ కేవలం 65 బంతుల్లోనే 145 పరుగులు చేసి విద్వంసం సృష్టించాడు. ఇందులో 14 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.
- నెదర్లాండ్స్‌పై 106 రన్స్ (2023 వరల్డ్ కప్): వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ ఇది. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి వరల్డ్ రికార్డ్ సెట్ చేశాడు.
ఐపీఎల్ స్టాట్స్.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్
{{/usCountry}}మ్యాక్స్‌వెల్ పేరు చెప్పగానే బౌలర్లకు వణుకు పుట్టే రేంజ్లో అతను ఇన్నింగ్స్ ఆడాడు. అందులో టాప్ 3 ఇవే..
- అఫ్ఘానిస్తాన్‌పై 201 నాటౌట్ (2023 వరల్డ్ కప్): 292 పరుగుల టార్గెట్.. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను మ్యాక్సీ ఒంటిచేత్తో గెలిపించాడు. కండరాలు పట్టేస్తున్నా ఒంటి కాలుతో పోరాడాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 రన్స్ చేసి ప్యాట్ కమిన్స్ తో కలిసి చారిత్రక విజయాన్ని అందించాడు.
- శ్రీలంకపై 145 నాటౌట్ (2016 టీ20): పల్లెకెలె వేదికగా జరిగిన టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మ్యాక్సీ కేవలం 65 బంతుల్లోనే 145 పరుగులు చేసి విద్వంసం సృష్టించాడు. ఇందులో 14 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.
- నెదర్లాండ్స్‌పై 106 రన్స్ (2023 వరల్డ్ కప్): వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ ఇది. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి వరల్డ్ రికార్డ్ సెట్ చేశాడు.
ఐపీఎల్ స్టాట్స్.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్
{{/usCountry}}ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో 'బిగ్ షో' మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల తరఫున దుమ్మురేపాడు. ఐపీఎల్‌లో 134 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్సీ 157.6 స్ట్రైక్ రేట్‌తో 2771 పరుగులు చేశాడు.
స్పిన్నర్లపై రివర్స్ స్వీప్‌లతో అతను విరుచుకుపడే తీరు ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. 2014 సీజన్‌లో పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చడంలో అతనిదే కీ రోల్. కానీ గత కొన్ని సీజన్లలో అతను ఐపీఎల్ లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.
ఇండియా అల్లుడే!
గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఇండియా అంటే సెకండ్ హోమ్ లాంటిది. భారతీయ సంతతికి చెందిన వినీ రామన్ ను పెళ్లి చేసుకొని మన ఇండియన్ అల్లుడయ్యాడు. ఐపీఎల్ పుణ్యమా అని ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు విరాట్ కోహ్లితో మ్యాక్సీకి విడదీయరాని స్నేహబంధం ఏర్పడింది. ఇండియాలో మ్యాచ్ జరిగితే మ్యాక్స్‌వెల్‌కు మన ఫ్యాన్స్ బ్రహ్మరథం పడతారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ.. రాబోయే ఐపీఎల్ సీజన్లలో మ్యాక్సీ తన విధ్వంసాన్ని కొనసాగించనున్నాడు.