దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ తన ప్రయోగాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్ 'డ్రీమ్‌బీన్స్' (Dreambeans)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) వినియోగదారుల కోసం నవంబర్ 3న ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెరికా తర్వాత ఈ యాప్‌ను విస్తరించిన తొలి అంతర్జాతీయ మార్కెట్ భారత్ కావడం విశేషం. గూగుల్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఈ యాప్.. యూజర్ల ఆసక్తులు, దైనందిన కార్యకలాపాలకు అనుగుణంగా బొమ్మలు, వీడియోలతో కూడిన డిజిటల్ స్టోరీలను రూపొందిస్తుంది.
డ్రీమ్‌బీన్స్ ఎలా పనిచేస్తుంది?

వినియోగదారులు సెర్చ్ బార్‌లో టైప్ చేయడం లేదా ఫీడ్‌ను స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండానే డ్రీమ్‌బీన్స్ పనిచేస్తుంది. జీమెయిల్, గూగుల్ ఫోటోస్, క్యాలెండర్, సెర్చ్, జెమిని, యూట్యూబ్ వంటి సేవలతో ఈ యాప్‌ను అనుసంధానించవచ్చు. యూజర్లు కనెక్ట్ చేసిన ఖాతాలలోని సమాచారాన్ని విశ్లేషించి.. ప్రయాణాలు, కళలు-హస్తకళలు, స్థానిక కార్యక్రమాలు, రిమైండర్లు వంటి అంశాలపై రోజూ ఆకర్షణీయమైన విజువల్ స్టోరీలను ఆటోమేటిక్‌గా పంచుకుంటుంది.
ప్రతి స్టోరీని క్లిక్ చేసి పూర్తి వివరాలు చూడటంతో పాటు, భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోవచ్చు లేదా ఇతరులతో పంచుకోవచ్చు. ప్రారంభంలో కేవలం స్థిర ఏఐ చిత్రాలకే పరిమితమైన ఈ యాప్‌లో, ప్రస్తుతం 'వీయో' (Veo) ఏఐ మోడల్ సహాయంతో అనిమేటెడ్ వీడియోలను కూడా జోడించారు. యూజర్లు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ స్టోరీ కలెక్షన్లు రూపుదిద్దుకుంటాయి.
తెలుగు సహా 14 భాషల్లో లభ్యం
డ్రీమ్‌బీన్స్ యాప్ ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ, పంజాబీ, ఉర్దూ సహా 14 భాషలకు మద్దతు ఇస్తుంది. అయితే యూజర్లు ఒకేసారి ఒక భాషను మాత్రమే ఎంచుకునే వీలుంది. "వేర్వేరు భాషల్లోని సమాచారాన్ని ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఈ యాప్‌నకు ఉంది. అయితే హిందీ, ఇంగ్లీష్‌లను కలిపి ఒకే స్టోరీగా రూపొందించే మల్టీ-లింగ్వల్ సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు" అని గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ గాజ్డే ఓజ్నుర్ స్పష్టం చేశారు.
వ్యక్తిగత డేటా భద్రత.. ప్రైవసీపై స్పష్టత
జీమెయిల్ వంటి అత్యంత వ్యక్తిగత ఖాతాల సమాచారాన్ని యాప్ విశ్లేషిస్తుండటంతో డేటా ప్రైవసీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గూగుల్ స్పందిస్తూ.. వినియోగదారుల వ్యక్తిగతీకరించిన అనుభవం కోసం 'పర్సనల్ ఇంటెలిజెన్స్' సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
{{/usCountry}}జీమెయిల్ వంటి అత్యంత వ్యక్తిగత ఖాతాల సమాచారాన్ని యాప్ విశ్లేషిస్తుండటంతో డేటా ప్రైవసీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గూగుల్ స్పందిస్తూ.. వినియోగదారుల వ్యక్తిగతీకరించిన అనుభవం కోసం 'పర్సనల్ ఇంటెలిజెన్స్' సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
{{/usCountry}}"వినియోగదారులు తమకు నచ్చిన గూగుల్ సేవలను మాత్రమే డ్రీమ్‌బీన్స్‌కు అనుసంధానించుకోవచ్చు. ఎప్పుడైనా ఆ అనుసంధానాన్ని తొలగించే పూర్తి స్వేచ్ఛ వారికి ఉంటుంది" అని ఓజ్నుర్ వివరించారు. కనెక్ట్ చేసిన సేవల నుంచి ఏదైనా డేటాను డిలీట్ చేస్తే, డ్రీమ్‌బీన్స్ సిస్టమ్ నుంచి కూడా ఆ సమాచారం శాశ్వతంగా తొలగిపోతుందని గూగుల్ తెలిపింది. వ్యాపారపరమైన అంశాల సమాచారాన్ని స్టోరీలుగా చూపించవద్దని యూజర్లు యాప్‌ను కోరవచ్చు. కేవలం వ్యక్తిగత జీమెయిల్ ఖాతాలకు మాత్రమే ఇది పనిచేస్తుందని, రూపొందించిన స్టోరీలను కేవలం సదరు యూజర్ మాత్రమే చూడగలరని స్పష్టం చేశారు.
అమెరికా తర్వాత తొలి విదేశీ మార్కెట్‌గా భారత్
గూగుల్ ఈ ఏడాది జూన్‌లో డ్రీమ్‌బీన్స్ యాప్‌ను అమెరికాలో పరిచయం చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో 18 ఏళ్లు పైబడిన అందరికీ అందుబాటులోకి తెచ్చింది. సెన్సార్ టవర్ విశ్లేషణల ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు ఈ యాప్ 55,000 డౌన్‌లోడ్‌లను సాధించింది. ఇందులో 63 శాతం డౌన్‌లోడ్‌లు ఒక్క సెప్టెంబర్‌లోనే నమోదు కాగా, అక్టోబర్‌లో నెలవారీ ప్రాతిపదికన డౌన్‌లోడ్‌లు 84 శాతం తగ్గి 5,500కి పరిమితమయ్యాయి.
భారత్‌లో గూగుల్ సేవల వినియోగం, యూజర్ల ఆసక్తి అధికంగా ఉండటంతోనే తమ మొదటి అంతర్జాతీయ విస్తరణకు భారత్‌ను ఎంచుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఈ స్టోరీల ఆధారంగా యూజర్లు నేరుగా చర్యలు తీసుకునేలా యాప్‌ను మరింత మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది.