బంగారంపై పెట్టుబడి పెట్టిన సామాన్య, మధ్యతరగతి ఇన్వెస్టర్లకు నేడు పండగ రోజు! కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన 'సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్బీజీ) 2018-19 సిరీస్-III' కాలపరిమితి నేటితో (నవంబర్ 13) ముగిసింది. ఈ బాండ్ల ఫైనల్ రిడెంప్షన్ ప్రైజ్ని గ్రాముకు రూ. 14,024గా ఆర్బీఐ ఖరారు చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఊహించని రీతిలో ఏకంగా 348 శాతం వరకు రాబడి దక్కింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోని కుటుంబాలు తరతరాలుగా పసిడి ఆభరణాల కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తుంటాయి. అయితే ఆభరణాలు కొంటే తరుగు, మజూరీ రూపంలో కొంత సొమ్ము నష్టపోవడంతో పాటు భద్రత సమస్య కూడా ఉంటుంది. అలాంటి ఇబ్బందులేవీ లేకుండా, భౌతిక బంగారాన్ని దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేకుండానే పసిడి ధరల పెరుగుదల ప్రయోజనాన్ని పొందేందుకు కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్లను తీసుకొచ్చింది. 2018 నవంబర్ 5 నుంచి 9 వరకు సబ్స్క్రిప్షన్ నిర్వహించి, నవంబర్ 13న ఈ సిరీస్ బాండ్లను ఆర్బీఐ జారీ చేసింది.
ఎనిమిదేళ్ల కాలపరిమితి పూర్తి కావడంతో తుది చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. “గోల్డ్ బాండ్లను జారీ చేసిన తేదీ నుంచి ఎనిమిదేళ్లు పూర్తయిన తర్వాత వాటిని తిరిగి చెల్లిస్తాం. దీని ప్రకారం ఈ సిరీస్ తుది రిడెంప్షన్ డేట్ 2026 నవంబర్ 13 అవుతుంది,” అని ఆర్బీఐ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తుది ధరను ఆర్బీఐ ఎలా లెక్కించింది?
సావరిన్ గోల్డ్ బాండ్ల తుది రిడెంప్షన్ వాల్యూ ప్రస్తుత మార్కెట్ బంగారం ధరలతో ముడిపడి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, విమోచన తేదీకి ముందు మూడు పని దినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా తుది రేటును నిర్ణయిస్తారు.
{{/usCountry}}సావరిన్ గోల్డ్ బాండ్ల తుది రిడెంప్షన్ వాల్యూ ప్రస్తుత మార్కెట్ బంగారం ధరలతో ముడిపడి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, విమోచన తేదీకి ముందు మూడు పని దినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా తుది రేటును నిర్ణయిస్తారు.
{{/usCountry}}“ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (ఐబీజీఏ) ప్రచురించిన గణాంకాల ప్రకారం, విమోచన తేదీకి ముందు మూడు పని దినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సాధారణ సగటు ఆధారంగా ఎస్జీబీ తుది ధరను ఖరారు చేస్తాం,” అని ఆర్బీఐ నోటిఫికేషన్లో పేర్కొంది. దీని ప్రకారం నవంబర్ 10, 11, 12 తేదీల్లో నమోదైన బంగారం ముగింపు ధరల సగటును లెక్కించి, నవంబర్ 13 తుది విమోచన ధరను గ్రాముకు రూ. 14,024గా ప్రకటించారు.
ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు.. గ్రాముకు ఎంతంటే?
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2018 నవంబర్ 2న విడుదల చేసిన పీఐబీ ప్రకటన ప్రకారం, అప్పట్లో సావరిగ్ గోల్డ్ బాండ్ 2018-19 సిరీస్-III అసలు ఇష్యూ ధరను ఆఫ్లైన్ ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ. 3,183గా నిర్ణయించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసి డిజిటల్ విధానంలో డబ్బు చెల్లించిన వారికి గ్రాముకు రూ. 50 రాయితీ ఇచ్చారు. దీనితో ఆన్లైన్ ఇన్వెస్టర్లకు గ్రాము బంగారం కేవలం రూ. 3,133కే లభించింది.
ఆర్బీఐ ప్రకటించిన రూ. 14,024 తుది ధరతో పోలిస్తే ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. ఆఫ్లైన్లో కొనుగోలు చేసిన వారికి గ్రాముకు రూ. 10,841 చొప్పున మూలధన లాభం దక్కుతోంది. ఆన్లైన్లో కొన్న వారికి గ్రాముకు రూ. 10,891 లాభం వస్తోంది. శాతం వారీగా చూస్తే ఆఫ్లైన్ ఇన్వెస్టర్లకు దాదాపు 341 శాతం, ఆన్లైన్ ఇన్వెస్టర్లకు ఏకంగా 348 శాతం రాబడి లభించినట్లయింది.
*వాస్తవ గెయిన్స్ మారవచ్చు.
బంగారం ధర పెరుగుదలకు అదనంగా 2.50% వడ్డీ ఆదాయం!
బంగారం ధర పెరుగుదల వల్ల వచ్చే లాభమే కాకుండా, ఎస్జీబీ ఇన్వెస్టర్లకు బాండ్ అసలు విలువపై ఏటా 2.50 శాతం స్థిర వడ్డీ కూడా లభించింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ వడ్డీని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. చివరి విడత వడ్డీని నేడు అసలు రిడెంప్షన్ మొత్తంతో కలిపి చెల్లిస్తున్నారు.
ఎస్జీబీ 2018-19 సిరీస్-III విషయంలో గ్రాము అసలు విలువ రూ. 3,183పై వడ్డీని లెక్కించారు. ఉదాహరణకు, ఒక ఇన్వెస్టర్ అప్పట్లో ఆఫ్లైన్లో 10 గ్రాముల బాండ్లను రూ. 31,830 పెట్టి కొనుగోలు చేశారనుకుంటే, వారికి ఏటా 2.5 శాతం చొప్పున రూ. 795.75 వడ్డీ ఆదాయం వచ్చింది. ఎనిమిదేళ్ల పూర్తి కాలపరిమితిలో వారికి అందిన మొత్తం వడ్డీ సుమారు రూ. 6,366గా ఉంది.
అయితే ఇవి అంచనా గణాంకాలు మాత్రమే; బాండ్లను కలిగి ఉన్న సమయం, చెల్లింపుల షెడ్యూల్ ఆధారంగా వాస్తవ వడ్డీ జమ అవుతుంది. ఎనిమిదేళ్ల క్రితం బంగారు ఆభరణాలకు బదులు ప్రభుత్వ గోల్డ్ బాండ్లను ఎంచుకున్న మదుపర్లకు ఈ నిర్ణయం భారీ ఆర్థిక ప్రయోజనాన్ని అందించింది.