Gold price today : అక్షయ తృతీయ వేళ తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Akshay tritiya 2026 : ఈ అక్షయ తృతీయకు బంగారం కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Published on: Apr 19, 2026, 10:00:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Akshay tritiya 2026 gold price : ఏప్రిల్​ 19, అక్షయ తృతీయ వేళ దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 1,55,780గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 15,57,800గా కొనసాగుతోంది.

ఓ వజ్రాల దుకాణంలో ప్రముఖ నటి సప్తమి గౌడ.. (PTI)
ఓ వజ్రాల దుకాణంలో ప్రముఖ నటి సప్తమి గౌడ.. (PTI)

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 1,42,800గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 14,28,000 వద్ద ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 14,280గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,42,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,930గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,16,840 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 1,42,800గా ఉంది.

Akshaya Tritiya : నేడే అక్షయ తృతీయ- తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుకు శుభ ముహూర్తం ఇదే..

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,43,600గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,56,660గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 1,42,800గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 1,55,780గాను ఉంది.

అక్షయ తృతీయ 2026 నేపథ్యంలో హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,42,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,16,840గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,42,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,55,780గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,42,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,55,780గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,42,850గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 1,14,280గా కొనసాగుతోంది. ముంబై​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,42,800గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,55,780గా ఉంది.

అమెరికా- ఇరాన్​ యుద్ధం నేపథ్యంలో బంగారం ధరలు గత కొంతకాలంగా తీవ్ర ఒడిగొడుకులకు గురవుతున్నాయి.

అక్షయ తృతీయ వేళ నేటి వెండి ధరలు ఇలా..

దేశంలో వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 27,500గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 2,75,000 వద్ద కొనసాగుతోంది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 2,80,000 పలుకుతోంది. విజయవాడలో సైతం వెండి ధర అదే విధంగా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తరచూ అడిగే ప్రశ్నలు-

  1. అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారు?

సమాధానం- సంస్కృతంలో 'అక్షయ' అంటే ఎప్పటికీ తరిగిపోనిది లేదా శాశ్వతమైనది అని అర్థం. ఈ రోజున చేసే ఏ చిన్న పనికైనా అనంతమైన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అక్షయ తృతీయ రోజును హిందూ క్యాలెండర్‌లో అత్యంత స్వయంసిద్ధ ముహూర్తంగా పరిగణిస్తారు.

2. 3. ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కొనాలా?

సమాధానం- లేదు, ఏదైనా లోహం (వెండి, రాగి) కొనవచ్చు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, దానధర్మాలు చేయడం కూడా అక్షయ ఫలితాలను ఇస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More