పండగల సీజన్ వేళ పసిడి, వెండి కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది. గురువారం (అక్టోబర్ 22) నాటి ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు మరింత పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) వేదికగా డిసెంబర్ కాంట్రాక్ట్ వెండి ధర ఒక్కరోజే కిలోకు రూ.8,593 క్షీణించి రూ.2,00,575 స్థాయికి పడిపోయింది. గత ఏడు నెలల్లో వెండికి ఇదే అతి తక్కువ ధర కావడం గమనార్హం.

మరోవైపు పసిడి ప్రాభవం కూడా మసకబారింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.2,300 మేర తగ్గి రూ.1,43,600 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల కనిష్ఠ స్థాయి. కాగా, ఈ అక్టోబర్ నెలలోనే బంగారం ధర 3.3 శాతం, వెండి ధర దాదాపు 10 శాతం మేర పడిపోవడం విశేషం.
చమురు మంట.. వడ్డీ రేట్ల అంచనాలు
మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో చమురు సరఫరాకు ఏర్పడిన విఘాతాలు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను పెంచేశాయి. సౌదీ అరేబియాలోని చమురు మౌలిక వసతులపై జరిగిన వరుస దాడులతో క్రూడాయిల్ సఫరాపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 112.38 డాలర్లకు చేరింది. గత ఐదు నెలల్లో చమురు ధరకు ఇదే గరిష్ఠ స్థాయి.
మరోవైపు వచ్చే నెలలో అమెరికాలో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై సైనిక చర్య తీవ్రతరం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెలువడుతున్న నివేదికలు క్రూడాయిల్ మార్కెట్‌లో కలకలం రేపాయి. పెరిగిన ఇంధన ధరల వల్ల ద్రవ్యోల్బణం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని, దాంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేట్లను మళ్లీ పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిసెంబర్‌లో 'ఫెడ్' వడ్డీ రేట్ల పెంపు ఖాయమేనా?
అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన తదుపరి సమావేశంలో (అక్టోబర్ 27-28) వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, డిసెంబర్ నాటికి మరోసారి వడ్డీ రేట్లు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం ఫెడ్ నిర్దేశించుకున్న 2 శాతం కంటే గణనీయంగా ఎక్కువగా ఉండటం, పైగా చమురు ధరల మంట తోడవడంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కఠిన ద్రవ్య విధానం (Monetary Policy) తప్పదని మార్కెట్ భావిస్తోంది.
{{/usCountry}}అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన తదుపరి సమావేశంలో (అక్టోబర్ 27-28) వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, డిసెంబర్ నాటికి మరోసారి వడ్డీ రేట్లు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం ఫెడ్ నిర్దేశించుకున్న 2 శాతం కంటే గణనీయంగా ఎక్కువగా ఉండటం, పైగా చమురు ధరల మంట తోడవడంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కఠిన ద్రవ్య విధానం (Monetary Policy) తప్పదని మార్కెట్ భావిస్తోంది.
{{/usCountry}}సిఎమ్‌ఈ (CME) ఫెడ్‌వాచ్ టూల్ సమాచారం ప్రకారం, డిసెంబర్ సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం 86 శాతంగా ఉందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరున (అక్టోబర్ 29న) వెలువడనున్న యూఎస్ వ్యక్తిగత వినియోగ వ్యయాల (PCE) గణాంకాలు వడ్డీ రేట్ల భవిష్యత్తు దిశను నిర్దేశించనున్నాయి.
సాధారణంగా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే లేదా యుఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ బలపడితే, ముదుపరులు బంగారం, వెండి వంటి సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల నుంచి నిధులను ఉపసంహరించి డాలర్ వైపు మళ్లిస్తారు. ఇది పసిడి, వెండి ధరలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.
(గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.)